పోలీసుల జోక్యంపై దాఖలైన పిటిషన్లు కొట్టివేత
హైదరాబాద్: రాజధానిలో హుక్కా కేంద్రాలకు ఉమ్మడి హైకోర్టులో చుక్కె దురైంది. రెస్టారెంట్లు, కాఫీషాపులు హæుక్కా సెంటర్ల విషయంలో పోలీసులు జోక్యం చేసుకుంటున్నారంటూ పలువురు యజమానులు దాఖలు చేసిన వ్యాజ్యా లను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో శుక్రవారం తీర్పు వెలువరించారు. తమ వ్యాపార కార్యక లాపాల్లో పోలీసుల జోక్యాన్ని నిలువరిం చాలంటూ గతేడాది పిటిషన్లు దాఖలు చేశారు. తమకు వ్యాపార నిర్వహణ నిమిత్తం జీహెచ్‌ఎంసీ ట్రేడ్ లైసెన్సులు జారీ చేసినందున వ్యాపారాల్లో పోలీసు లు జోక్యానికి వీల్లేదని వాదించారు.
వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. విచారణకు స్వీకరించదగ్గ నేరం జరుగు తుంటే దాన్ని నియంత్రించే అధికారం పోలీసులకు ఉందని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ రెస్టారెంట్ల నిర్వహణకే అను మతిచ్చింది తప్ప హుక్కా సెంటర్ల నిర్వహ ణకు కాదన్నారు. రాత్రి 11 గంటలు దాటాక హుక్కా కేంద్రాలు తెరిచి ఉంచరా దని, తమవి హుక్కా కేంద్రాలని సూచించే బోర్డులు ఏర్పాటు చేయాలని, కేంద్రాల్లోకి 18 ఏళ్లలోపు వారిని అనుమతించరా దంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని యజమానులను న్యాయమూర్తి ఆదేశించారు.
హుక్కా కేంద్రాలకు హైకోర్టులో చుక్కెదురు
Published Sat, Jan 28 2017 1:44 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
Advertisement
Advertisement