ఈ చిత్రం చూశారు కదా.. సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ట్రాక్టరుతో పంట పొలాలను దున్నేస్తున్నారు. ఆయన స్టీరింగ్ పట్టింది వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కాదు సుమా.. బంగారం పండే పచ్చని పంట పొలాల్లో కాంక్రీట్ జంగిల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా ఎక్కడైనా వ్యవసాయ మంత్రి ఖరీఫ్, రబీ పనుల్లో రైతులకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటారు. ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు, పవర్‌స్ప్రేయర్ల వినియోగంతో లాభాలు, యాంత్రీకరణకు నిధుల కేటాయింపు, సబ్సిడీ వంటి వివరాలు వెల్లడి స్తారు.
దేశంలో ఏ వ్యవసాయ మంత్రయినా ఆ తరహా చిత్రాల్లో కనిపించిన వారే. అయితే ఇక్కడ మాత్రం వ్యవహారం అందుకు పూర్తి భిన్నం. రాజధాని నిర్మాణంలో తన బాధ్యతలకు భిన్నంగా ప్రత్తిపాటి రివర్స్ గేర్ వేశారు. ఇనుప నాగళ్లతో పంట పొలాల్ని దున్నేశారు. సరిహద్దు గట్లను సైతం తొలగించేశారు. దేశంలో మరే వ్యవసాయ మంత్రికి ఎదురుకాని సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఈ బాధ్యతను నిర్వర్తించేందుకు వెనుకంజ వేసినా తప్పనిసరి పరిస్థితుల్లో స్టీరింగ్ పట్టాల్సి వచ్చిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
-సాక్షి ప్రతినిధి, గుంటూరు
రివర్‌స గేర్ !
Published Sun, Apr 19 2015 2:37 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement