![More Than 12580 NGOs Licenses Ceased On Saturday Know Why - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/1/money_0.jpg.webp?itok=ngfMJHub)
ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సీఆర్‌ఏ) 2010 కింద ఎన్జీవోలకు విదేశీ నిధులు చేరాలంటే లైసెన్సులను తప్పనిసరిగా కలిగి ఉండాలి. కాగా దాదాపు 12,580 ఎన్జీవో (నాన్ ఫ్రోఫిట్ ఆర్గనైజేషన్లు)ల లైసెన్సుల తుది గడువు నిన్నటితో ముగియడంతో వారి లైసెన్సులన్నీ శనివారం సీజ్ చేసినట్లు కేంద్ర హోం శాఖ తాజాగా విడుదల చేసిన జాబితాలో తెల్పింది. ఎఫ్‌సిఆర్‌ఎ కింద క్రితం రోజు వరకు యాక్టివ్‌గా ఉన్న 22,762 ఎన్జీఓలు ప్రస్తుతం 16,829కి తగ్గాయి. దాదాపు 5,933 ఎన్జీఓల రిజిస్ట్రేషన్లు రద్దు చేయబడ్డాయి (రెన్యూవల్ చేసుకోకపోవడంతో).
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇమాన్యుయేల్ హాస్పిటల్ అసోసియేషన్, ట్యూబర్‌క్యులోసిస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఆశాకిరణ్ రూరల్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ సొసైటీ, చైతన్య రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ, ఎఫ్‌సిఆర్‌ఎ లైసెన్స్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తాజా జాబితాలో ఉంది. హమ్‌దర్డ్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ సొసైటీ, డీఏవీ కాలేజ్ ట్రస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ సొసైటీ, ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్, జేఎన్‌యూలోని న్యూక్లియర్ సైన్స్ సెంటర్, ఇండియా హాబిటాట్ సెంటర్, లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్ సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటికే 6587 ఎన్జీఓలు జాబితాలో ఉన్నాయి.లైసెన్స్‌ల రెన్యువల్ కోసం గడువుకాలం పొడిగించినప్పటికీ ఆయా సంస్థలు అప్‌డేట్ చేసుకోలేదు.
కాగా కొన్ని ఎన్జీఓల ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేన్‌కు తుది గడువు 2021 సెప్టెంబర్ 29,30 తేదీల్లో ముగియనుండగా, ఆ సమయాన్ని మార్చి 2022 వరకు హోం శాఖ పొడిగించింది.
చదవండి: Online Frauds: అయ్యో పాపం! రూ. 1 లక్ష విలువైన ఐ ఫోన్ ఆర్డర్ చేస్తే డెలివరీ ఫ్యాక్‌లో..
Comments
Please login to add a commentAdd a comment