licenses
-
బ్యాంక్ లైసెన్స్‌లు కోరుకోవడం అసాధారణం
ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) ఒకవైపు నియంత్రణపరమైన ప్రయోజనాలను అనుభవిస్తూనే మరోవైపు బ్యాంకింగ్ లైసెన్స్ కోరుకోవడం అనుచితమని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎం.రాజేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఎన్బీఎఫ్సీలపై సీఐఐ నిర్వహించిన సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వడ్డీ రేట్లపై నియంత్రణ సంస్థ (ఆర్బీఐ) ఇచి్చన స్వేచ్ఛను కొన్ని సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్ఐలు) దురి్వనియోగం చేస్తున్నాయని, అధిక రేట్లను వసూలు చేస్తున్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. పీర్ టు పీర్ (పీటుపీ) రుణ ప్లాట్‌ఫామ్‌లు లైసెన్స్ మార్గదర్శకాల పరిధిలో లేని వ్యాపార విధానాలను అనుసరిస్తుండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటి ఉల్లంఘనలను ఆమోదించేది లేదని హెచ్చరించారు. ఎన్బీఎఫ్సీలు బ్యాంక్‌లుగా మారే విషయంలో వస్తున్న డిమాండ్‌పై రాజేశ్వరరావు మాట్లాడారు. టాప్ టైర్ ఎన్‌బీఎఫ్‌సీలకు సైతం నియంత్రణ విధానాలు యూనివర్సల్ బ్యాంకుల మాదిరిగా లేవని స్పష్టం చేస్తూ, ఎన్బీఎఫ్సీలు కొన్ని ప్రయోజనాలను అనుభవిస్తున్నట్టు చెప్పారు. ‘‘ఎన్బీఎఫ్సీలు కీలక సంస్థలుగా మారి ప్రత్యేకమైన ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కనుక అవి బ్యాంక్‌గా మారాలని అనుకోవడం సముచితం కాదు’’అని రాజేశ్వరరావు పేర్కొన్నారు. ఇదే సమావేశంలో పాల్గొన్న బజాజ్ ఫిన్సర్వ్ చైర్మన్, ఎండీ సంజీవ్ బజాజ్ ఎన్బీఎఫ్సీలు బ్యాంక్ లైసెన్స్‌లు ఎందుకు కోరుకోరాదంటూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా రాజేశ్వరరావు మాట్లాడడం గమనార్హం. బ్యాంక్‌గా ఎందుకు మారకూడదు? ఆర్బీఐ పటిష్ట నియంత్రణల మధ్య ఎన్బీఎఫ్సీలు పెద్ద సంస్థలుగా, బలంగా మారినట్టు సంజీవ్ బజాజ్ వ్యాఖ్యానించారు. ‘‘కొన్ని ఎన్బీఎఫ్సీలు బ్యాంక్ లైసెన్స్ గురించి ఎందుకు ఆలోచించకూడదు?. ముఖ్యంగా ఈ ఎన్బీఎఫ్సీలు పదేళ్లకు పైగా సేవలు అందిస్తూ, నిబంధనలను సరిగ్గా అమలు చేస్తూ, తమను తాము నిరూపించుకున్నాయి’’అని సంజీవ్ బజాజ్ అన్నారు. దీనికి రాజేశ్వరావు స్పందిస్తూ.. ‘‘యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్‌లను ఆన్‌టాప్ విధానం కిందకు కొన్నేళ్ల క్రితం ఆర్బీఐ మార్చింది. కానీ, ఏ ఒక్క సంస్థ కూడా బ్యాంక్‌గా పనిచేసేందుకు ఆమోదం పొందలేదు’’అని చెప్పారు. ప్రవేశించడం, తప్పుకోవడానికి సంబంధించి ఎలాంటి అవరోధాలు ఎన్‌బీఎఫ్‌సీలకు లేవని, యూనివర్సల్ బ్యాంక్ ఏర్పాటుకు రూ.1,000 కోట్ల అవసరం ఉంటే, ఎన్బీఎఫ్సీ ఏర్పాటుకు ఇది రూ.10 కోట్లుగానే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఎన్బీఎఫ్సీలు తమ నిధుల అవసరాల కోసం బ్యాంక్‌లపై ఎక్కువగా ఆధారపడకుండా ఇతర మార్కెట్ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవాలని రాజేశ్వరరావు సూచించారు. -
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 19 శాతం అప్
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఇళ్లకు డిమాండ్ బలంగా కొనసాగుతోంది. ఇది ధరలకు మద్దతుగా నిలుస్తోంది. సెపె్టంబర్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు 19 శాతం పెరిగినట్టు క్రెడాయ్, కొలియర్స్, లైసెస్ ఫొరాస్ సంయుక్త నివేదిక వెల్లడించింది. సగటున చదరపు అడుగు ధర రూ.11,040కు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో సెపె్టంబర్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు 10 శాతం మేర పెరిగాయి. నివేదికలోని అంశాలు ► దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో ఇళ్ల ధరల పెరుగుదల అత్యధికంగా (19 శాతం) హైదరాబాద్‌లోనే నమోదైంది. ఆ తర్వాత బెంగళూరులో ధరల పెరుగుదల 18 శాతంగా ఉంది. ►అహ్మదాబాద్‌లో చదరపు అడుగు ధర 9 శాతం పెరిగి రూ.6,613గా ఉంది. ►బెంగళూరులో క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చిచూస్తే ఇళ్ల ధర చదరపు అడుగునకు 18 శాతం పెరిగి రూ.9,471గా ఉంది. ►చెన్నైలో 7 శాతం వృద్ధితో చదరపు అడుగు ధర రూ.7,712కు చేరుకుంది. ►ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ఇళ్ల ధర 12 శాతం పెరిగి చదరపు అడుగు రూ.8,655గా ఉంది. ►కోల్‌కతా మార్కెట్లో 12 శాతం పెరిగి రూ.7,406కు చేరగా, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో చదరపు అడుగు ధర ఒక శాతం వృద్ధితో రూ.19,585కు చేరింది. ►పుణెలో 12 శాతం పెరిగి రూ.9,014గా ఉంది. సానుకూల సెంటిమెంట్ ‘‘2023లో ఇళ్ల కొనుగోలుదారుల్లో సెంటిమెంట్ సానుకూలంగా ఉంది. హౌసింగ్ రిజి్రస్టేషన్లు పెరగడంతో, అది పరోక్షంగా ఇళ్ల ధరలు పెరిగేందుకు దారితీసింది’’అని క్రెడాయ్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో ఇళ్ల ధరలు 10 శాతం పెరగడం పోటీతో కూడిన అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ను ప్రతిఫలిస్తోందని కొలియర్స్ ఇండియా సీఈవో బాదల్ యాగ్నిక్ పేర్కొన్నారు. -
వాహనాల ఆర్సీలకు మళ్లీ చిప్‌లు
సాక్షి, హైదరాబాద్: దాదాపు ఏడాది విరామం తర్వాత రాష్ట్రంలో మళ్లీ వాహనాల లైసెన్సులు, ఆర్సీ స్మార్ట్ కార్డులకు చిప్‌ల ఏర్పాటు ప్రారంభమైంది. విదేశాల నుంచి తీసుకువస్తున్న ఈ చిప్‌లకు కొరత ఏర్పడి దిగుమతి నిలిచిపోవటంతో చిప్‌లు లేకుండానే కార్డులను జారీ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ చిప్, క్యూఆర్ కోడ్లతో కూడిన స్మార్ట్ కార్డుల జారీని రవాణాశాఖ ప్రారంభించింది. గురువారం నుంచి వాటి బట్వాడా మొదలైంది. ఉక్రెయిన్ యుద్ధం.. తైవాన్‌లో కొరత పేరుతో.. రాష్ట్రంలో దాదాపు ఏడాది కిందట వరకు వాహనాల లైసెన్సులు, ఆర్సీ స్మార్ట్ కార్డులకు చిప్‌లను బిగించేవారు. ఆ చిప్ ముందు చిప్ రీడర్‌ను ఉంచగానే.. వాహనానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలిసిపోతుంది. టెండర్ల ప్రక్రియ ద్వారా ప్రైవేటు కంపెనీకి ఈ స్మార్ట్ కార్డుల తయారీ బాధ్యత అప్పగించారు. ఆ సంస్థనే చిప్‌ల వ్యవహారం కూడా చూస్తుంది. అయితే చిప్‌లకు కొరత ఏర్పడిందన్న పేరుతో స్మార్ట్ కార్డుల తయారీ, జారీ నిలిపేశారు. ఉక్రెయిన్, తైవాన్, చైనాల నుంచి ఆ చిప్స్ దిగుమతి అవుతాయని, చైనాతో సత్సంబంధాలు లేక వాటి దిగుమతిని కేంద్రం ఆపేసిందని చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆ దేశం నుంచి కూడా ఆగిపోయాయని, ఇక స్థానికంగా డిమాండ్ పెరిగి చిప్‌ల ఎగుమతిని తైవాన్ తాత్కాలికంగా నిలిపివేసిందని అధికారులు అప్పట్లో పేర్కొన్నారు. చివరకు చిప్‌లు లేకుండానే కార్డుల జారీకి అనుమతించారు. మహారాష్ట్ర అధికారుల అభ్యంతరంతో.. ఆరు నెలల క్రితం తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో తెలంగాణ వాహనాలను తనిఖీ చేసినప్పుడు చిప్ లేకుండా ఉన్న కార్డులపై ఆ రాష్ట్ర అధికారులు అనుమానాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. అవి అసలైనవో, నకిలీవో గుర్తించటం ఎలా అంటూ వాహనదారులను ప్రశ్నించారు. దీంతో పాటు రవాణాశాఖకు కూడా ఫిర్యాదులు పెరుగుతూ వచ్చాయి. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకుని తిరిగి చిప్‌లను ఏర్పాటు చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు కాంట్రాక్టు సంస్థను ఆదేశించింది. దాంతో ఆ సంస్థ చిప్‌లను సమకూర్చుకుని స్మార్ట్ కార్డుల తయారీని సిద్ధం చేసింది. గురువారం నుంచి చిప్‌లతో కూడిన స్మార్ట్ కార్డుల జారీని రవాణాశాఖ అధికారులు ప్రారంభించారు. స్మార్ట్ కార్డు ముందు వైపు చిప్ ఉంటుండగా, వెనక వైపు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో సగటున నిత్యం 3,500 లైసెన్సులు, 5,500 ఆర్సీ కార్డులు జారీ అవుతున్నాయి. ఇప్పుడు ఆ కొరతను ఎలా అధిగమించారో? అప్పట్లో చిప్‌లకు కొరత ఎందుకు వచ్చిందో, ఇప్పుడు చిప్‌లు ఎలా సమకూర్చుకుంటున్నారో అధికారులు స్పష్టం చేయాలని తెలంగాణ ఆటోమోటార్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దయానంద్ డిమాండ్ చేశారు. -
తడబడుతూ.. ముందుకు?!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వైన్‌షాపుల నిర్వహణ కోసం రానున్న రెండేళ్ల కాలానికి లైసెన్సులు పొందేందుకు గాను చేపట్టిన దరఖాస్తుల ప్రక్రియ గతంతో పోలిస్తే తడబడుతూ ముందుకెళుతోంది. 2023–25 సంవత్సరాలకు గాను వైన్‌షాపులకు లైసెన్సులను లాటరీ పద్ధతిలో కేటాయించేందుకు గాను ఈనెల 4వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా, ఎనిమిదో రోజు శుక్రవారం ముగిసేనాటికి 15వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ గణాంకాలు చెపుతున్నాయి. అదే గత ఏడాది తొలి ఎనిమిది రోజుల్లో 14,500 వరకు దరఖాస్తులు రావడం గమనార్హం. తొలి ఏడు రోజుల్లో ఈసారి 8వేల వరకు దరఖాస్తులు రాగా, గతంలో 9వేల వరకు వచ్చాయి. గతంతో పోలిస్తే తొలి వారంలో దరఖాస్తుల సంఖ్య తగ్గినా, శుక్రవారం చివరి నిమిషంలో పెద్ద ఎత్తున వచ్చిన దరఖాస్తులతో ఎౖMð్సజ్ యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. అయితే, గతంలో షెడ్యూల్ ఇచ్చిన తర్వాత దరఖాస్తుల ప్రక్రియ కోసం 10 రోజులు సమయం ఇవ్వగా, ఈసారి 12 రోజులు సమయం ఇచ్చారు. రెండో శనివారం అయినప్పటికీ 12వ తేదీన కూడా దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఆదివారం, ఆగస్టు 15 సెలవు దినాలు కావడంతో మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో 16,17,18 తేదీల్లో భారీగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. గత రెండేళ్ల కాలానికి గాను మొత్తం 68 వేలకు పైగా దరఖాస్తులు రాగా, దరఖాస్తు రుసుంతో పాటు తొలి వాయిదా ఎక్సైజ్ ఫీజు కలిపి మొత్తం రూ.1,691 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అయితే, ఈసారి ఆ స్థాయిలో దరఖాస్తులు వస్తాయా రావా అన్న మీమాంసలో ఎక్సైజ్ వర్గాలుండడం గమనార్హం. రెండు పిల్లు, రెండు రిట్లు ఇక, మద్యం దుకాణాల కేటాయింపుపై గతం నుంచీ నాలుగు కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. వైన్‌షాపుల కేటాయింపులో రిజర్వేషన్లు అమలు చేయడంపై రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, మరో రెండు రిట్ పిటిషన్లు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. దీనికి తోడు ఈసారి మరో రెండు కేసులు కోర్టుల్లో నమోదయ్యాయి. కొత్తగూడెం ఏరియాలోని కొన్ని దుకాణాలు షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నప్పటికీ గిరిజనులకు వాటికి కేటాయించకుండా జనరల్ కేటగిరీలో చూపెట్టారని ఒక పిటిషన్ దాఖలు కాగా, గిరిజనులకు రిజర్వేషన్లు కేటాయించడంలో రాష్ట్రమంతటా ఒకే విధానాన్ని పాటించడం లేదంటూ మరొక పిటిషన్ ఈసారి దాఖలు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో కోర్టులు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తాయోననే ఆసక్తి కూడా అటు ఎక్సైజ్ వర్గాల్లోనూ, ఇటు మద్యం వ్యాపారుల్లోనూ వ్యక్తమవుతుండడం గమనార్హం. -
కంప్యూటర్ల దిగుమతిపై నియంత్రణ
న్యూఢిల్లీ: దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు, భద్రతాపరమైన కారణాల రీత్యా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు అలాగే కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులపై కేంద్రం గురువారం నియంత్రణలు విధించింది. చైనా, కొరియా వంటి దేశాల నుంచి దిగుమతులను కట్టడి చేసేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. నియంత్రణలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. ఇకపై ఈ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు దిగుమతిదారులు ప్రభుత్వం నుంచి అనుమతి, లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నియంత్రణల విధింపునకు పలు కారణాలు ఉన్నప్పటికీ పౌరుల భద్రతను పరిరక్షించడం అన్నింటికన్నా ప్రధానమైనదని ఆయన వివరించారు. ఆంక్షలు విధించడమనేది దిగుమతులను పూర్తిగా నిషేధించే ఉద్దేశంతో తీసుకున్నది కాదని, వాటిని నియంత్రించడం మాత్రమే లక్ష్యమని చెప్పారు. దీనివల్ల దేశీయంగా ధరలేమీ పెరగబోవని తెలిపారు. కొన్ని మినహాయింపులు ఉంటాయి.. ‘ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఆల్–ఇన్–వన్ పర్సనల్ కంప్యూటర్లు, అల్ట్రా చిన్న స్థాయి కంప్యూటర్లు, సర్వర్ల దిగుమతులపై తక్షణమే నియంత్రణలు అమల్లోకి వస్తాయి‘ అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఒక నోటిఫికేషన్లో తెలిపింది. అయితే, కొన్ని సందర్భాల్లో మినహాయింపులు ఉంటాయని పేర్కొంది. ఆగస్టు 3 కన్నా ముందుగానే లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ చేసిన కన్సైన్మెంట్లను దిగుమతి చేసుకోవచ్చని వివరించింది. ఆగస్టు 4 నుంచి దిగుమతిదారు లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే ఆర్అండ్డీ, టెస్టింగ్, రిపేర్ అండ్ రిటర్న్ తదితర అవసరాల కోసం కన్సైన్మెంట్కు 20 ఐటమ్‌ల వరకు దిగుమతి చేసుకునేందుకు లైసెన్సు తీసుకోనక్కర్లేదని వివరించింది. ఈ–కామర్స్ పోర్టల్స్ ద్వారా కొనుగోలు చేసే ఒక ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్, పీసీ, లేదా అల్ట్రా స్మాల్ ఫారం ఫ్యాక్టర్ కంప్యూటర్లకు కూడా మినహాయింపులు వర్తిస్తాయి. అయితే, వాటికి వర్తించే సుంకాలను చెల్లించాల్సి ఉంటుంది. దిగుమతులపై ఆంక్షల వల్ల దేశీయంగా ఆయా ఉత్పత్తుల రేట్లు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. బిలియన్ డాలర్ల కొద్దీ దిగుమతులు.. 2022–23లో భారత్ 5.33 బిలియన్ డాలర్ల విలువ చేసే పర్సనల్ కంప్యూటర్లు .. ల్యాప్‌టాప్‌లను, 553 మిలియన్ డాలర్ల విలువ చేసే ప్రత్యేక డేటా ప్రాసెసింగ్ మెషీన్లను దిగుమతి చేసుకుంది. భారత్‌లో ఎక్కువగా హెచ్‌సీఎల్, డెల్, ఎల్జీ ఎల్రక్టానిక్స్, లెనొవొ, యాపిల్, హెచ్‌పీ, శాంసంగ్ తదితర ఎల్రక్టానిక్ దిగ్గజాల ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. భారత్ ఈ తరహా ఉత్పత్తులను ఏటా 7–8 బిలియన్ డాలర్ల మేర దిగుమతి చేసుకుంటోంది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీíÙయేటివ్ (జీటీఆర్ఐ) నివేదిక ప్రకారం భారత్ చైనా నుంచి దిగుమతి చేసుకునే వాటిల్లో 65 శాతం వాటా ఎల్రక్టానిక్స్, యంత్రాలు, ఆర్గానిక్ రసాయనాలు ఉంటున్నాయి. రోజువారీ ఉపయోగించే మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్‌లు, సోలార్ సెల్ మాడ్యూల్స్ మొదలైన వాటి కోసం ఎక్కువగా చైనాపైనే ఆధారపడాల్సి ఉంటోంది. దీన్ని తగ్గించుకునే దిశగా దేశీయంగా ఎల్రక్టానిక్స్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. -
లైసెన్స్టు కిల్!
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు భారీ వాహన డ్రైవర్లకు లైసెన్సు రెన్యువల్ సమయంలో ఒకరోజు అవగాహన, శిక్షణ కార్యక్రమం ఇవ్వడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం జారీ చేసిన ఆదేశాలకు అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. డబ్బు వసూలే ధ్యేయంగా ఏర్పడ్డ కొన్ని ప్రైవేటు డ్రైవింగ్ స్కూళ్లతో కుమ్మక్కైన కొందరు అధికారులు రవాణాశాఖలో తెరవెనక చక్రం తిప్పుతున్నారు. సాక్షి, హైదరాబాద్: ట్రక్కుల్లాంటి భారీ వాహనాలు నడిపే డ్రైవర్లకు హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ తప్పనిసరి. తమ లైసెన్సులను ప్రతి ఐదేళ్లకోసారి (ట్రాన్స్‌పోర్టు కేటగిరీ) రెన్యువల్ చేసుకోవాలి. అదే ప్రమాదకర పదార్థాలు తరలించే వాహనాల డ్రైవర్లు మూడేళ్లకోసారి రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ సమయంలో కేంద్రప్రభుత్వ నిర్దేశిత పద్ధతిలో డ్రైవర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలి. వాహనాలు నడపడం, జాగ్రత్తలు తీసుకోవడం, ప్రమాదాలను తప్పించేందుకు అనుసరించాల్సిన పద్ధతులు, ప్రమాదాన్ని నివారించలేని పక్షంలో వీలైనంతవరకు దాని తీవ్రత తగ్గేలా చూడటం, రోడ్లలో వస్తున్న మార్పులు.. ఇలా పలు అంశాల్లో ఆధునిక సాంకేతికత ఆధారంగా ఆ శిక్షణ కార్యక్రమం ఉండాలి. ఆ శిక్షణ పూర్తి చేసినట్టు సర్టిఫికెట్ వచ్చిన వారికి మాత్రమే లైసెన్స్ రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. కొందరు డ్రైవర్లు మధ్యలో కొన్నేళ్లపాటు వేరే ఉద్యోగంలో ఉండి, మళ్లీ డ్రైవింగ్‌కు వచ్చే వారుంటారు. వారు డ్రైవింగ్ ఆపేసిన తర్వాత స్కిల్స్ తగ్గిపోతాయన్నది శాస్త్రీయంగా నిరూపణ అయింది. ఇలాంటి వారికి ఈ తరహా శిక్షణ అవశ్యమని కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలో సిరిసిల్లలోని ‘టైడ్స్’ ఎంపిక గత ఏడాది మన దేశంలో రోడ్డు ప్రమాదాల రూపంలో లక్షన్నర కంటే ఎక్కువ మంది చనిపోయారు. కొన్నేళ్లుగా ఈ సంఖ్య ఇదే రీతిలో నమోదవుతుండటంతో సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీంతో వాటిని నివారించేందుకు కేంద్రం కొన్ని సూచనలు చేసింది. అందులో భారీ వాహనాలను నడిపే డ్రైవర్లు తరచూ.. ఇటు డ్రైవింగ్, అటు వాహనాల్లో వస్తున్న మార్పులు, ఇతర అంశాలపై అవగాహన పెంచుకోవాల్సి ఉంది. రాష్ట్రంలో ఈ శిక్షణ కోసం సిరిసిల్ల సమీపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ (టీఐడీఎస్)’ను ఎంపిక చేసింది. ఏం జరుగుతోంది? గతంలో ప్రైవేట్ డ్రైవింగ్ స్కూళ్ల నుంచే డ్రైవర్లు శిక్షణ సర్టిఫికెట్ పొందేవారు. చాలా డ్రైవింగ్ స్కూళ్లలో శిక్షణ ఇవ్వకుండానే, రూ.5 వేల వరకు వసూలు చేసి సర్టిఫికెట్ ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం... రూ.20 కోట్ల వ్యయంతో ఆత్యాధునికంగా తీర్చిదిద్దిన సిరిసిల్లలోని టైడ్స్‌ను శిక్షణకు ఎంపిక చేసింది. దీంతో కొందరు ప్రైవేటు డ్రైవింగ్ స్కూళ్ల యజమానులు పైరవీ అధికారులతో కుమ్మక్కయ్యారు. సిరిసిల్లకు వెళ్లి డ్రైవర్లు శిక్షణ తీసుకోవటం కష్టమని, అన్ని ప్రాంతాల్లో డ్రైవింగ్ స్కూళ్లు అందుబాటులో ఉన్నందున వాటిల్లో శిక్షణకు అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దీన్ని అమల్లోకి తెచ్చేందుకు అధికారులు ఉన్నతస్థాయిలో ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. లైసెన్సు ఇచ్చేప్పుడు ప్రైవేటు డ్రైవింగ్ స్కూళ్ల నుంచి తెచ్చిన సర్టిఫికెట్లనే పరిగణనలోకి తీసుకున్నప్పుడు, రెన్యువల్‌కు అంగీకరిస్తే ఏంటన్న కోణంలో ఈ ఒత్తిళ్లు నడుస్తున్నట్టు సమాచారం. దీంతో రాష్ట్రంలో వేరువేరు ప్రాంతాల్లో అనుబంధ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న సూచనలు వస్తున్నాయి. అవసరమైతే, ఆర్టీసీ శిక్షణ కేంద్రాల సహకారం తీసుకోవాలని కూడా చెబుతున్నారు. -
ఆర్బీకేల ద్వారా చేప పిల్లలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా నాణ్యమైన చేపల సీడ్ సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆర్బీకేల ద్వారా చేప, రొయ్య మేతలను రైతులకు అందిస్తున్న ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి నాణ్యమైన చేపల సీడ్‌ను కూడా సరఫరా చేయబోతోంది. రాష్ట్రంలో 10,778 ఆర్బీకేలు ఉండగా.. ఆక్వా సాగు చేసే ప్రాంతాల్లోని ఆర్బీకేలలో 734 మంది మత్స్య సహాయకులు సేవలందిస్తున్నారు. ఈ–ఫిష్ ద్వారా ఆక్వా సాగు నమోదుతో పాటు ఆక్వా చెరువులకు లైసెన్సులు సైతం జారీ చేస్తున్నారు. దిగుబడుల్లో నాణ్యత పెంచేందుకు చెరువుల్లో శాంపిల్స్ సేకరించి వాటర్ క్వాలిటీ టెస్ట్‌లు కూడా చేస్తున్నారు. ఆక్వా సాగులో కీలకమైన ఇన్పుట్స్ కూడా ఆర్బీకేల ద్వారానే సరఫరా అవుతున్నాయి. ఇప్పటికే 25 ఫీడ్ కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకున్న మత్స్య శాఖ ఆర్బీకేల ద్వారా 2,736 టన్నుల చేప, రొయ్యల మేతలను రైతులకు సరఫరా చేసింది. 54 సీడ్ ఫామ్స్‌తో అనుసంధానం ఇకపై చేపల రైతులకు నాణ్యమైన, ధ్రువీకరించిన సీడ్ సరఫరా చేసేందుకు మత్స్యశాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసం మత్స్య సహాయకులకు ఇచ్చిన ట్యాబ్స్‌లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అప్లోడ్ చేసింది. ఈ–మత్స్యకార యాప్ ద్వారా రాష్ట్రంలోని 54 ప్రభుత్వ ఫిష్ సీడ్ ఫామ్స్‌ను ఆర్బీకేలతో అనుసంధానం చేశారు. సాగునీటి వనరుల్లో నాణ్యమైన మత్స్య దిగుబడులను రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఫిష్ సీడ్ ఫామ్స్‌లో పెద్దఎత్తున చేప పిల్లలను ఉత్పత్తి చేస్తుంటుంది. వీటిని ఆర్బీకేల ద్వారా లైసెన్స్డ్ రిజర్వాయర్లకు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుత సీజన్లో ఆర్బీకేల ద్వారా బుకింగ్ చేసి జిల్లాల వారీగా లైసెన్స్డ్ రిజర్వాయర్లకు సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ ఫిష్ ఫామ్స్‌తో పాటు రైతుల ద్వారా 10.13 కోట్ల సీడ్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. రాష్ట్రంలో 1,817 లైసెన్స్డ్ రిజర్వాయర్లు ఉండగా.. వాటికి 10.10 కోట్ల సీడ్ అవసరమని అంచనా వేశారు. ఇప్పటివరకు 3.09 కోట్ల ఫిష్ సీడ్‌ను ఆర్బీకేల ద్వారా సరఫరా చేశారు. వీటిని ఆయా ప్రాంతాల్లో లైసెన్స్ పొందిన మత్స్యకారులు వేటసాగిస్తూ జీవనోపాధి పొందనున్నారు. మలి దశలో రైతులకు కావాల్సిన ఫిష్ సీడ్ సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నాణ్యమైన చేప పిల్లల సరఫరాయే లక్ష్యం ఆర్బీకేల ద్వారా నాణ్యమైన చేప పిల్లలను సరఫరా చేస్తున్నాం. ప్రస్తుతం ఆర్బీకేల ద్వారా లైసెన్స్ పొందిన రిజర్వాయర్లకు సరఫరా చేస్తున్నాం. మలిదశలో రైతులకు సరఫరా చేసేలా ఏర్పాట్లు సన్నాహాలు చేపట్టాం. – కె.కన్నబాబు, కమిషనర్, మత్స్య శాఖ -
కల్తీ చేస్తే జైలు‘పాలు’.. ఏపీలో కీలక చట్టం.. త్వరలో అమలు
సాక్షి, అమరావతి: పాల సేకరణ, విక్రయాల సందర్భంగా కల్తీలు, మోసాలకు పాల్పడితే డెయిరీల నిర్వాహకులు, సంబంధిత వ్యాపారులు ఇకపై కటకటాల ఊచలు లెక్క పెట్టాల్సిందే. ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు దేశంలో మరెక్కడా లేనివిధంగా పాల సేకరణ (రైతు రక్షణ), నాణ్యమైన పాల వినియోగ చట్టం–2023ను రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అమలులోకి తీసుకురాబోతోంది. ఇటీవలే అసెంబ్లీ ఆమోదం పొందిన ఈ చట్టం అమలుకు సంబంధించి ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) రూపకల్పన కోసం పశు సంవర్థక శాఖ కసరత్తు చేస్తోంది. గతంలోనూ చట్టాలున్నా.. గతంలో తూనికలు, కొలతలు శాఖ, మునిసిపాలిటీల ఆధ్వర్యంలోని ప్రజారోగ్య విభాగాలు మాత్రమే పాల విక్రయాల్లో జరిగే లోపాలపై అడపాదడపా దృష్టి సారించేవి. ఆ రెండు విభాగాలకూ ఇతర పనులు సైతం ఉండటంతో పాల విక్రయాలపై పెద్దగా దృష్టి సారించేవి కాదు. దీనివల్ల యథేచ్ఛగా అక్రమాలు సాగిపోయేవి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పశు సంవర్థక శాఖ అధికారులను సైతం రంగంలోకి దించింది. పాల సేకరణ సందర్భంగా మిల్క్ అనలైజర్స్, వేయింగ్ మెషిన్స్ను డెయిరీల నిర్వాహకులు అనుకూలంగా మార్చుకుని అక్రమాలకు పాల్పడుతుండటంతో తూనికలు, కొలతల చట్టం ప్రకారం వాటిని తనిఖీ చేసే అధికారాలను 2021 నవంబర్ నుంచి ప్రభుత్వం పశు వైద్యులకు అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన పశు వైద్య బృందాలు ఏడాదిన్నర కాలంలో 3,704 దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశాయి. 151 ఉల్లంఘనలపై జరిమానాలు విధించడం ద్వారా అక్రమాలకు కొంతమేర అడ్డుకట్ట వేయగలిగారు. అయితే, మోసాలకు కారణమైన అనలైజర్స్, ఇతర పరికరాలను సీజ్ చేయడం, ఇందుకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం పశు సంవర్థక శాఖకు లేకుండాపోయింది. అక్రమాలకు చెక్ పెట్టేలా కొత్త చట్టం ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ తరహా మోసాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నియమ, నిబంధనలన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకు రావాలన్న సంకల్పంతో పాల సేకరణ (రైతు రక్షణ), నాణ్యమైన పాల వినియోగం చట్టం–2023ను తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం మిల్క్ అనలైజర్స్తో పాటు పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీయూ), ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్ల (ఏఎంసీయూ)పై పశు సంవర్థక శాఖ పర్యవేక్షణలోకి తీసుకొచ్చారు. ఇందుకోసం మిల్క్ ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులను పశు సంవర్థక శాఖ నియమిస్తుంది. మిల్క్ అనలైజర్స్ నిర్వహించే వ్యక్తులు కచ్చితంగా పశు సంవర్థక శాఖ నుంచి లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుంది. నాణ్యత ప్రమాణాలు పాటించని మిల్క్ అనలైజర్స్‌ను జప్తు చేస్తారు. పాల నాణ్యత పాటించకపోతే ఫుడ్ సేఫ్టీ, నాణ్యత ప్రమాణాల యాక్టు 2006 ప్రకారం చర్యలు తీసుకుంటారు. మోసాలకు పాల్పడితే జరిమానాలు, శిక్షలు ఇలా.. ♦ అనుమతి లేకుండా మిల్క్ అనలైజర్స్ కలిగిన వ్యక్తికి రూ.50 వేల వరకు జరిమానా, 6 నెలల జైలుశిక్ష విధిస్తారు. అనుమతి లేకుండా బీఎంసీయూలు, ఏఎంసీయూలు అనలైజర్స్ వాడితే రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. రెండోసారి నేరానికి ఏడాదిపాటు కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. ♦ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్, డెయిరీలు మిల్క్ అనలైజర్లను అనధికారికంగా, అనుమతి లేకుండా పొంది ఉంటే రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. తదుపరి నేరానికి రెండేళ్ల కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. ♦ మిల్క్ అనలైజర్లను దుర్వినియోగపరిచే వారికి రూ.50 వేల వరకు జరిమానా, 6 నెలలకు తగ్గకుండా జైలుశిక్ష విధిస్తారు. నేర తీవ్రతను బట్టి ఐదేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది. ♦ లైసెన్స్ లేకుండా పాలను సేకరిస్తే రూ.50 వేల వరకు జరిమానా విధిస్తారు. రెండోసారి నేరానికి రూ.లక్ష వరకు జరిమానా, 6 నెలల కారాగార శిక్ష లేదా రెండూ విధిస్తారు. ♦ లైసెన్సు లేకుండా మిల్క్ అనలైజర్ల సర్వీసింగ్ సెంటర్లు నిర్వహించే వారికి రూ.25 వేల జరిమానా విధిస్తారు. రెండోసారి నేరానికి పాల్పడితే రూ.50 వేల వరకు జరిమానా లేదా ఏడాది కారాగార శిక్ష విధిస్తారు. ఒక్కోసారి రెండూ విధించే అవకాశం ఉంది. ♦ పాడి రైతుకు నిర్దేశిత ధర చెల్లించకపోయినా.. ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ శాతాలను తక్కువగా చూపించి మోసానికి పాల్పడినా రూ.50 వేల వరకు జరిమానా విధిస్తారు. రెండోసారి నేరానికి రూ.లక్ష జరిమానా లేదా 6 నెలల కారాగార శిక్ష లేదా రెండూ విధిస్తారు. రైతులు, వినియోగదారుల రక్షణ కోసమే.. పాల సేకరణలో దళారులు, వ్యాపారులు పాల్పడే మోసాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన పాలను సరఫరా చేయడమే లక్ష్యంగా దేశంలో మరెక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం పాడి రైతులకు పూర్తి రక్షణ కల్పిస్తుంది. – సీదిరి అప్పలరాజు, పశు సంవర్థక శాఖ మంత్రి -
Gun Culture: ఒకే రోజు 813 తుపాకీ లైసెన్సులు రద్దు..
పంజాబ్‌లో తుపాకి సంస్కృతికి వ్యతిరేకంగా భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం విరుచుకుపడింది. విచ్చలవిడిగా వినియోగిస్తున్న తుపాకులకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఒకే రోజు సుమారు 813 ఆయుధాల లైసెన్సులను రద్దు చేసింది ప్రభుత్వం. ఇప్పటి వరకు దాదాపు 2 వేలకు పైగా ఆయుధ లైసెన్సులు రద్దు చేసింది. ఈ మేరకు లూథియానా రూరల్ నుంచి 87, షాహీద్ భగత్‌సింగ్ నగర్ నుంచి 48, గురుదాస్‌పూర్ నుంచి 10, ఫరీద్కోట్ నుంచి 84, పఠాన్‌కోట్ నుంచి 199, హోషియాపూర్ నుంచి 47, కపుర్తలా నుంచి 6, ఎస్ఏఎస్ కస్బా నుంచి 235, సంగర్ నుంచి 16 తపాకీ లైసెన్స్‌లను రద్దు చేసింది. అలాగే తుపాకుల లైసెన్సు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నియమాలను పేర్కొంది. పంజాబ్‌లో బహిరంగ కార్యక్రమాలు, మతపరమైన ప్రదేశాలు, వివాహ వేడుకలు లేదా ఇతర కార్యక్రమాల్లో ఆయుధాలు తీసుకువెళ్లడం, ప్రదర్శించడాన్ని నిషేధించింది. రానున్న రోజుల్లో పోలీసులు వివిధ ప్రాంతాల్లో రాండమ్ చెకింగ్లు నిర్వహిస్తారని, హింసను ప్రోత్సహించేలా ఆయుధాలను ప్రదర్శించడంపై పూర్తి నిషేధం ఉంటుందని అధికార ఆప్ ప్రభుత్వం తెలిపింది. పంజాబ్‌లో మొత్తం మూడు లక్షల ఆయుధాల లైసెన్సులు ఉన్నాయని, ఈ తుపాకీ సంస్కృతిని అంతం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కాగా, 28 ఏళ్ల పంజాబీ గాయకుడు సిద్ధు మూస్ వాలా హత్యోదంతంతో రాష్ట్ర ప్రభుత్వం తుపాకీ సంస్కృతిపై దృష్టి సారించి, నియంత్రణ కోసం పిలుపునిచ్చింది. వాస్తవానికి సిద్ధు మూస్ వాలా వివాదాస్పద పంజాబీ పాటలకు ప్రసిద్ధి, అవి తుపాకీ సంస్కృతిని బహింరంగంగా ప్రోత్సహించడమే గాక గ్యాంగ్స్టర్లను కీర్తించింది. అతను రైఫిల్‌తో కాల్పులు జరుపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతనిపై కేసు కూడా నమోదైంది. (చదవండి: ఫుల్‌గాతాగి పెళ్లి మండపంలోనే నిద్రపోయిన వరుడు.. ఆ తర్వాత ఏమైందంటే..) -
12,580 ఎన్జీవోల లైసెన్సులు రద్దు! ఇక నో ఫారిన్ ఫండ్స్..
ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సీఆర్ఏ) 2010 కింద ఎన్జీవోలకు విదేశీ నిధులు చేరాలంటే లైసెన్సులను తప్పనిసరిగా కలిగి ఉండాలి. కాగా దాదాపు 12,580 ఎన్జీవో (నాన్ ఫ్రోఫిట్ ఆర్గనైజేషన్లు)ల లైసెన్సుల తుది గడువు నిన్నటితో ముగియడంతో వారి లైసెన్సులన్నీ శనివారం సీజ్ చేసినట్లు కేంద్ర హోం శాఖ తాజాగా విడుదల చేసిన జాబితాలో తెల్పింది. ఎఫ్సిఆర్ఎ కింద క్రితం రోజు వరకు యాక్టివ్‌గా ఉన్న 22,762 ఎన్జీఓలు ప్రస్తుతం 16,829కి తగ్గాయి. దాదాపు 5,933 ఎన్జీఓల రిజిస్ట్రేషన్లు రద్దు చేయబడ్డాయి (రెన్యూవల్ చేసుకోకపోవడంతో). మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇమాన్యుయేల్ హాస్పిటల్ అసోసియేషన్, ట్యూబర్క్యులోసిస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఆశాకిరణ్ రూరల్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సొసైటీ, చైతన్య రూరల్ డెవలప్మెంట్ సొసైటీ, ఎఫ్సిఆర్ఎ లైసెన్స్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తాజా జాబితాలో ఉంది. హమ్‌దర్డ్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ సొసైటీ, డీఏవీ కాలేజ్ ట్రస్ట్ అండ్ మేనేజ్మెంట్ సొసైటీ, ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్, జేఎన్‌యూలోని న్యూక్లియర్ సైన్స్ సెంటర్, ఇండియా హాబిటాట్ సెంటర్, లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్ సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటికే 6587 ఎన్జీఓలు జాబితాలో ఉన్నాయి.లైసెన్స్‌ల రెన్యువల్ కోసం గడువుకాలం పొడిగించినప్పటికీ ఆయా సంస్థలు అప్డేట్ చేసుకోలేదు. కాగా కొన్ని ఎన్జీఓల ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేన్‌కు తుది గడువు 2021 సెప్టెంబర్ 29,30 తేదీల్లో ముగియనుండగా, ఆ సమయాన్ని మార్చి 2022 వరకు హోం శాఖ పొడిగించింది. చదవండి: Online Frauds: అయ్యో పాపం! రూ. 1 లక్ష విలువైన ఐ ఫోన్ ఆర్డర్ చేస్తే డెలివరీ ఫ్యాక్‌లో.. -
ఎమ్మార్పీకి మించి విక్రయిస్తే లైసెన్సులు రద్దు
సాక్షి, అమరావతి: కృత్రిమ కొరత సృష్టించి ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామని వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎరువులు కొనుగోలు చేస్తున్నప్పుడు బస్తాపై ముద్రించిన ఎమ్మార్పీ ధరల ప్రకారమే కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. ఎమ్మార్పీకి మించి ఒక్క పైసా కూడా చెల్లించవద్దన్నారు. డీలర్ నుంచి విధిగా రసీదు పొందాలని సూచించారు. ఎవరైనా డీలర్లు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే.. స్థానిక వ్యవసాయాధికారికి గానీ, సమీకృత రైతు సమాచార కేంద్రం టోల్ ఫ్రీ నంబర్ 15521కి గానీ ఫిర్యాదు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఏప్రిల్ 19 నాటికి 6.63 లక్షల ఎంటీల ఎరువులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రానున్న ఖరీఫ్ సీజన్‌కు 20.45 లక్షల టన్నులను కేంద్రం కేటాయించిందని.. వాటిని నెలవారీ కేటాయింపుల ప్రకారం రాష్ట్రానికి సరఫరా చేస్తారని తెలిపారు. జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఎరువుల నిల్వలతో పాటు వాటిపై ముద్రించిన ఎమ్మార్పీ ధరల వివరాలను రైతులకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో అంతర్గత తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి రిటైల్, హోల్‌సేల్, తయారీదారుల స్టాక్ పాయింట్లను తనిఖీ చేయాలని ఆయన వ్యవసాయ శాఖ సంచాలకులకు ఆదేశాలిచ్చారు. -
ప్లకార్డులు పట్టుకుంటే సరిపోదు
సాక్షి, హైదరాబాద్ : ‘సంక్షేమ కార్యక్రమాల గురించి ఎన్నికలప్పుడు ప్లకా ర్డులు పట్టుకుంటే సరిపోదు. ఎన్నికల సమయంలోనే సంక్షే మ పథకాల గురించి మాట్లాడితే బాధ్యత తీరిపోదు. ఆ పథకాలు ఎలా అమలవుతున్నాయి, లోటుపాట్లు ఏమిటి.. ఆ కార్యక్రమ ప్రయోజనాలు లబ్ధిదారులకు అందుతున్నా యా.. తదితర విషయాలను పరిశీలించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. పథకాల అమలుపై పెర్ఫార్మెన్స్ ఆడిట్ నిర్వహించాలి. అప్పుడే ఆ పథకాల లక్ష్యం నెరవేరుతుంది.’ –ఉభయ రాష్ట్రాలను ఉద్దేశించి హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్య ఉభయ రాష్ట్రాల్లో యువతులు, మహిళలు, వృద్ధుల కోసం లైసెన్సులు తీసుకోకుండానే రక్షిత గృహాలు నిర్వహిస్తుంటే ఏం చేస్తున్నారని హైకోర్టు మంగళవారం ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. లైసెన్సుల్లేని రక్షిత గృహాల నిర్వాహకులపై ఏం చర్యలు తీసుకున్నారని నిలదీసింది. రక్షిత గృహాలకు లైసెన్సులు లేవని ఎవరో చెబితే తప్ప తెలుసుకోలేని దుస్థితిలో ఉన్నారా? అంటూ నిలదీసింది. దీనిపై వివరాలను తమ ముందు ఉంచాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. విచారణను నవంబర్ 6కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ టి.బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మను షుల అక్రమ రవాణా నిరోధక చట్టంలోని నిబంధనలను కఠినంగా అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయడంతో పాటు లైంగిక దాడులకు గురైన మహిళల రక్షణకు రక్షిత గృహాలను ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలంటూ స్వచ్ఛం ద సంస్థ ప్రజ్వల హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీన్ని పలుమార్లు విచారించిన సీజే నేతృత్వం లోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ఎన్నికల సమయంలో చెబితే సరిపోదు.. లైసెన్సులు లేకుండా రక్షిత గృహాలను నిర్వహిస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. కమిటీలు ఏర్పాటు చేశామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు చెప్పగా, ఇది రొటీన్ సమాధానం అయిపోయిందని వ్యాఖ్యానించింది. సంక్షేమ కార్యక్రమాల గురించి ఎన్నికలప్పుడు చెబితే సరిపోదని, వాటిపై ప్లకార్డులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించింది. ఈ సమయంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు మౌనంగా నిల్చుని ఉండటంతో, ప్రోగ్రెస్ కార్డులు పట్టుకుని తల్లిదండ్రుల ముందు నిలబడ్డ పిల్లల్లా నిల్చున్నట్లు ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
రక్త ఉత్పత్తుల అక్రమ దందా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రక్త నిల్వలకు సంబంధించిన ప్యాకెట్ల (బ్లడ్ ప్రొడక్ట్స్) అక్రమ విక్రయాలు జరుగుతున్నాయి. లైసెన్సులు లేకుండానే కొన్నిచోట్ల యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. కూకట్‌పల్లిలో ఒక హోల్‌సేల్ మెడికల్ షాపులో వెయ్యి రక్త ఉత్పత్తుల ప్యాకెట్లను కేంద్ర, రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అధికారులు సంయుక్తంగా పట్టుకుని అక్కడికక్కడే సీజ్ చేశారు. వాటిని ధ్వంసం చేసేందుకు కోర్టు అనుమతి తీసుకోనున్నారు. ఆ ప్యాకెట్లన్నీ కూడా ప్లాస్మా, క్రయో ప్రిస్పరేట్ రక్త ఉత్పత్తులని, వాటి విలువ రూ.2 లక్షలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. శనివారం నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు అధికారులు ఏకధాటిగా ఈ దాడులు చేశారు. ఆ మెడికల్ షాపునకు రక్త ఉత్పత్తులను విక్రయించే లైసెన్సు లేదు సరికదా ఆ ప్యాకెట్లపై కనీసం గడువు తేదీకూడా లేకపోవడం గమనార్హం. ఆ మెడికల్ షాపుకు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నెట్వర్క్ ఉందని తెలిసింది. కొన్నేళ్లుగా అక్రమంగా రక్త ఉత్పత్తుల దందా నిర్వహిస్తున్నా ఎవరూ గుర్తించలేదని సమాచారం. పైగా కొందరు అధికారులు కూడా ఆ షాపునకు సహకరిస్తున్నట్లు తెలిసింది. సాధారణంగా రక్త ఉత్పత్తుల విక్రయాలకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకోవాలి. అయితే చాలామంది బ్లడ్ బ్యాంక్ లైసెన్స్ తీసుకొని రక్త ఉత్పత్తులు తయారు చేస్తుంటారు. రక్తం ద్వారా కొన్ని ప్రత్యేకమైన వ్యాధులకోసం రక్త ఉత్పత్తులు తయారుచేస్తుంటారని డ్రగ్ కంట్రోల్ అధికారులు తెలిపారు. అలాగే ప్లాస్మా నుంచి ప్లేట్లెట్లు, రెడ్‌బ్లడ్ సెల్స్ సెపరేట్ చేస్తుంటారు. ఇలా నాలుగైదు రకాల రక్త ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌తో పలుచోట్ల అక్రమార్కులు లైసెన్సు లేకుండా, ప్రమాణాలు పాటించకుండా తయారుచేస్తుండటం గమనార్హం. అయితే 2012 తర్వాత రాష్ట్రంలో ఎక్కడా రక్త ఉత్పత్తుల విక్రయాలకు లైసెన్సు ఇవ్వలేదని సమాచారం. కూకట్‌పల్లిలోని ఆ మెడికల్ షాపులో రక్త ఉత్పత్తులను ప్రమాణాల ప్రకారం నిల్వ చేయలేదు. ఉదాహరణకు ప్లాస్మాను మైనస్ 20 డిగ్రీల వద్ద, క్రయోప్రిస్పరేట్ను మైనస్ 80 సెంటీగ్రేడ్ డిగ్రీల వద్ద నిల్వ ఉంచాలి. కానీ వాటిని ఏసీ రూములో పడేశారు. అలాగే వాటిపై లేబుళ్లు లేవు. రక్త ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌తో ఇష్టారాజ్యంగా వీటిని అమ్ముతున్నారు. పేరుకు అది హోల్‌సేల్ మెడికల్ షాపైనా ల్యాబ్‌లా ఉందని అంటున్నారు. ఈ దాడుల్లో డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్లు దాస్, రమ«ధాన్, ఇన్స్పెక్టర్లు నాగరాజు, చంద్రశేఖర్, మురళీకృష్ణ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
చిన్న బ్యాంకా.. మాకొద్దు!
సాక్షి, బిజినెస్ విభాగం: చిన్న బ్యాంకుల లైసెన్స్‌లు ఇస్తాం తీసుకోండి బాబూ అని ఆర్బీఐ పిలిచి మరీ అవకాశం ఇచ్చినా... పట్టణాల్లోని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల నుంచి ఏ మాత్రం స్పందన లేదు. చిన్న బ్యాంకులు మాకొద్దులేనన్న తీరులో అవి స్పందిస్తున్నాయి. నిజానికి ఆర్బీఐ చర్య సహకార బ్యాంకుల వ్యవస్థను అస్థిరపరిచేదిగా ఉందన్న భావన వ్యక్తమవుతోంది. కోఆపరేటివ్ బ్యాంకింగ్ రంగంలో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు చాలా బలంగా ఉండగా... అదే సమయంలో మూడంచెల గ్రామీణ కోఆపరేటివ్ వ్యవస్థ అధిక మొండి బకాయిలు (ఎన్పీఏ), నష్టాలతో సతమతం అవుతోంది. తాజా పరిణామంపై నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అర్బన్ కోపరేటివ్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ (నాఫ్కబ్) సీఈవో సుభాష్ గుప్తా స్పందిస్తూ... ‘‘కోపరేటివ్ బ్యాంకులపై గాంధీ కమిటీ తన నివేదిక విడుదల చేసినప్పుడు ఆ సిఫారసులను జనరల్‌బాడీ ఆమోదించలేదు. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులను బ్యాంకులుగా మార్చడం వల్ల కోఆపరేటివ్ నిర్మాణం బలహీనపడుతుంది. కనుక దీనికి మేం సానుకూలంగా లేం’’ అని తెలిపారు. బ్యాంకులుగా మారే సత్తా... అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో పెద్దవిగా ఉన్న కొన్నింటి ఆర్థిక సామర్థ్యం చూస్తే వాటికి పూర్తి స్థాయి బ్యాంకులుగా మారే సత్తా దండిగా ఉంది. సారస్వత్ కోఆపరేటివ్ బ్యాంకు, కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంకు, షామ్రో వితల్ కోఆపరేటివ్ బ్యాంకులు ఈ సామర్థ్యం ఉన్నవే. సారస్వత్ కోఆపరేటివ్ బ్యాంకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.58,500 కోట్ల రూపాయల టర్నోవర్ నమోదు చేయగా, రూ.241 కోట్ల లాభాన్ని ఆర్జించింది. కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంకు మొత్తం వ్యాపార పరిమాణం 2016 ఆర్థిక సంవత్సరానికి రూ.26,369 కోట్లు, నికర లాభం రూ.460 కోట్లుగా ఉండడం గమనార్హం. పెద్ద బ్యాంకుల స్థాయి వ్యాపారం వీటికి ఉండటం గమనార్హం. కోఆపరేటివ్ నమూనా తమకు చక్కగా సరిపోతుందని, అతిపెద్ద అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుగా దీర్ఘకాలిక డిపాజిట్ల జారీ ద్వారా రూ.300 కోట్లను సమీకరిస్తున్నామని సారస్వత్ బ్యాంకు చైర్మన్ గౌతం ఠాకూర్ తెలిపారు. ఎన్పీఏలు తక్కువే 2017 మార్చి నాటికి మన దేశంలో 1,562 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు, 94,384 రూరల్ కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల మొత్తం డిపాజిట్లు 2017 మార్చి 31 నాటికి రూ.4,43,500 కోట్లుగా ఉంటే, అడ్వాన్సులు (రుణాలు) రూ.2,61,200 కోట్లుగా ఉండడం గమనించాల్సిన అంశం. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల కంటే ఎన్పీఏల విషయంలో కోఆపరేటివ్ బ్యాంకుల పరిస్థితే మెరుగ్గా ఉంది. స్థూల ఎన్పీఏలు 7.1%, నికర ఎన్పీఏలు రూ.2.7%గా ఉన్నాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో మొత్తం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల ఉమ్మడి నికర లాభం పన్ను అనంతరం రూ.3,900 కోట్లుగా ఉంది. గతంలో ఆర్బీఐ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల విషయంలో ఉదారంగా వ్యవహరించింది. ఫలితంగా 1993–2004 మధ్యలో వీటి సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే, బలహీన ఆర్థిక పనితీరు వంటి అంశాలలో ఆర్బీఐ తన వైఖరి మార్చుకుంది. దాంతో విలీనాలు, వైదొలగడా లు వంటివి జరిగాయి. దాంతో 2004 మార్చి నాటికి 1,926 కోపరేటివ్ అర్బన్ బ్యాంకులు ఉండగా, ఆ సంఖ్య 2017 మార్చి నాటికి 1,526కు తగ్గుముఖం పట్టింది. మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా ల్లో ఎక్కువగా విలీనాలు చోటు చేసుకున్నాయి. కోపరేటివ్ బ్యాంకుల నిర్మాణమిదీ... కోఆపరేటివ్ క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్ రెండు కేటగిరీలు. 1. అర్బన్ కోపరేటివ్ 2. రూరల్ కోపరేటివ్. రూరల్ కోఆపరేటివ్ విభాగంలో మళ్లీ, షార్ట్ (మీడియం టర్మ్ కూడా కలుపుకుని), లాంగ్‌టర్మ్ క్రెడిట్ కేటగిరీలుగా విభజన ఉంది. షార్ట్ టర్మ్ రూరల్ క్రెడిట్ కేటగిరీ తిరిగి మూడంచెలుగా ఉంటుంది. ఇవి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులు, డీసీసీబీలు, పీఏసీఎస్‌లు. లాంగ్‌టర్మ్ కోఆపరేటివ్ బ్యాంకులు... స్టేట్ కోఆపరేటివ్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్, ప్రైమరీ కోఆపరేటివ్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంకులుగా వర్గీకరణ ఉంది. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు ఈ వ్యవస్థ నుంచి తప్పుకుంటే మిగిలినవి మరింత బలహీనంగా మారిపోతాయన్న ఆందోళన ఉంది. 2016 మార్చికి డిస్ట్రిక్స్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకుల (డీసీసీబీ) మొత్తం ఎన్పీఏలు రూ.22,400 కోట్లు, స్టేట్ కోఆ పరేటివ్ బ్యాంకుల ఎన్పీఏలు రూ.5,147 కోట్లు. -
చార్జింగ్ స్టేషన్లకు లైసెన్సులు అక్కర్లేదు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా లైసెన్సు అవసరం లేకుండానే ఈ–వాహనాల చార్జింగ్ స్టేషన్లను నిర్వహించవచ్చని కేంద్ర విద్యుత్ శాఖ స్పష్టం చేసింది. సాధారణంగా విద్యుత్ సరఫరా, పంపిణీ, ట్రేడింగ్ మొదలైన వాటికి ఎలక్ట్రిసిటీ చట్టం కింద లైసెన్సు తీసుకోవడం తప్పనిసరి. ఆ ప్రకారంగా చూస్తే వినియోగదారులకు విద్యుత్‌ను విక్రయించే సంస్థలన్నీ కూడా లైసెన్సులు తీసుకోవాల్సిందే. అయితే, బ్యాటరీల చార్జింగ్‌ను సేవల విభాగం కింద వర్గీకరించడం ద్వారా కేంద్రం ఈ మేరకు నిబంధనల నుంచి వెసులుబాటు కల్పించింది. బ్యాటరీలను చార్జింగ్ చేయడంలో సదరు చార్జింగ్ స్టేషన్.. ఎటువంటి సరఫరా, పంపిణీ, ట్రేడింగ్ కార్యకలాపాలు నిర్వహించదు కనుక లైసెన్సు అవసరం ఉండదని విద్యుత్ శాఖ తెలిపింది. ఇది పురోగామి చర్యగా.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థల సొసైటీ (ఎస్ఎంఈవీ) డైరెక్టర్ సొహిందర్ గిల్ అభివర్ణించారు. ప్రధాన సవాలైన చార్జింగ్ వ్యవస్థకు సంబంధించి ఆటంకాలు తొలగించిన విధం గానే, ఇతరత్రా స్థల సమీకరణ మొదలైన సమస్యల పరిష్కారంపై కూడా దృష్టి పెట్టాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు ఆయన చెప్పారు. త్వర లో ఎలక్ట్రిక్ వాహనాల నియంత్రణ, సాంకేతిక ప్రమాణాలు మొదలైన వాటికి సంబంధించి ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి అర్కే సింగ్ గత నెలలో వెల్లడించారు. బ్యాటరీల చార్జింగ్కు టారిఫ్ ప్రతి యూనిట్‌కు రూ. 6 చొప్పున అందుబాటు స్థాయిలో ఉంచే అవకాశం ఉందని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. 2030 నాటికల్లా దేశీయంగా 100% ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. -
దస్తావేజు లేఖరులకు లైసెన్స్!
అక్రమాల నియంత్రణ కోసం రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కుంభకోణాలకు నిలయంగా మారిన రిజిస్ట్రేషన్లు–స్టాంపుల శాఖను ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రిజిస్ట్రేషన్లలో కీలకమైన దస్తావేజులను రాసే బాధ్యతలను అర్హత కలిగిన వ్యక్తులకు అప్పగించాలని... దస్తావేజు లేఖరు ల (డాక్యుమెంట్ రైటర్)కు లైసెన్సులు ఇవ్వడం ద్వారా అక్రమాలకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. వాస్తవానికి 2000 సంవత్సరానికి ముందు రిజిస్ట్రేషన్ల శాఖలో లైసెన్స్డ్ దస్తావేజుల లేఖరులు ఉండేవారు. ఆ తర్వాత ‘కార్డ్ (కంప్యూటరైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్)’విధానాన్ని ప్రవేశపెట్టడం తో అప్పటి ప్రభుత్వం దస్తావేజు లేఖరులను తొలగించింది. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం ఆ తర్వాత రిజిస్ట్రేషన్ల శాఖలో దళారులకు మంచి అవకాశంగా మారింది. దళారులు డబ్బు ఆశ చూపుతుండడంతో కొందరు సబ్రిజిస్ట్రార్లు భారీ స్థాయిలో అక్రమాలకు వెనుకాడటంలేదు. మూడు వేల మందికి అవకాశం... అర్హత కలిగిన వారికి దస్తావేజు లేఖరులుగా లైసెన్స్ ఇవ్వాలని భావిస్తున్న నేపథ్యంలో సుమారు 3వేల మంది నిరుద్యోగులకు అవకాశం లభించవచ్చని అంచనా. రాష్ట్రంలో 141 సబ్ రిజిస్ట్రార్, 12 జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలుండగా... ఒక్కొక్క కార్యాలయానికి కనీసం 15 మంది చొప్పున నియమించాల ని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి కనీస అర్హత డిగ్రీ కాగా.. న్యాయశాస్త్రం (లా) అభ్యసించిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయానికి వచ్చింది. దస్తావేజు రాసినందుకు రూ.10లక్షలలోపు విలువైన డాక్యుమెం ట్‌కు రూ.1,000, రూ.50 లక్షలలోపు రూ.2,000 చొప్పున లేఖరులకు ఫీజు చెల్లించే వీలు కల్పిస్తున్నా రు. డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్సులు ఇవ్వడం ద్వారా రిజిస్ట్రేషన్లలో జరిగే తప్పిదాలకు వారిని కూడా బాధ్యులుగా పరిగణించాలని భావిస్తున్నారు. సిబ్బంది బదిలీలకు రంగం సిద్ధం రిజిస్ట్రేషన్ల శాఖలో ఇటీవల 72 మంది సబ్ రిజి స్ట్రార్లను బదిలీ చేసిన ప్రభుత్వం... తాజాగా ఒకేచోట దీర్ఘకాలంగా పనిచేస్తున్న జూనియర్, సీనియర్ అసి స్టెంట్లను, అటెండర్లను బదిలీ చేయాలని నిర్ణయిం చింది. తొలిదశలో క్షేత్రస్థాయి సిబ్బందిని బదిలీ చేసి... ఆపై జిల్లా రిజిస్ట్రార్ల బదిలీలను కూడా చేపట్టా లని గురువారం ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ వద్ద జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఈ శాఖలో రాష్ట్రవ్యాప్తంగా 196 మంది సీనియర్ అసిస్టెంట్లు, 380 మంది జూనియర్ అసిస్టెంట్లు, 190 మంది అటెండర్లు రెగ్యులర్ ఉద్యోగులుగా ఉండగా... కాంట్రాక్టు పద్ధతిన మరో వంద మంది కంప్యూటర్ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. -
హుక్కా కేంద్రాలకు హైకోర్టులో చుక్కెదురు
పోలీసుల జోక్యంపై దాఖలైన పిటిషన్లు కొట్టివేత హైదరాబాద్: రాజధానిలో హుక్కా కేంద్రాలకు ఉమ్మడి హైకోర్టులో చుక్కె దురైంది. రెస్టారెంట్లు, కాఫీషాపులు హæుక్కా సెంటర్ల విషయంలో పోలీసులు జోక్యం చేసుకుంటున్నారంటూ పలువురు యజమానులు దాఖలు చేసిన వ్యాజ్యా లను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో శుక్రవారం తీర్పు వెలువరించారు. తమ వ్యాపార కార్యక లాపాల్లో పోలీసుల జోక్యాన్ని నిలువరిం చాలంటూ గతేడాది పిటిషన్లు దాఖలు చేశారు. తమకు వ్యాపార నిర్వహణ నిమిత్తం జీహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్సులు జారీ చేసినందున వ్యాపారాల్లో పోలీసు లు జోక్యానికి వీల్లేదని వాదించారు. వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. విచారణకు స్వీకరించదగ్గ నేరం జరుగు తుంటే దాన్ని నియంత్రించే అధికారం పోలీసులకు ఉందని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ రెస్టారెంట్ల నిర్వహణకే అను మతిచ్చింది తప్ప హుక్కా సెంటర్ల నిర్వహ ణకు కాదన్నారు. రాత్రి 11 గంటలు దాటాక హుక్కా కేంద్రాలు తెరిచి ఉంచరా దని, తమవి హుక్కా కేంద్రాలని సూచించే బోర్డులు ఏర్పాటు చేయాలని, కేంద్రాల్లోకి 18 ఏళ్లలోపు వారిని అనుమతించరా దంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని యజమానులను న్యాయమూర్తి ఆదేశించారు. -
'మంత్రిగా ఈ విషయం చెప్పేందుకు ఇబ్బందవుతోంది'
న్యూఢిల్లీ: దేశంలో 30శాతం డ్రైవింగ్ లైసెన్సులు బోగస్‌వేనని బీజేపీ నేత, కేంద్ర ఉపరితల రవాణాశాఖా మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఒక మంత్రిగా ఈ విషయాన్ని చెప్పడానికి తనకు చాలా ఇబ్బందిగా అనిపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారిని, ఆ చర్యలను పసిగట్టేందుకు ఇక నుంచి ఇంటెలిజెంట్ ట్రాఫిక్ వ్యవస్థను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రోడ్డు భద్రతా ప్రమాణాల విషయంలో చాలా అంతరాలు ఉన్నాయని, ఇబ్బందులను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్ల నమూనాలను మార్చాలని, అది ఒక బాధ్యతగా చేపట్టాలని కోరారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించని వారి విషయంలో కఠినంగా వ్యవహరించేలా నిబంధనలు మార్చే ఆలోచన చేస్తోందని గడ్కరీ పరోక్షంగా చెప్పారు. ప్రస్తుం రవాణా వ్యవస్థలో ఉపయోగిస్తున్న కంప్యూటర్లను ఆధునీకరించాలని, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతం ఉన్న మోటారు వాహన చట్టంలో సవరణ బిల్లును జనవరి 27న జరిఏ సమావేశం తర్వాత కేబినెట్ వద్దకు తీసుకెళతానని స్పష్టం చేశారు. -
పేమెంట్ బ్యాంకులు మాకొద్దు!
⇔ లైసెన్సులు పొంది కూడా వెనక్కెళుతున్న సంస్థలు ⇔ ఇప్పటికే మూడు కంపెనీలు వెనకబాట ⇔ ఇక మిగిలినవి 8 కంపెనీలే ⇔ లాభదాయకత సమస్యలే కారణం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : అందరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చే మహత్తర లక్ష్యంతో చాన్నాళ్ల తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఈ మధ్య మళ్లీ కొత్త బ్యాంకుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే చిన్న బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు ఏర్పాటు చేసుకోవటానికి పచ్చజెండా ఊపింది. మైక్రోఫైనాన్స్ సంస్థలు మొదలుకుని రిలయన్స్ నుంచి బిర్లాల దాకా పెద్ద పెద్ద కంపెనీలు సైతం పోటీపడి మరీ వీటి లెసైన్సుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. 41 కంపెనీలు పోటీ పడితే చివరకు గతేడాది ఆగస్టులో 11 సంస్థలు పేమెంటు బ్యాంకు అనుమతుల్ని దక్కించుకున్నాయి. అయితే, ఇంత పోటీపడి అనుమతులు దక్కించుకున్నప్పటికీ ... తీరా ఏర్పాటు చేసే సమయం వచ్చేసరికి ఒక్కొక్క సంస్థ వెనక్కి జారుకుంటోంది. అన్నింటికన్నా ముందుగా ఈ ఏడాది మార్చిలో చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ సంస్థ తమకు పేమెంట్ బ్యాంకు లెసైన్స్ వద్దంటూ వెనక్కెళ్లిపోయింది. రెండు నెలల తర్వాత ఈ మే నెల్లో సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ, ఐడీఎఫ్సీ బ్యాంక్, టెలినార్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కన్సార్షియం కూడా పక్కకు తప్పుకుంటున్నట్లు ప్రకటించాయి. పెద్ద ఎత్తున విస్తరించేందుకు సంఖ్యాపరంగా తమకు తగినన్ని శాఖలు/కార్యాలయాలు లేవని ప్రమోటర్లు భావించడమే ఇందుకు కారణంగా ఈ సంస్థలు చెప్పాయి. ఇక తాజాగా ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా సైతం తప్పుకుంది. మహీంద్రా ఫైనాన్స్‌తో కలిసి అక్టోబర్-నవంబర్ నాటికల్లా పేమెంట్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని కసరత్తు చేసినప్పటికీ... అధిక పోటీ, ఒత్తిళ్లు తదితర అంశాల వల్ల ఈ రంగంలో లాభాలు రావటానికి చాలా సమయం పడుతుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని టెక్ మహీంద్రా ఎండీ సీపీ గుర్నానీ చెప్పారు. తాము ఎంతో కష్టపడి మదింపు చేసి మరీ ఎంపిక చేసిన సంస్థలు ఇలా ఒక్కొక్కటిగా వైదొలుగుతుండటంతో ఆర్బీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఎందుకిలా తిరుగు టపా!! మొదట్లో అంత స్పష్టంగా వెల్లడించకపోయినా... రానురాను పేమెంటు బ్యాంకులకున్న పరిమితులన్నీ బయటపడ్డాయి. ఈ బ్యాంకులు రూ.1 లక్ష వరకూ మాత్రమే డిపాజిట్లు స్వీకరించే అవకాశం ఉంటుంది. దీనికితోడు ఎవ్వరికీ రుణాలివ్వటానికి వీలుండదు. క్రెడిట్ కార్డులు కూడా జారీ చేయకూడదు. వీటన్నిటికీ తోడు ఈ బ్యాంకులు తాము సేకరించే నిధుల్లో 75 శాతం నిధుల్ని ప్రభుత్వ బాండ్లలోనే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మిగతా డబ్బును లిక్విడిటీ అవసరాల కోసం తమ వద్ద అట్టే పెట్టుకోవచ్చు. రుణాలెలా ఇవ్వవు కాబట్టి మొండి బకాయిల సమస్యా ఉండదు. అయితే, డిపాజిట్లను ఆకర్షించేందుకు అవి ఎంతో కొంత వడ్డీ రేటయితే చెల్లించక తప్పదు కదా!!. ఇక్కడే అసలు సమస్య వచ్చేది. ఏడాది మెచ్యూరిటీ వ్యవధి ఉండే ప్రభుత్వ బాండ్ల విషయం చూస్తే ప్రస్తుతం సుమారు ఏడు శాతం పైచిలుకు మాత్రమే రాబడి ఉంటోంది. మరోవైపు, ఇతర బ్యాంకులతో పోటీ పడాలంటే ఈ పేమెంటు బ్యాంకులు డిపాజిట్లపై ఎంత లేదన్నా నాలుగు నుంచి ఆరున్నర శాతమైనా వడ్డీ రేటు ఇస్తే కానీ ఖాతాదారులు ముందుకు రారు. అంటే నికరంగా వాటికి అర శాతం నుంచి ఒక్క శాతం మాత్రమే మార్జిన్ ఉంటుంది. నిర్వహణ ఖర్చులన్నీ కూడా ఈ కాస్త మొత్తంలోనే చూసుకోవాలి. అది సాధ్యం కావాలంటే ఖాతాదారులు, లావాదేవీల సంఖ్య భారీగా ఉండటం తప్పనిసరి. ఇతరత్రా బిల్లు పేమెంట్లు వంటివాటిపై చార్జీలు వసూలు చేసుకునే వీలున్నప్పటికీ... ఆరంభంలోనే వడ్డించడం మొదలుపెడితే కస్టమర్లు రారు. కాబట్టి ప్రారంభ దశలో కొన్నాళ్లైనా కొన్ని సేవలు ఉచితంగానే అందించక తప్పదు. ఇవన్నీ చూసుకుంటే సదరు బ్యాంకులు బ్రేక్ ఈవెన్ (లాభనష్ట రహిత స్థితి) సాధించాలన్నా కనీసం మూడు నుంచి అయిదేళ్ల కాలం పట్టేస్తుందని అంచనా. కోట్ల కొద్దీ కస్టమర్లు... భారీ నెట్వర్క్ ఉన్న టెలికం కంపెనీలు, పోస్టల్ విభాగం మొదలైన వాటికి ఈ పేమెంట్ బ్యాంకులు ప్రయోజనకరంగా ఉండగలవని విశ్లేషకుల అభిప్రాయం. బరిలో మిగిలినవి.. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆదిత్య బిర్లా నువో (ఐడియా సెల్యులార్), ఎయిర్టెల్, వొడాఫోన్, పోస్టల్ శాఖ, ఫినో పేటెక్, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎన్ఎస్డీఎల్), విజయ్ శేఖర్ శర్మ (పేటీఎం వ్యవస్థాపకుడు). -
ఈ నెల 28న మద్యం లైసెన్సులు జారీ
హైదరాబాద్: నూతన మద్యం విధానంలో భాగంగా 2015 - 17 సంవత్సరాల కోసం ఏర్పాటు చేసుకునే మద్యం దుకాణాలకు(ఎ-4 షాపులకు) ఈనెల 28న లెసైన్సులు జారీ చేయనున్నట్లు ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాల వారీగా ఏర్పాటు చేసే దుకాణాలకు సంబంధించి ఈనెల 14న జిల్లా గెజిట్‌లో నోటిఫికేషన్ జారీ చేస్తారని, 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరిస్తారని తెలిపారు. ఈనెల 23వ తేదీ ఉదయం 11 గంటల నుంచి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో మద్యం దుకాణాల కేటాయింపు డ్రా ఉంటుందని తెలిపారు. డ్రాలో మద్యం దుకాణాలు దక్కించుకున్న వాళ్లకు 26వ తేదీన ప్రొవిసనల్ లెసైన్సులు ఇచ్చి 28న పూర్తి స్థాయి అనుమతులు మంజూరు చేయనున్నట్లు చంద్రవదన్ తెలిపారు.