చరిత్రలో... వినోదం నుంచి విషాదం వరకు | Oscar Winners 2025: Anora Was Crowned Best Film, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Oscar Awards 2025: చరిత్రలో... వినోదం నుంచి విషాదం వరకు

Published Fri, Mar 14 2025 3:09 AM | Last Updated on Fri, Mar 14 2025 10:32 AM

Oscar Winners 2025: Anora was crowned Best Film

‘అనోరా’ ఆస్కార్‌ అవార్డులు గెల్చుకున్న నేపథ్యంలో హాలీవుడ్‌ సినిమాలలో సెక్స్‌ వర్కర్‌ల పాత్రలౖపై ఆసక్తి మొదలైంది.

1929లో ‘స్ట్రీట్‌ ఏంజెల్‌’లో స్ట్రీట్‌ ఏంజెల్‌గా నటించిన జానెట్‌ గేనర్‌ ‘ఉత్తమ నటి’ అవార్డ్‌ గెల్చుకుంది.
⇒ ఆస్కార్‌ అవార్డ్‌ చరిత్రలో ‘బెస్ట్‌ యాక్ట్రెస్‌’, ‘బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్ట్రెస్‌’ అవార్డులు సెక్స్‌ వర్కర్‌లుగా నటించిన 16 మందికి దక్కాయి.
⇒ సెక్స్‌ వర్కర్‌ల జీవితాలలో విషాదాలను, సామాజిక వాస్తవికతను తెరపై చూపిన సినిమాలు ఎన్నో  ఉన్నాయి.

ఉదా: లుకాస్‌ మాడిసన్‌–లిలియ ఫర్‌ ఎవర్‌ (2002)
లుకాస్‌ మాడిసన్‌ రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమా వాస్తవిక సంఘటనల ఆధారంగా నిర్మించారు. మానవ అక్రమ రవాణా, లైంగిక బానిసత్వం సమస్యను తెరమీద చూపిన సినిమా ఇది.

⇒ ఒకానొక కాలంలో కమర్షియల్‌ అంశాలను దృష్టిలో పెట్టుకొని హాలీవుడ్‌ సినిమాల్లో సెక్స్‌ వర్కర్‌ల పాత్రలకు రూపకల్పన చేసేవారు. ‘సెక్స్‌ వర్కర్‌’ పాత్ర తప్పనిసరి అన్నట్లుగా ఉండేది. అయితే కాలక్రమంలో వారి జీవితంలో విషాదాన్ని , జీవన సంక్షోభాన్ని చూపించే ధోరణి పెరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement