ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి
హన్మకొండ : ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ (టీఎస్) జిల్లా అధ్యక్షుడు సిలువేరు సాంబయ్య డిమాండ్ చేశారు. ఇందుకోసం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని కోరుతూ హన్మకొండలోని ఏకశిల పార్కు వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే దీక్షలు చేపడుతున్నామన్నారు. ఈ నెల 27వరకు దీక్షలు కొనసాగుతాయని తెలి పారు. గత పాలకులు ఇచ్చిన మాట నిలుపుకోకపోవడం వల్లే మాదిగల ఉసురు తాకి అధికారానికి దూరమయ్యారని, వర్గీకరణ చేపట్టకపోతే బీజేపీకి కూడా అదే గతి పడుతుందని అన్నారు. మాదిగ, మాదిగ ఉప కులాలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. దీక్షలో ఎమ్మార్పీఎస్(టీఎస్) నాయకులు మాదాసి రాంబాబు, పి.సంజీవ, మంద బాబురావు, ఆకులపల్లి బాబు, తాళ్ళ విజయ్, నమిండ్ల చిన్న స్వామి, తాళ్లపల్లి మధు. అర్షం అశోక్, చింత జోసఫ్, సారంగం, కాయిత ప్రసాద్, కట్కూరి కిశోర్ కూర్చున్నారు.