భారతి (ఫైల్)
కర్నూలు: స్థానిక బాపూజీ నగర్‌లో నివాసముంటున్న గోపీకృష్ణ భార్య భారతి(28) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నెల్లూరు పట్టణానికి చెందిన భారతి చిన్నప్పుడే తల్లిదండ్రులు వెంగయ్య, రజితమ్మ మృతిచెందడంతో సోదరి సుశీల వద్ద పెరిగింది. 2013 నవంబర్‌లో మేనత్త కుమారుడు కర్నూలుకు చెందిన గోపీకృష్ణకు ఇచ్చి పెద్దల సమక్షంలో పెళ్లి చేశారు. గోపీకృష్ణ గాంధీనగర్ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండగా, భారతి సి.బెళగల్ మండలం ఇనగండ్ల ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జీ టీచర్‌గా విధులు నిర్వహిస్తోంది.
చదవండి: (మూడేళ్లు సహజీవనం.. ఇపుడు దూరంగా ఉంటోందని)
వివాహమై ఎనిమిదేళ్లైనా సంతానం కలగకపోవడంతో భర్త తరచూ గొడవ పడి శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. ఇదే విషయమై రెండు రోజుల క్రితం సోదరికి చెప్పుకుని విలపించింది. ఈక్రమంలో మంగళవారం సాయంత్రం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. గమనించిన భర్త ఇతరుల సాయంతో కిందికి దించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. భర్త వేధింపుల కారణంగానే భారతి ఆత్మహత్య చేసుకుందని మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఒకటవ పట్టణ సీఐ కళావెంకటరమణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment