సిఫ్త్ కౌర్ సమ్రా
మెడికల్ కాలేజీ నుంచి ΄్యారిస్ ఒలింపిక్స్ వరకు
ఒలింపిక్స్‌కు సంబంధించి ‘పతకాల వేట’ మాట ఎలా ఉన్నా... స్ఫూర్తిదాయక కథలు ఎన్నో ఉన్నాయి. ఆ కథల్లో ఒకటి... సిఫ్త్ కౌర్ సమ్రా ప్రయాణం. డాక్టర్ కాబోయి యాక్టర్ కాలేదు కౌర్. షూటర్ అయింది. ఆసియా క్రీడల్లో బంగారు పతకంతో మెరిసి దేశం దృష్టిని ఆకర్షించింది. ‘టైమ్ మేనేజ్‌మెంట్’పై గట్టి పట్టు ఉన్న కౌర్ ఒలింపిక్స్ వరకూ వచ్చింది...
పంజాబ్‌లోని వ్యవసాయ కుటుంబంలో పుట్టిన సిఫ్త్ కౌర్ సమ్రాకు చిన్నప్పటి నుంచి చదువు అంటే ఎంత ఇష్టమో, ఆటలూ అంతే ఇష్టం. తొమ్మిది సంవత్సరాల వయసులో కౌర్‌కు కరణ్ అనే కజిన్ షూటింగ్‌లో ఓనమాలు నేర్పించాడు. గురి చూసి కొట్టే నైపుణ్యం అప్పటి నుంచే అబ్బింది.
ఎంబీబీయస్ చేయాలన్న ఆమె లక్ష్యం కూడా గురి తప్పలేదు. ఫరీద్‌కోట్‌లోని జీజీఎస్ మెడికల్ కాలేజీలో చేరింది. చదువు సంగతి ఎలా ఉన్నా... షూటింగ్ గేమ్స్ ఎక్కడ జరిగినా ఠంచనుగా ఫాలో అయ్యేది. భో΄ాల్‌లో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్‌లో కాంస్య పతకం గెలుచుకోవడం తో ‘మెడికలా? మెడలా?’ అనే సందిగ్ధంలోకి వచ్చింది కౌర్. ‘మెడల్’ అనేది ‘షూటింగ్’కు ప్రతీక.
చివరికి ఆమె మెడల్ వైపే మొగ్గింది. ‘కాలేజీలో 80 శాతం అటెండెన్స్’ నియమం వల్ల ్ర΄ాక్టీస్ చేయడానికి, ΄ోటీల్లో ΄ాల్గొనడానికి ఇబ్బందిగా ఉండేది. తాను పూర్తిగా షూటింగ్ వైపు రావాలనుకోవడానికి ఇదొక కారణం. అందరూ కౌర్‌ను ‘కాబోయే డాక్టరమ్మ’ అని పిలుచుకుంటున్న రోజుల్లో...‘చదువు మానేసి పూర్తి సమయం షూటింగ్‌కే కేటాయించాలి అనుకుంటున్నాను’ అని తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వారు షాక్ అవ్వకుండా ‘అలాగే అమ్మా! నీ ఇష్టం’ అని చె΄్పారు. అలా చెప్పడానికి ఎంతో గుండె ధైర్యం కావాలి. కూతురుపై అంతకుమించిన నమ్మకం కావాలి. ఆ నమ్మకం వారికి ఉంది. ఆ నమ్మకం పునాదిపై షూటింగ్‌లో తన కెరీర్‌ను నిర్మించుకుంది కౌర్.
2023 ఆసియా క్రీడల్లో 50 మీటర్ల రైఫిల్ 3 ΄÷జిషన్‌లో వరల్డ్ రికార్డ్ స్కోర్‌తో బంగారు పతకాన్ని గెలుచుకున్న సిఫ్త్ కౌర్ సమ్రా పేరు మారుమోగి΄ోయింది.
50 మీ. ఎయిర్ రైఫిల్ 3 ΄÷జిషన్స్‌లో పర్‌ఫెక్ట్ స్కోర్ కోసం టైమ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ముఖ్యమైనది. టైమ్ మేనేజ్‌మెంట్‌పై కౌర్‌కు మంచి అవగాహన ఉంది. ఆ అవగాహనే ఆమె విజయ కారణాలలో ఒకటి. ఒత్తిడికి గురవుతున్నప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి...అనే టెక్నిక్ కూడా కౌర్‌కు బాగా తెలుసు. తన గురించి ‘యాక్సిడెంటల్ షూటర్’ అని చెప్పుకుంటుంది కౌర్. అయితే ఆమె విజయాలు యాక్సిడెంటల్‌గా రాలేదు. చెమట చిందించి సాధించిన విజయాలు అవి.
‘మీ సక్సెస్ మంత్ర ఏమిటి.’ అని అడిగితే...‘మ్యాచ్‌లు అనేవి ్ర΄్టాకిస్ సెషన్‌లకు రీ నేమ్‌డ్ వెర్షన్‌లు మాత్రమే...అని ఒకసారి కోచ్ నాతో చె΄్పారు. ఇక అప్పటి నుంచి ఆ మంత్రాన్ని అనుసరిస్తూ ఒత్తిడికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాను’ అంటుంది సిఫ్త్ కౌర్ సమ్రా.
Comments
Please login to add a commentAdd a comment