ceased
-
ఢిల్లీలో 13 ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు సీజ్
ఢిల్లీ: ఢిల్లీలోని ఓ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి వర్షం నీరు పోటెత్తిన ఘటనలో ముగ్గురు అభ్యర్థులు మృతిచెందారు. ఈ ఘటన నేపథ్యంలో ఓల్డ్ రాజేంద్ర నగర్ ప్రాంతంలో నిబంధనలు ఉల్లంఘించి బేస్మెంట్ ఏరియాను ఉపయోగిస్తున్న 13 కోచింగ్ సెంటర్లపై మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(ఎంసీబీ) చర్యలు చేపట్టింది. ఈ మేరకు 13 కోచింగ్ సెంటర్లను అధికారులు సీజ్ చేశారు.‘‘ఆదివారం రాజేంద్ర నగర్ ప్రాంతంలోని పలు ఐఏఎస్ కోచింగ్ సెంటర్లలో ఎంసీడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. బేస్మెంట్ ఏరియాను కమర్షియల్ అవసరాలకు ఉపయోగిస్తున్న కోచింగ్ సెంటర్లను సీజ్‌చేశాం. శనివారం జరిగిన ప్రమాదం నేపథ్యంలో తనిఖీలు చేపట్టాం. రాజేంద్రనగర్ ప్రాంతంలో నిబంధనలు ఉల్లంఘించిన కోచింగ్ సెంటర్లను సీజ్ చేస్తాం. అదేవిధంగా ఢిల్లీ మొత్తం ఉన్న కోచింగ్ సెంటర్లు, పలు భవనాల్లో తనిఖీలు చేస్తాం’’ అని ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబేరాయ్ ‘ఎక్స్ ’లో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన కోచింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రావుస్ ఐఎఎస్ స్టడీ సెంటర్లో జరిగిన సంఘటనకు ఎంసీడీ అధికారులు ఎవరైనా బాధ్యులు ఉన్నారా? అనేదానిపై వెంటనే విచారణ జరుగుతోందని అన్నారు. ఈ ఘటన వెనుకు ఎవరైనా అధికారులు దోషులగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.సీజ్ చేసిన 13 ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు ఇవే..ఐఏఎస్ గురుకులంచాహల్ అకాడమీప్లూటస్ అకాడమీసాయి వర్తకంఐఏఎస్ సేతుటాపర్స్ అకాడమీదైనిక్ సంవాద్సివిల్ రోజువారీ ఐఏఎస్కెరీర్ పవర్99 నోట్లువిద్యా గురుగైడెన్స్ ఐఏఎస్ఐఏఎస్లకు ఈసీచదవండి: సివిల్స్ కల జల సమాధి -
బిస్లెరీతో చర్చలకు ‘టాటా’: అసలేమైంది?
న్యూఢిల్లీ: ప్యాకేజ్డ్ వాటర్ బిజినెస్ కొనుగోలుకి బిస్లెరీ ఇంటర్నేషనల్‌తో చేపట్టిన చర్చలకు చెక్ పడినట్లు ఎఫ్ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్(టీసీపీఎల్) తాజాగా వెల్లడించింది. ఇటీవల కొద్ది రోజులుగా బిస్లెరీ బ్రాండును టాటా గ్రూప్ కొనుగోలు చేయనున్నట్లు అంచనాలు పెరిగిన నేపథ్యంలో చర్చలు నిలిపివేసినట్లు నియంత్రణ సంస్థలకు టాటా కన్జూమర్ తెలియజేసింది. ప్యాకేజ్డ్ వాటర్ బిజినెస్ కొనుగోలుకి బిస్లెరీ ఇంటర్నేషనల్‌తో ఎలాంటి తప్పనిసరి ఒప్పందాలు కుదుర్చుకోలేదని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: March18th పసిడి ప్రియులకు షాక్: ఆల్‌టైం రికార్డు, ఇక కొన్నట్టే..?! ఇందుకు ఎలాంటి కట్టుబాట్లనూ ఏర్పాటు చేసుకోలేదని తెలియజేసింది. అయితే వ్యాపార విస్తరణ, వృద్ధి అవకాశాలకున్న వ్యూహాత్మక అంశాలపై దృష్టి కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ఇకపైనా బిస్లెరీ ఇంటర్నేషనల్ సహా వివిధ సంస్థలతో చర్చలు నిర్వహించే వీలున్నట్లు వెల్లడించింది. కాగా.. బిస్లెరీ ఇంటర్నేషనల్ విక్రయానికి టీసీపీఎల్తోపాటు పలు కొనుగోలుదారులతో చర్చలు నిర్వహిస్తున్నట్లు ప్రమోటర్, వెనుకటితరం పారిశ్రామిక వేత్త రమేష్ చౌహాన్ గతేడాది పేర్కొన్నారు. మరోవైపు మరిన్ని మార్కెట్లలో విస్తరించేందుకు అనువుగా టీసీపీఎల్ పలు కంపెనీలను కొనుగోలు చేస్తూ వస్తోంది. టీసీపీఎల్ కు ఇప్పటికే హిమాలయన్ బ్రాండుతో బాటిల్డ్ వాటర్ విభాగంలో కార్యకలాపాలు ఉన్నాయి. -
12,580 ఎన్జీవోల లైసెన్సులు రద్దు! ఇక నో ఫారిన్ ఫండ్స్..
ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సీఆర్ఏ) 2010 కింద ఎన్జీవోలకు విదేశీ నిధులు చేరాలంటే లైసెన్సులను తప్పనిసరిగా కలిగి ఉండాలి. కాగా దాదాపు 12,580 ఎన్జీవో (నాన్ ఫ్రోఫిట్ ఆర్గనైజేషన్లు)ల లైసెన్సుల తుది గడువు నిన్నటితో ముగియడంతో వారి లైసెన్సులన్నీ శనివారం సీజ్ చేసినట్లు కేంద్ర హోం శాఖ తాజాగా విడుదల చేసిన జాబితాలో తెల్పింది. ఎఫ్సిఆర్ఎ కింద క్రితం రోజు వరకు యాక్టివ్‌గా ఉన్న 22,762 ఎన్జీఓలు ప్రస్తుతం 16,829కి తగ్గాయి. దాదాపు 5,933 ఎన్జీఓల రిజిస్ట్రేషన్లు రద్దు చేయబడ్డాయి (రెన్యూవల్ చేసుకోకపోవడంతో). మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇమాన్యుయేల్ హాస్పిటల్ అసోసియేషన్, ట్యూబర్క్యులోసిస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఆశాకిరణ్ రూరల్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సొసైటీ, చైతన్య రూరల్ డెవలప్మెంట్ సొసైటీ, ఎఫ్సిఆర్ఎ లైసెన్స్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తాజా జాబితాలో ఉంది. హమ్‌దర్డ్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ సొసైటీ, డీఏవీ కాలేజ్ ట్రస్ట్ అండ్ మేనేజ్మెంట్ సొసైటీ, ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్, జేఎన్‌యూలోని న్యూక్లియర్ సైన్స్ సెంటర్, ఇండియా హాబిటాట్ సెంటర్, లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్ సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటికే 6587 ఎన్జీఓలు జాబితాలో ఉన్నాయి.లైసెన్స్‌ల రెన్యువల్ కోసం గడువుకాలం పొడిగించినప్పటికీ ఆయా సంస్థలు అప్డేట్ చేసుకోలేదు. కాగా కొన్ని ఎన్జీఓల ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేన్‌కు తుది గడువు 2021 సెప్టెంబర్ 29,30 తేదీల్లో ముగియనుండగా, ఆ సమయాన్ని మార్చి 2022 వరకు హోం శాఖ పొడిగించింది. చదవండి: Online Frauds: అయ్యో పాపం! రూ. 1 లక్ష విలువైన ఐ ఫోన్ ఆర్డర్ చేస్తే డెలివరీ ఫ్యాక్‌లో.. -
‘బెల్టు’ స్కూళ్లు..!
బెల్టు షాపులు అంటూ మద్యం అమ్మకాలకు సంబంధించి తరచూ వింటూ ఉంటాం.. అంటే అనుమతులు లేకుండా చిన్న బడ్డీ కొట్లలో అక్రమంగా మద్యం విక్రయించడం. ఈ జాడ్యం ఇప్పుడు విద్యావ్యవస్థకూ పాకింది. ఒక పాఠశాల నిర్వహించేందుకు అనుమతి తీసుకుంటారు.. అదే అనుమతితో రెండు మూడు సబ్ బ్రాంచ్‌లు పెట్టేస్తారు. వీటికి అనుమతులుండవు.. అధికారులు ప్రశ్నిస్తే ట్యూషన్ సెంటర్లంటూ నమ్మిస్తారు. దీంతో జిల్లాలో ‘బెల్టు’ స్కూళ్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. సాక్షి, అమరావతి బ్యూరో: జిల్లాలో బెల్టు షాప్‌ల మాదిరి బెల్టు స్కూళ్లు యథేచ్ఛగా పనిచేస్తున్నాయి. గుర్తింపు పొందితే అధికారుల తనిఖీలు, ఫీజులు, పద్ధతులు పాటించాల్సి వస్తుందని చాలా స్కూళ్లు అనుమతి జోలికి పోవడం లేదు. కార్పొరేట్, పేరు మోసిన ప్రైవేట్ సంస్థలు ఒక్క స్కూల్‌కు అనుమతి తీసుకొని, వాటితో రెండు మూడు బ్రాంచ్‌లను నడుపుతూ క్యాష్ చేసుకుంటున్నాయి. స్థానిక అధికారులు ప్రశ్నిస్తే ట్యూషన్లు నడుపుతున్నామని చెప్పి తప్పించుకుంటున్నారు. గుర్తింపు లేకపోతే సరి..! స్కూల్ పెట్టాలంటే స్థానిక సంస్థల అనుమతితో పాటు ట్రాఫిక్ పోలీసు, అగ్నిమాపక శాఖ, భవననిర్మాణ శాఖ, విద్యాశాఖ, పట్టణ పారిశుద్ధ్యశాఖల అనుమతి పొందాల్సి ఉంటుంది. వీటితో పాటు వాహనాలు ఉంటే వాటికి రవాణా శాఖ అనుమతి కూడా పొందాలి. విద్యార్థి ఒకొక్కరి పేరిట గుర్తింపు ఫీజులను చెల్లించాలి. ఇంత పెద్ద ఎత్తున ఫీజులు చెల్లించి తడిసిమోపెడు ఖర్చు చేసే బదులు ఎలాంటి గుర్తింపు లేకుండా పాఠశాలలను నడపడం, అక్కడ చదివే విద్యార్థులను ఇతర స్కూళ్ల నుంచి పరీక్షకు అనుమతించడం చాలా తేలికైన అంశంగా మారింది. ప్రతి పాఠశాల నుంచి ఎగ్జంప్షన్ ఫీజు చెల్లించి ప్రైవేటు స్టడీ విద్యార్థులు, రెగ్యులర్ విద్యార్థులు హాజరుకావచ్చు. కొన్ని స్కూళ్లు తమ స్కూళ్లలో చదవకపోయినా ఇతర స్కూళ్ల వారిని కూడా తమ విద్యార్థులుగానే రికార్డుల్లో చూపిస్తున్నాయి. వాటిని తనిఖీ చేసే యంత్రాంగం లేకపోవడంతో ఆడిందే ఆటగా వారు రాసిందే రికార్డుగా మారిపోయింది. జిల్లాలో దాదాపు 80 స్కూళ్లు... కృష్ణా జిల్లా పరిధిలో అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న పాఠశాలలు దాదాపు 80 వరకు ఉన్నాయి. ఇందులో ఒక్క విజయవాడ నగరంలోనే 60 స్కూళ్ల వరకు గుర్తింపు లేని పాఠశాలలు ఉండగా, ఇతర ప్రాంతాల్లో మరో 20 దాకా ఉన్నాయని సమాచారం. వీటిలో అగ్రభాగం నారాయణ, శ్రీచైతన్య, తదితర కార్పొరేట్ పాఠశాలలే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. విద్యా వ్యవస్థ ప్రక్షాళన దిశగా.. ఇది వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండటం, భారీగా ముడుపులు అందజేయటం వంటి కారణాల వల్ల వీటిపై దాడులు జరగకుండా పోయాయి. కొత్త ప్రభుత్వం విద్యా సంస్కరణలపై ప్రత్యేక దృష్టి చూపటంతో వీటిపై దాడులు మొదలయ్యాయి. బుధవారం విజయవాడలోని సత్యనారాయణపురంలోని అనుమతి లేని నారాయణ స్కూల్‌పై విద్యాశాఖాధికారులు దాడి చేసి లక్ష రూపాయలు జరిమానా, తాత్కాలికంగా సీజ్ చేశారు. విద్యాసంవత్సరం ఆరంభంలో కేవలం నోటీసులు, జరిమానాలతో సరిపెడుతున్నారు తప్ప కఠిన చర్యలు తీసుకోవటం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. -
20 టన్నుల, రేషన్, పట్టివేత
దుర్గి : రేషన్ మాఫియా ఆగడాలకు అవధులు లేకుండా పోయాయి. విజిలెన్స్, పోలీసు అధికారులు పలుమార్లు అక్రమంగా రవాణా చేస్తున్న బియ్యం వాహనాలను పట్టుకున్నా అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తాజాగా శుక్రవారం తెల్లవారుజామున విజిలెన్స్ అధికారులు, పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో భారీగా బియ్యాన్ని పట్టుకున్నారు. మండలంలోని అడిగొప్పల, దుర్గి, మాచర్ల పరిసర ప్రాంతాల నుంచి మహిళల ద్వారా రేషన్ మాఫియా ఇంటింటికి తిరిగి సేకరించిన రేషన్ బియ్యాన్ని మినీట్రక్కులతో తరలించి టర్బో లారీలలో నింపి వినుకొండకు తరలించి అమ్మి బియ్యాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. రేషన్ అక్రమ బియ్యాన్ని అరికట్టాలని ప్రజాప్రతినిధులు మీటింగ్‌లలో చెప్పటం తప్పా చేసిందేమీ లేదు. శుక్రవారం లారీలను అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ డిఎస్పీ వీవీబీ రమణకుమార్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలోని గ్రామాలలో సేకరించిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారం అందిందన్నారు. దుర్గి పోలీసుల సహకారంతో అడిగొప్పల కుడికాలువ వద్ద టర్బో లారీ, మినిట్రక్కులలో ఉన్న 300 బస్తాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విజిలెన్స్ అధికారులు టి.వెంకటేశ్వర్లు, ఎస్సై ఎన్.శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు, కానిస్టేబుల్స్ నాంచారయ్య, భూపతి, శివకృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. తహశీల్దార్ ఏసుబాబు, అడిగొప్పల వీఆర్వో యలమంద, ఎస్సై సుబ్బానాయుడులతో పంచనామా నిర్వహించి మాచర్లకు తరలిస్తామని తెలిపారు. లారీ డ్రైవర్లు వడితె రాజు, దువ్వూరి విశ్వరూపాచారీలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దుర్గి పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఎవరికైనా రేషన్ అక్రమ తరలింపు గురించి సమాచారం తెలిస్తే 8008203289, 8008203288లకు సమాచారం అందించాలన్నారు.