ఆధార్ చట్టబద్ధతపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. ఆధార్ పూర్తిగా రాజ్యాంగబద్ధమేనని దీని ద్వారా పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందనేది పూర్తి అవాస్తవమని పేర్కొంది. 12 అంకెల ఆధార్ నెంబర్‌ను తప్పనిసరి చేసే సేవలను పరిమితం చేస్తూ బుధవారం తీర్పునిచ్చింది. బ్యాంకు అకౌంట్లు, మొబైల్ కనెక్షన్లు, స్కూల్ అడ్మిషన్లకు ఆధార్ తప్పనిసరి కాదని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 4:1 తీర్పుతో స్పష్టం చేసింద