
సాక్షి, రాజంపేట: హీరో మంచు విష్ణు (Vishnu Manchu) అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలోని ఊటుకూరు భక్తకన్నప్ప గుడిని శనివారం సందర్శించాడు. కన్నప్ప చిత్రబృందంతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాడు. తమ గ్రామానికి విచ్చేసిన విష్ణుకు.. స్థానికులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
చరిత్ర తెలియజేయాలనే..
ఆలయ దర్శనానంతరం మంచు విష్ణు మాట్లాడుతూ.. భక్తకన్నప్ప చరిత్రను నేటి తరానికి తెలియజేయాలనే కన్నప్ప సినిమా (Kannappa Movie) తీశాం. ఏప్రిల్ 25న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఊటుకూరు భక్త కన్నప్ప గుడి అభివృద్ధికి కృషి చేస్తాను. ఆలయ పెద్దలతో మాట్లాడి గుడికి కావాల్సిన అవసరాలను తీరుస్తాను అని హామీ ఇచ్చాడు.
కన్నప్ప సినిమా విషయానికి వస్తే..
మంచు విష్ణు హీరోగా నటించిన చిత్రం కన్నప్ప. ప్రీతి ముకుందన్ కథానాయిక. కన్నప్ప పాత్రలో విష్ణు, రుద్రుడిగా ప్రభాస్, మహా శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతిగా కాజల్ అగర్వాల్ కనిపించనున్నారు. మోహన్‌బాబు, మోహన్‌లాల్ కీలక పాత్రలు పోషించారు. అవా ఎంటర్‌టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న భారీ స్థాయిలో విడుదల కానుంది.
చదవండి: నితిన్ వల్లే ఐటం సాంగ్ చేశా.. ఇప్పటికీ ఇబ్బందిగా అనిపిస్తుంది: గుత్తా జ్వాల
Comments
Please login to add a commentAdd a comment