పంజాబ్‌లో తుపాకి సంస్కృతికి వ్యతిరేకంగా భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం విరుచుకుపడింది. విచ్చలవిడిగా వినియోగిస్తున్న తుపాకులకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఒకే రోజు సుమారు 813 ఆయుధాల లైసెన్సులను రద్దు చేసింది ప్రభుత్వం. ఇప్పటి వరకు దాదాపు 2 వేలకు పైగా ఆయుధ లైసెన్సులు రద్దు చేసింది. ఈ మేరకు లూథియానా రూరల్ నుంచి 87, షాహీద్ భగత్‌సింగ్ నగర్ నుంచి 48, గురుదాస్‌పూర్ నుంచి 10, ఫరీద్‌కోట్ నుంచి 84, పఠాన్‌కోట్ నుంచి 199, హోషియాపూర్ నుంచి 47, కపుర్తలా నుంచి 6, ఎస్‌ఏఎస్ కస్బా నుంచి 235, సంగర్ నుంచి 16 తపాకీ లైసెన్స్‌లను రద్దు చేసింది. అలాగే తుపాకుల లైసెన్సు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నియమాలను పేర్కొంది. పంజాబ్‌లో బహిరంగ కార్యక్రమాలు, మతపరమైన ప్రదేశాలు, వివాహ వేడుకలు లేదా ఇతర కార్యక్రమాల్లో ఆయుధాలు తీసుకువెళ్లడం, ప్రదర్శించడాన్ని నిషేధించింది.
రానున్న రోజుల్లో పోలీసులు వివిధ ప్రాంతాల్లో రాండమ్ చెకింగ్‌లు నిర్వహిస్తారని, హింసను ప్రోత్సహించేలా ఆయుధాలను ప్రదర్శించడంపై పూర్తి నిషేధం ఉంటుందని అధికార ఆప్ ప్రభుత్వం తెలిపింది. పంజాబ్‌లో మొత్తం మూడు లక్షల ఆయుధాల లైసెన్సులు ఉన్నాయని, ఈ తుపాకీ సంస్కృతిని అంతం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కాగా, 28 ఏళ్ల పంజాబీ గాయకుడు సిద్ధు మూస్ వాలా హత్యోదంతంతో రాష్ట్ర ప్రభుత్వం తుపాకీ సంస్కృతిపై దృష్టి సారించి, నియంత్రణ కోసం పిలుపునిచ్చింది. వాస్తవానికి సిద్ధు మూస్ వాలా వివాదాస్పద పంజాబీ పాటలకు ప్రసిద్ధి, అవి తుపాకీ సంస్కృతిని బహింరంగంగా ప్రోత్సహించడమే గాక గ్యాంగ్‌స్టర్‌లను కీర్తించింది. అతను రైఫిల్‌తో కాల్పులు జరుపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతనిపై కేసు కూడా నమోదైంది.
(చదవండి: ఫుల్‌గాతాగి పెళ్లి మండపంలోనే నిద్రపోయిన వరుడు.. ఆ తర్వాత ఏమైందంటే..)
Comments
Please login to add a commentAdd a comment