సాక్షి, హైదరాబాద్: భారీ ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలుగా తెలంగాణ రోడ్ల అభివృద్ధి సంస్థకు చట్టబద్ధత కల్పించనున్న ట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. తదుపరి అసెంబ్లీ సమావేశాల నాటికి ముసాయిదా బిల్లును సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు. న్యాక్‌లో బుధవారం జరిగిన సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అంతర్జాతీయ సంస్థల నుంచి రోడ్ల అభివృద్ధి సంస్థ భారీగా రుణం తీసుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కీలక రహదారుల అభివృద్ధికి ఆ సంస్థ ద్వారా విజయబ్యాంకు కన్సార్షియం నుంచి రూ.600 కోట్లు రుణం పొందేందుకు ఏర్పాట్లు చేస్తున్న ట్లు చెప్పారు. ముఖ్యమైన, ఎంపిక చేసిన రోడ్ల ప్రాజెక్టుల కోసం ప్రత్యేకంగా తెలంగాణ రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ట్రాక్)లో భాగంగా ప్రణా ళికను రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాలకు రహదారి అనుసంధానం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. బడ్జెట్ నిధులతో ఇలాంటి పనులు సాధ్యం కానందున ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని మంత్రి తుమ్మల చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment