floral tribute
-
Yogi Vemana: సీఎం జగన్ పుష్పాంజలి
సాక్షి, గుంటూరు: సమాజంలో రుగ్మతలను చీల్చి చెండాడిన సంఘసంస్కర్త, కవి మహాయోగి వేమన. ఇవాళ ఆయన జయంతి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. -
డల్లాస్‌లో మహాత్మా గాంధీకి ఘన నివాళి
డల్లాస్, టెక్సాస్ : మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో డల్లాస్‌లో జాతిపితకి ఘనంగా నివాళులు అర్పించారు. ఎంతో మంది ప్రవాస భారతీయులు డల్లాస్ (ఇర్వింగ్) లోని మహాత్మా గాంధీ మెమోరియల్‌ని సందర్శించి జాతిపిత 70వ వర్ధంతిని పురస్కరించుకుని మహాత్మా గాంధీ పాదాల వద్ద పుష్పాలను ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. గాంధీజీకి ఇష్టమైన రఘుపతి రాఘవ రాజారామ్ కీర్తనను స్థానిక గాయకుడు ఎస్ పి నాగ్రాత్ ఆలపించారు. మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కార్యదర్శి రావు కల్వల మాట్లాడుతూ స్థానిక ప్రజల సహకారంతో అతి పెద్ద గాంధీ మెమోరియల్ ను ఇక్కడ నిర్మించుకోవడం, భావితరాలకు స్పూర్తిదాయకంగా చూపడానికి అవకాశం కలిగిందని, గాంధీజీ సేవలను స్మరించుకోవడానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. గాంధీ మెమోరియల్ ఛైర్మన్ డాక్టర్. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ గాంధీజీ 70 సంవత్సరాల కిందట మరణించినా ఆయన సిద్ధాంతాలు, ఆశయాలతో మనందరి మధ్య ఎప్పటికీ సజీవంగానే ఉంటారని అన్నారు. దేశ స్వాతంత్ర కోసం దాదాపు 32 సంవత్సరాల తన జీవతాన్ని అంకితం చేసి లక్షలాది ప్రజలను నిరంతరం చైతన్య పరచి, అహింసా మార్గం ద్వారా దేశానికి స్వాతంత్రం సాధించిన తీరు అనితర సాధ్యం అని పేర్కొన్నారు. ప్రవాస భారతీయులుగా మనమందరం గాంధీ చూపిన బాటలో పయనిస్తూ సమానత్వం, సామాజిక న్యాయం ఉండే ఒక మంచి సమాజ స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గాంధీజీ విశ్వ మానవాళికి ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తి అని, ఆయన సిద్ధాంతాలతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ఉత్తేజితులయ్యారని గాంధీ మెమోరియల్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ కమల్ కౌషల్ అన్నారు. గాంధీజీ శాంతి, సహనానికి ప్రతి రూపమని, ఆయన గురించి ముఖ్యంగా యువతరం ఎంతో తెలుసుకొని తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవచ్చని ఐఏఎన్టి ఉపాధ్యక్షులు బిఎన్ చెప్పారు. గాంధీజీ తన సాధారణ, పారదర్శక జీవితంతో ఎంతో మందికి ఆదర్శప్రాయులయ్యారని, ఆయనకు మరణం లేదని ఎన్ని దశాబ్దాలైనా అందరూ జాతిపితను గుర్తించుకుంటారని మహాత్మా గాంధీ మెమోరియల్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ షబ్నమ్ మోద్గిల్ చెప్పారు. -
పార్లమెంట్‌పై ఉగ్రదాడికి 16 ఏళ్లు
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగి నేటికి సరిగ్గా 16 ఏళ్లు. దేశ అత్యున్నత చట్టసభపై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమర వీరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. 2001 డిసెంబర్ 13న జరిగిన దాడిలో ఐదుగురు ఉగ్రవాదులు, తొమ్మిది మంది భద్రతాసిబ్బంది మృతిచెందిన సంగతి తెలిసిందే. బుధవారం పార్లమెంట్ ఆవరణలో అమరుల ఫొటో వద్ద ప్రధాని మోదీ పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, రవిశంకర్ ప్రసాద్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సుమిత్రా మహజన్, రాహుల్ గాంధీ, పలువురు కాంగ్రెస్ నేతలు...అమరులకు నివాళులు అర్పించారు. -
తండ్రి సమాధి వద్ద జగన్ ప్రత్యేక ప్రార్థనలు
ఇడుపులపాయ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం జగన్, ఆయన సతీమణి భారతి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. జగన్ రాక సందర్భంగా అక్కడకు వచ్చిన పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలను ఆయన పేరు పేరునా పలకరించారు. అనంతరం పులివెందుల బయల్దేరారు. కాగా సుదీర్ఘ విరామం తర్వాత జిల్లాకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఎర్రగుంట్లలో దిగిన ఆయన అక్కడ నుంచి ఇడుపులపాయ చేరుకున్నారు. -
వైఎస్ఆర్ ఘాట్ వద్ద జగన్, భారతి ప్రార్థనలు