వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం జగన్, ఆయన సతీమణి భారతి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. జగన్ రాక సందర్భంగా అక్కడకు వచ్చిన పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలను ఆయన పేరు పేరునా పలకరించారు. అనంతరం పులివెందుల బయల్దేరారు. కాగా సుదీర్ఘ విరామం తర్వాత జిల్లాకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో ఎర్రగుంట్లలో దిగిన ఆయన అక్కడ నుంచి ఇడుపులపాయ చేరుకున్నారు.