former family
-
Sift Kaur Samra: మెడిసిన్ వదిలేసి మెడల్ కోసం...
ఒలింపిక్స్‌కు సంబంధించి ‘పతకాల వేట’ మాట ఎలా ఉన్నా... స్ఫూర్తిదాయక కథలు ఎన్నో ఉన్నాయి. ఆ కథల్లో ఒకటి... సిఫ్త్ కౌర్ సమ్రా ప్రయాణం. డాక్టర్ కాబోయి యాక్టర్ కాలేదు కౌర్. షూటర్ అయింది. ఆసియా క్రీడల్లో బంగారు పతకంతో మెరిసి దేశం దృష్టిని ఆకర్షించింది. ‘టైమ్ మేనేజ్మెంట్’పై గట్టి పట్టు ఉన్న కౌర్ ఒలింపిక్స్ వరకూ వచ్చింది...పంజాబ్‌లోని వ్యవసాయ కుటుంబంలో పుట్టిన సిఫ్త్ కౌర్ సమ్రాకు చిన్నప్పటి నుంచి చదువు అంటే ఎంత ఇష్టమో, ఆటలూ అంతే ఇష్టం. తొమ్మిది సంవత్సరాల వయసులో కౌర్‌కు కరణ్ అనే కజిన్ షూటింగ్లో ఓనమాలు నేర్పించాడు. గురి చూసి కొట్టే నైపుణ్యం అప్పటి నుంచే అబ్బింది. ఎంబీబీయస్ చేయాలన్న ఆమె లక్ష్యం కూడా గురి తప్పలేదు. ఫరీద్‌కోట్‌లోని జీజీఎస్ మెడికల్ కాలేజీలో చేరింది. చదువు సంగతి ఎలా ఉన్నా... షూటింగ్ గేమ్స్ ఎక్కడ జరిగినా ఠంచనుగా ఫాలో అయ్యేది. భో΄ాల్లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్‌లో కాంస్య పతకం గెలుచుకోవడం తో ‘మెడికలా? మెడలా?’ అనే సందిగ్ధంలోకి వచ్చింది కౌర్. ‘మెడల్’ అనేది ‘షూటింగ్’కు ప్రతీక.చివరికి ఆమె మెడల్ వైపే మొగ్గింది. ‘కాలేజీలో 80 శాతం అటెండెన్స్’ నియమం వల్ల ్ర΄ాక్టీస్ చేయడానికి, ΄ోటీల్లో ΄ాల్గొనడానికి ఇబ్బందిగా ఉండేది. తాను పూర్తిగా షూటింగ్ వైపు రావాలనుకోవడానికి ఇదొక కారణం. అందరూ కౌర్‌ను ‘కాబోయే డాక్టరమ్మ’ అని పిలుచుకుంటున్న రోజుల్లో...‘చదువు మానేసి పూర్తి సమయం షూటింగ్‌కే కేటాయించాలి అనుకుంటున్నాను’ అని తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వారు షాక్ అవ్వకుండా ‘అలాగే అమ్మా! నీ ఇష్టం’ అని చె΄్పారు. అలా చెప్పడానికి ఎంతో గుండె ధైర్యం కావాలి. కూతురుపై అంతకుమించిన నమ్మకం కావాలి. ఆ నమ్మకం వారికి ఉంది. ఆ నమ్మకం పునాదిపై షూటింగ్లో తన కెరీర్‌ను నిర్మించుకుంది కౌర్.2023 ఆసియా క్రీడల్లో 50 మీటర్ల రైఫిల్ 3 ΄÷జిషన్‌లో వరల్డ్ రికార్డ్ స్కోర్‌తో బంగారు పతకాన్ని గెలుచుకున్న సిఫ్త్ కౌర్ సమ్రా పేరు మారుమోగి΄ోయింది.50 మీ. ఎయిర్ రైఫిల్ 3 ΄÷జిషన్స్లో పర్ఫెక్ట్ స్కోర్ కోసం టైమ్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమైనది. టైమ్ మేనేజ్మెంట్పై కౌర్‌కు మంచి అవగాహన ఉంది. ఆ అవగాహనే ఆమె విజయ కారణాలలో ఒకటి. ఒత్తిడికి గురవుతున్నప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి...అనే టెక్నిక్ కూడా కౌర్‌కు బాగా తెలుసు. తన గురించి ‘యాక్సిడెంటల్ షూటర్’ అని చెప్పుకుంటుంది కౌర్. అయితే ఆమె విజయాలు యాక్సిడెంటల్‌గా రాలేదు. చెమట చిందించి సాధించిన విజయాలు అవి.‘మీ సక్సెస్ మంత్ర ఏమిటి.’ అని అడిగితే...‘మ్యాచ్‌లు అనేవి ్ర΄్టాకిస్ సెషన్లకు రీ నేమ్డ్ వెర్షన్లు మాత్రమే...అని ఒకసారి కోచ్ నాతో చె΄్పారు. ఇక అప్పటి నుంచి ఆ మంత్రాన్ని అనుసరిస్తూ ఒత్తిడికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాను’ అంటుంది సిఫ్త్ కౌర్ సమ్రా. -
8 లక్షల ట్రాక్టర్, రొటావేటర్..
మదనపల్లె: ప్రముఖ నటుడు సోనూసోద్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. తండ్రి వ్యవసాయ పనుల్లో కాడెద్దులుగా మారి తమవంతు సాయం చేస్తున్న ఇద్దరు కూతుళ్ల వీడియోను చూసి చలించిపోయారు. గంటల వ్యవధిలోనే ఆ కుటుంబానికి రూ. రూ.8 లక్షల విలువైన ట్రాక్టర్, రొటావేటర్‌ను బహూకరించి రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నాడు. (గంటల వ్యవధిలోనే సోనూసూద్ సాయం) అసలు ఏం జరిగిందంటే.. మదనపల్లెకు చెందిన పౌరహక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు పట్టణంలో టిఫిన్ హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని స్వగ్రామం పీలేరు నియోజకవర్గం కేవీ పల్లె మండలం మహల్ రాజుపల్లె. కరోనా విపత్తు కారణంగా హోటల్ వ్యాపారం నిలిచిపోవడంతో స్వగ్రామానికి వెళ్లి వ్యవసాయం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వర్షాలు పుష్కలంగా కురవడంతో తమ పొలంలో దుక్కులు దున్నేందుకు ఎద్దులు లేకపోవడంపై తన బాధను కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. దీంతో ఇద్దరు కూతుళ్లూ తామే ఆ పనులు చేస్తామన్నారు. దీంతో కాడెద్దుల పాత్రలోకి మారిపోయారు. కుమార్తె సాయంతో పొలాన్ని దున్నారు. దీనిని కొందరు వీడియో తీసి సామాజిక, ప్రసార మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో విపరీతమైన స్పందన లభించింది. దీనిని చూసిన కృష్ణమూర్తి రైతు నాగేశ్వరరావు, కూతుళ్ల సహాయంపై సోనూసూద్‌కు ట్విటర్లో ట్యాగ్ చేశారు. రైతు నాగేశ్వరరావుకు ట్రాక్టర్ ఇస్తున్న సోనాలికా కంపెనీ ప్రతినిధులు స్పందించిన సోనూసూద్ దీంతో చలించిన సోనూసూద్ తానున్నానంటూ వారికి సాయం చేయడానికి ముందుకొచ్చారు. మొదట రేపు ఉదయానికల్లా ఆ కుటుంబానికి రెండు ఎద్దులు ఇవ్వబోతున్నట్లు ట్విటర్లో ప్రకటించారు. కాసేపటికే ఆయన మనసు మార్చుకున్నారు. వారికి కావాల్సింది ఎద్దులు కాదు...ట్రాక్టర్. అది సోమవారం సాయంత్రానికి వారి పొలంలో ఉంటుంది. ఇకపై ఆ అమ్మాయిలు ఇద్దరు బాగా చదువుకోవచ్చంటూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే ఆదివారం సాయంత్రం మదనపల్లె నుంచి సోనాలికా కంపెనీకి చెందిన సుమారు రూ.8 లక్షల విలువైన ట్రాక్టర్, రొటావేటర్‌ను ఆ కంపెనీ ప్రతినిధులు తీసుకొచ్చారు. సోనాలికా కంపెనీ ప్రతినిధి మహమ్మద్ ఫయాజ్ ట్రాక్టర్‌ను రైతు నాగేశ్వరరావుకు అందజేశారు. వైరల్ అయిన వీడియోపై సినీ నటులు సోనూసూద్ స్పందించి అండగా నిలవడంపై పేదరైతు నాగేశ్వరరావు ఉబ్బితబ్బిబ్బయ్యారు. తమ కష్టం సోనూసూద్‌ను కదిలించడం, తమ కుటుంబంపై ఔదార్యం కనపరచడంపై స్పందిస్తూ జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని, ఆయన పెద్దమనస్సుకు కుటుంబం మొత్తం పాదాభివందనం చేస్తున్నట్లు ప్రకటించారు. తమ కష్టాన్ని మాధ్యమాల్లో ప్రసారం చేసి ట్రాక్టర్ వచ్చేందుకు కారణమైన మీడియాకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై స్పందించారు. సోనూసూద్ స్పందన స్ఫూర్తిదాయకమని పేర్నొన్నారు. -
రైతు దంపతుల అదృశ్యం
వైఎస్ఆర్ జిల్లా ,ఓబులవారిపల్లె: గాదెల కొత్తపల్లె గ్రామానికి చెందిన రైతు డేగల మురళీ(38) తన భార్య డేగల పద్మ (28)లు గురువారం తెల్లవారుజాము నుంచి కనిపించకుండా పోవడంతో బంధువులు శుక్రవారం స్థానిక పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పులు చేసి వ్యవసాయం చేస్తూ ప్రతిసారి నష్టాలు రావడంతో డేగల మురళీ మనస్తాపానికి గురై తన భార్యతోకలిసి కనిపించకుండా పోయాడు. బుధవారం రాత్రి చాలా పొద్దుపోయాక పొలం వద్దకు వెళ్లి వస్తామని చెప్పి వెళ్లినవారు అక్కడే మోటర్ బైక్ సెల్ఫోన్లు వదిలి వెళ్లిపోయారు. వ్యవసాయంలో స్థోమతకు మించి అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి నష్టాలు రావడంతో అప్పులు ఎలా తీర్చాలన్న బెంగతో ఇంటి నుండి వెళ్లి పోయినట్లు బంధువులు చెబుతున్నారు. అలాగే పెళ్లి అయి పది సంవత్సరాలు అవుతున్నా పిల్లలు కలగలేదని వారు మనస్తాపం చెందినట్లు కూడా బంధువులు తెలిపారు. మురళీ చివరగా తన మామ శ్రీనివాసులుకు కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేశాడు. తన భార్య పద్మ చనిపోయిందని నేను కూడా చనిపోతున్నానని, తాను ఎడ్కడ ఉండేది తెలియదని చెప్పాడు. పోలీసులు ఫోన్ లోకేషన్ ట్రెస్ చేయగా మండంలోని వైకోట చూపించింది. బంధువులు చుట్టు పక్కల ఇల్లు, భూములు, సమీపంలోని గాదెల అడవి ప్రాంతంలో ఎక్కడ వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎస్ఐ డాక్టర్ నాయక్ కడప నుంచి డాక్ స్క్వాడ్‌ను తెప్పించి చుట్టు పక్కల ప్రదేశాలను వెతికించారు. కేసు నమోదు చేసి దంపతుల జాడ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నామని ఎస్ఐ తెలిపారు. -
పత్తి రైతు కుటుంబాన్ని విస్మరించిన ప్రభుత్వం
అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులు దుర్భర జీవితం గడుపుతున్నారు. కుటుంబ పెద్ద ఆత్మహత్య చేసుకోవడంతో పూట గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం జిల్లా రొద్దం మండల పరిధిలోని గోనిమేకులపల్లి గ్రామానికి చెందిన పత్తి రైతు శ్రీనివాసులు(40) అప్పుల బాధతో దాదాపు నాలుగేళ్ల క్రితం(2014 నవంబర్ 5న) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పత్తి పంటకు పిచికారీ చేయడానికి తీసుకువచ్చిన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీనివాసులుకు భార్య సరోజమ్మ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. శ్రీనివాసులు తనకున్న ఎకరం పొలంలో పత్తి సాగు చేసేవారు. పంట దిగుబడి ఆశించినంత రాకపోవడంతో అప్పులపాలయ్యారు. దీనితోపాటు కూతురు పెళ్లి చేయడానికి కొంత అప్పు చేశారు. తన భర్త తమకున్న ఎకరం పొలంలో పంట సాగుచేయడానికి, కూతురి పెళ్లి చేయడానికి రూ. 2 లక్షల దాకా అప్పు చేసినట్లు శ్రీనివాసులు భార్య సరోజమ్మ తెలిపారు. పంట పండకపోతే చేసిన అప్పులు ఎలా తీర్చాలని రోజూ అంటూ బాధపడుతూ ఉండేవారన్నారు. అప్పుల దిగులుతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయమూ అందలేదు. మృతుడి భార్య ప్రతిరోజూ కూలీకి వెళ్తూ తన పిల్లలను పోషించుకుంటూ చదివిస్తున్నారు. ప్రభుత్వం కరుణించి ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. – కె.ఎల్. నాగరాజు, సాక్షి, రొద్దం, అనంతపురం -
రివర్స గేర్ !
ఈ చిత్రం చూశారు కదా.. సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ట్రాక్టరుతో పంట పొలాలను దున్నేస్తున్నారు. ఆయన స్టీరింగ్ పట్టింది వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కాదు సుమా.. బంగారం పండే పచ్చని పంట పొలాల్లో కాంక్రీట్ జంగిల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా ఎక్కడైనా వ్యవసాయ మంత్రి ఖరీఫ్, రబీ పనుల్లో రైతులకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటారు. ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు, పవర్స్ప్రేయర్ల వినియోగంతో లాభాలు, యాంత్రీకరణకు నిధుల కేటాయింపు, సబ్సిడీ వంటి వివరాలు వెల్లడి స్తారు. దేశంలో ఏ వ్యవసాయ మంత్రయినా ఆ తరహా చిత్రాల్లో కనిపించిన వారే. అయితే ఇక్కడ మాత్రం వ్యవహారం అందుకు పూర్తి భిన్నం. రాజధాని నిర్మాణంలో తన బాధ్యతలకు భిన్నంగా ప్రత్తిపాటి రివర్స్ గేర్ వేశారు. ఇనుప నాగళ్లతో పంట పొలాల్ని దున్నేశారు. సరిహద్దు గట్లను సైతం తొలగించేశారు. దేశంలో మరే వ్యవసాయ మంత్రికి ఎదురుకాని సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఈ బాధ్యతను నిర్వర్తించేందుకు వెనుకంజ వేసినా తప్పనిసరి పరిస్థితుల్లో స్టీరింగ్ పట్టాల్సి వచ్చిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. -సాక్షి ప్రతినిధి, గుంటూరు -
అంతరిక్ష ప్రయోగాల్లో అసామాన్యుడు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/సూళ్లూరుపేట : ఇస్రో సాధించిన విజయాల్లో ఎంవైఎస్ ప్రసాద్ పాత్ర కీలకం. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు దాటుకుంటూ ముందుకు సాగుతున్నారు. అందుకే భారత ప్రభుత్వం ఆయన్ను అత్యున్నత పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. తాజాగా విక్రమ్‌సారాభాయ్ స్మారక అవార్డు అందుకోబోతున్న ఎంవైఎస్ ప్రసాద్ గురించి ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేక కథనం. సాధారణ రైతు కుటుంబం నుంచి... భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో ఉన్న అతికొద్ది మంది శాస్త్రవేత్తల్లో తెలుగుతేజం పద్మశ్రీ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ ఒకరుగా చెప్పుకోవచ్చు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన ఎం.రామసూర్యనారాయణమూర్తి, భాస్కరం దంపతుల ఐదో సంతానం ప్రసాద్. 1953 మే 4న ఆయన జన్మించారు. మొగల్తూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేశారు. ఏలూరు సీఆర్‌రెడ్డి కళాశాలలో పీయూసీ, కాకినాడ ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. కిరోసిన్ బుడ్డీ వెలుగుల్లో చదువుకున్న అతి సామాన్యుడు అంతరిక్ష పరిశోధనల్లో ఖ్యాతిని పొందారు. తెలుగు మీడియంలో చదివి అంతరిక్ష ప్రయోగాలు చేసే స్థాయికి ఎదగవచ్చని రుజువు చేశారు. విదేశీ అవకాశాలను వదులుకుని దేశానికి సేవ చేయాలనే తపనతో 1975 మేలో ఇస్రో చేరిన ఎంవైఎస్ ప్రసాద్ కేరళ, ఫ్రాన్స్ దేశంలో ఇండియన్ ఎంబసీ స్పేస్ కౌన్సిలర్‌గా, పీఎస్ఎల్వీ ప్రాజెక్ట్ డిప్యూటీ డెరైక్టర్‌గా, కర్ణాటకలోని హసన్‌లో ఉన్న మిషన్ కంట్రోల్ ఫెసిలిటీ సెంటర్ అసోసియేట్ డెరైక్టర్‌గా ఉన్నారు. అదే సెంటర్‌కు డెరైక్టర్‌గా కూడా పనిచేశారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని డెక్కు అనే సెంటర్‌కు డెరైక్టర్‌గా, స్పేస్ అప్లికేషన్ సెంటర్ డెరైక్టర్‌గా కొనసాగారు. ప్రస్తుతం షార్ డెరైక్టర్‌గా కొనసాగుతున్నారు. భారత అంతరిక్ష సంస్థలో 39 ఏళ్లుగా సుదీర్ఘమైన తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారు. షార్ చరిత్రలో ఒక తెలుగు వ్యక్తి డెరైక్టర్‌గా పనిచేసిన ఘనత డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్‌కే దక్కుతుంది. షార్‌లో ఎస్ఎల్వీ డీ3 ప్రయోగ సమయంలో అంతరిక్ష పితామహుడు, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్‌కలాం వద్ద పనిచేసిన ఘనత కూడా ఆయనకే దక్కింది. ఇస్రోలో అన్ని విభాగాల్లో పనిచేస్తూ సాంకేతిక పరంగా ప్రతిభ చూపుతూ.. అంచెలంచెలుగా ఎదుగుతున్నా ఒదిగి పనిచేస్తూ తెలుగుజాతికి వన్నెతెస్తున్నారు. లీకేజీని గుర్తించకపోతే పెను ప్రమాదమే ప్రయోగవేదిక చుట్టూ వివిధ రకాల కోణా ల్లో 25 కెమెరాలు పనిచేస్తుంటాయి. మిషన్కంట్రోల్రూంలో కూర్చుని ప్రయోగాన్ని చేసేందు కు శాస్త్రవేత్తలంతా సిద్ధంగా ఉన్నారు. కౌంట్‌డౌన్ ముగిసేందుకు రెండు గంటల ముందు కెమెరాల్లో లీకేజీని ప్రసాద్ గుర్తించి ఇతర శాస్త్రవేత్తలకు వివరించారు. రెండో దశలో ద్రవ ఇంధనం తో పాటు నీళ్లు కూడా ఉం టాయి. లీకైంది నీళ్లా..! లేక ద్రవ ఇంధనమా..? అనేదాన్ని గుర్తించగలిగారు. చివరకు ద్రవ ఇంధనమే అని నిర్థారించుకుని ఇస్రో చైర్మన్‌కు చెప్పి ప్రయోగాన్ని ఆపేశారు. ఆ సమయంలో లీకేజీని గుర్తించకపోతే పెను ప్రమాదం జరగడమే కాకుండా శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి ఊహించని ప్రమాదం వాటిల్లేది. వెంటనే సేప్టీ టీంకు సమాచారం అందించి ప్రయోగవేదిక వద్ద ఇంధనం వేడిని తగ్గించడానికి అక్కడే ఉన్న నీళ్లట్యాంకర్ సాయంతో కొన్ని వేల గ్యాలన్లు పంపింగ్ చేసి ప్రయోగవేదికను, లాంచ్ వెహికల్‌ను, ఉపగ్రహాన్ని కాపాడగలిగారు. లేదంటే ఊహించనటువంటి ప్రమాదం జరిగి ఇస్రోకు సుమారు వందలాది కోట్ల రూపాయల నష్టం వాటిల్లడమే కాకుండా మరో అయిదారేళ్లు ప్రయోగాలే లేకుండా ఆగిపోయేవి. రూ.200 కోట్లు విలువ చేసే జీఎస్ఎల్వీ రాకెట్ రూ. 400 కోట్లు విలువ చేసే య్రోగవేదికను కాపాడటంతో పాటు క్రయోజనిక్ దశను కూడా అత్యంత జాగ్రత్తగా కాపాడిన వ్యక్తి ఎంవైఎస్ ప్రసాద్. ఇందులో ఆయన టీం ప్రత్యేక పాత్ర పోషించారు. రాకెట్లో అప్పటికే 199.5 టన్నుల ద్రవ ఇంధనం, 138.5 టన్నుల ఘన ఇంధనం, 12.5 టన్నుల క్రయోజనిక్ ఇంధనం ఉంది. ఘన ఇంధనం కలిగిన మొదటి దశను, మూడో దశలోని క్రయోజనిక్ దశను జాగ్రత్తగా విప్పదీసి స్టోర్ చేశా రు. మొదటి దశలోని నాలుగు స్ట్రాపాన్ బూస్టర్లల్లో నింపిన 160 టన్నుల ద్రవ ఇంధనం, రెండోదశలో 39.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని మళ్లీ వెనక్కి తీసి సేకరించేందుకు 500 మంది టెక్నికల్ టీం సుమారు 24 గంటలు కష్టపడి ప్రమాదాన్ని తప్పించి పెద్ద మొత్తంలో ఆదా చేశారు. ఈ ఇంధనం ఏ మాత్రం కొద్దిగా కిందపడినా పెద్ద ప్రమాదం సంభవించేది. వీటిన్నింటిని అత్యంత జాగ్రత్తగా బయటకు తీసి మళ్లీ 2014 జనవరి 5న ప్రయోగించి విజయాన్ని సాధించడంలో ప్రసాద్, ఆయన టీం కృషి ఉందని పలువురు శాస్త్రవేత్తలు ప్రశంసించటం విశేషం. ఇది ఇస్రోకే కాకుండా తన ఇన్నేళ్లు అంతరిక్ష ప్రయాణంలో ఛాలెంజ్‌గా నిలిచిందని.. తన జీవితంలో మరిచిపోలేని సంఘటనగా ఆయన చెప్పుకుంటుం టారు. చంద్రయాన్-1 ప్రయోగంలో చిన్నపాటి లీకేజీ వచ్చినపుడు కూడా భయపడినా... వెంటనే దాన్ని అరెస్ట్ చేసి నిర్ణీత సమయానికే ప్రయోగించి మంగళ్యాన్, క్రయోజనిక్ దశ సక్సెస్‌లు తన జీవితంలో మరువలేనివని గర్వంగా చెబుతుంటారు. ఇస్రో విజయాల్లో ప్రసాద్‌ది కీలక పాత్ర ఇస్రో సాధించిన విజయాల్లో ఎంవైఎస్ ప్రసాద్ కీలకపాత్ర పోషించారు. 2008లో షార్ అసోసియేట్ డెరైక్టర్‌గా ప్రవేశించిన తర్వాత17 పీఎస్ఎల్వీ రాకెట్లు, మూడు జీఎస్ఎల్వీ రాకెట్లు విజయం సాధించేందుకు ఆయన పాత్ర ప్రత్యేకం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఏర్పడిన తర్వాత శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి 45 ప్రయోగాలు చేయగా ఎనిమిది మాత్రమే అపజయం పాలయ్యాయి. మిగిలిన 37 ప్రయోగాలను విజయవంతం కాగా ఇందులో ఎంవైఎస్ ప్రసాద్ షార్ అసోసియేట్ డెరైక్టర్, డెరైక్టర్‌గా 20 ప్రయోగాలు నిర్వహించారు. ఆగస్టు 19, 2013 ప్రయోగించాల్సిన జీఎస్ఎల్వీ డీ5 రాకెట్ ప్రయోగానికి గంటముందు రెండోదశలో లీకేజీని గుర్తించి ప్రయోగం వాయిదా వేశారు. రాకెట్‌లోని ఇంధనాన్ని, ఉపగ్రహాన్ని రికవరీ చేసే విషయంలో ప్రసాద్ ప్రత్యేకమైన పాత్ర పోషించి సుమారు రూ.800 కోట్లు ఇస్రోకు ఆదా చేసిన ఘనత ప్రసాద్‌కే దక్కింది. అనతికాలంలోనే జనవరి 5న ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించడంలో ఆయన కృషి కీలకం. ఈ ప్రయోగంలో మొట్టమొదటిసారిగా పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించి క్రయోజనిక్ దశతో విజయాన్ని షార్ సొంతం చేసినందుకు షార్ డెరైక్టర్ ప్రసాద్ ఎనలేని ప్రశంసలు అందుకున్నారు. ప్రసాద్‌ను వరించిన అవార్డులు 2001లో కన్నడ రాజ్యోత్సవ అవార్డు, 2007, 2009లో మూడు ఇస్రో ఎక్స్లెంట్ అవార్డులు అందుకున్నారు. 2011లో టీం ఎక్స్లెంట్ అవార్డు, 2013లో తమిళనాడు అరుణై ఇంజినీరింగ్ కళాశాల వారు లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు. ఎంవైఎస్ ప్రసాద్ షార్ డెరైక్టర్‌గా బాధ్యతలు చేపట్టాక నెల్లూరులో ప్రొఫెసర్ నాయుడమ్మ అవార్డును అందుకున్నారు. 2013లో తాను చదువుకున్న ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం, అధ్యాపకుల నుంచి సన్మానాన్ని అందుకున్నారు. 2014లో జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ నుంచి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. తాజాగా విక్రమ్‌సారాభాయ్ స్మారక అవార్డును అందుకోబోతున్న వ్యక్తి ఎంవైఎస్ ప్రసాద్. ప్రస్తుతం ఆయన మానవ సహిత ప్రయోగాల వైపు దృష్టి సారించారు. అందులోనూ విజయం సాధించాలని పలువురు శాస్త్రవేత్తలు, భారతీయులు కోరుతున్నారు.