కొనసాగుతున్న ఎన్‌జీఓల దీక్షలు
విధులు బహిష్కరించిన ప్రభుత్వ ఉద్యోగులు
జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు
సాక్షి, నెల్లూరు: జిల్లాలో సమైక్య ఉద్యమం హోరెత్తుతోంది. ఐదో రోజైన సోమవారం ఎన్‌జీఓలు, సమైక్యవాదులు ధర్నాలు, మానవహారాలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఎన్‌జీఓల దీక్షలు కొనసాగుతున్నాయి. ఎన్‌జీఓల ఆధ్వర్యంలో నెల్లూరులో ఎన్‌జీఓ హోం నుంచి ర్యాలీగా బయల్దేరి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూసి వేయించారు. టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో నగరంలోని వీఆర్‌సీ సెంటర్లో తెలంగాణ బిల్లు ప్రతులను దహనం చేశారు. అనంతరం నిరసన ప్రదర్శన నిర్వహించారు.
సమైక్యాంద్ర సాధనే అందరి ధ్యేయమని గూడూరులో ఎన్జీఓల సం ఘం నాయకుడు మస్తానయ్య అన్నారు. పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కావలి తాలూకా ఎన్‌జీఓ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని కేంద్రప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించారు. సమైక్యాంధ్ర కోసం కావలి కోర్టుకు చెందిన న్యాయవాదులు విధులను బహిష్కరించారు.
సమైక్య హోరు
Published Tue, Feb 11 2014 5:56 AM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM
Advertisement