
నేత్ర, చోరీ జరిగిన బంగ్లా
సాక్షి, బెంగళూరు: హత్య జరిగిన ఇంట్లో దొంగలు పడి మొత్తం దోచుకుపోయిన సంఘటన నెలమంగల తాలూకా మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గత నవంబర్ 7న రియల్ ఎస్టేట్ వ్యాపారి స్వామిరాజన్‌ను ఆయన రెండో భార్య, బ్యూటీషియన్ నేత్ర హారోక్యాతనహళ్లిలోని బంగ్లాలో తలపై రాడ్‌తో కొట్టి హత్య చేసింది. ఇందుకు నేత్ర ప్రియుడు, అక్క కొడుకు సహకరించారు. నేత్ర జైలుపాలవడంతో బంగళా ఖాళీగా ఉంది. ఇదే అదనుగా దొంగలు మంగళవారం రాత్రి బంగళా తలుపులు పగలగొట్టి చొరబడి విలువైన వస్తువులను చోరీ చేసారు.
చదవండి: (ప్రియునికి ప్రియురాలి తండ్రి షరతు.. లాడ్జ్‌లో రూం తీసుకొని..)