ఒలింపిక్స్‌ను వీక్షించేందుకు పారిస్ వెళ్లేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించింది. ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత హాకీ జట్టుకు మద్దతుగా మాన్ ఆగస్టు 3 నుంచి 9 వరకు ఫ్రాన్స్ రాజధానిని సందర్శించాల్సి ఉంది.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఒలింపిక్స్‌ను వీక్షించేందుకు ప్యారిస్ వెళ్లేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అనుమతి నిరాకరించింది. భద్రతా కారణాలతో అనుమతి నిరాకరించినట్లు పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందించింది.
కాగా సీఎం భగవంత్ మాన్ ఆగస్టు 3 నుంచి 9 వరకు ప్యారిస్ పర్యటనకు వెళ్లాలని అనుకున్నారు. అక్కడ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత హాకీ జట్టుకు మద్దతు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు. సీఎం, తన భార్య డాక్టర్ గుర్‌ప్రీత్ కౌర్ మాన్, ఇద్దరు సహాయకులు, మరో అయిదుగురు భద్రతా అధికారులు, సీఎంఓ నుంచి 10 మంది సీనియర్ అధికారుల ప్యారిస్‌కు వెళ్లేందుకు అనుమతి కోరగా.. ఆలస్యంగా అనుమతి కోరడం వల్ల భద్రతా కారణాలతో తిరస్కరించినట్లు ఎమ్‌ఈఏ పేర్కొంది.
భారత్ నుంచి ఒలింపిక్ కంటెంజెంట్‌లో పంజాబ్‌కు చెందిన 19 మంది ఆటగాళ్లు ఉన్నారు. హాకీ జట్టులో పది మంది క్రీడాకారులు మన రాష్ట్రానికి చెందినవారు. 52 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించింది.
అయితే ప్యారిస్ వెళ్లడానికి అనుమతి కోసం దరఖాస్తు చేయడంలో మా అధికారులు ఆలస్యం చేశారు, అయితే హాకీ జట్టు ప్రారంభ మ్యాచ్‌లను క్లియర్ చేసిన తర్వాత మాత్రమే మేము వారిని ఉత్సాహపరిచేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం’ అని సీఎం ఓ ప్రకటనలో తెలిపారు.
అయితే తనకు అనుమతి నిరాకరించడంపై మాన్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశ సమాఖ్య విధానంపై బీజేపీ నిరంతరం దాడి చేస్తోందని విమర్శించారు. 2022లోనూ సింగపూర్ వెళ్లేందుకు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు బీజేపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు ప్రస్తావించారు. గత ఏడాది గోపాల్ రాయ్‌కి కూడా అమెరికా వెళ్లేందుకు అనుమతి నిరాకరించారని, ఆయన కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. బీజేపీ పాలనలో ప్రతిదానికీ కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment