తీస్తా సెతల్వాద్ ఎన్జీవోల రిజిస్ట్రేషన్ రద్దు! | Govt plans to cancel FCRA registration of Teesta Setalvad's NGOs | Sakshi
Sakshi News home page

తీస్తా సెతల్వాద్ ఎన్జీవోల రిజిస్ట్రేషన్ రద్దు!

Published Tue, Jun 30 2015 11:52 PM | Last Updated on Sun, Apr 7 2019 4:37 PM

తీస్తా సెతల్వాద్ ఎన్జీవోల రిజిస్ట్రేషన్ రద్దు! - Sakshi

తీస్తా సెతల్వాద్ ఎన్జీవోల రిజిస్ట్రేషన్ రద్దు!

న్యూఢిల్లీ: విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని(ఎఫ్‌సీఆర్‌ఏ) ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, ఆమె భర్త జావేద్ ఆనంద్‌ల నేతృత్వంలోని రెండు ఎన్జీవోల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ‘సబ్‌రంగ్ ట్రస్ట్, సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్(సీజేపీ) రికార్డులు తనిఖీ చేసి నెల కింద నోటీసులు ఇచ్చాం. 15 రోజుల్లోగా సమాధానాలివ్వాలని గడువిచ్చాం. నెల దాటినా స్పందన లేదు. ఆ రెండు సంస్థల ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడం మినహా మాకు మరో మార్గం లేదు’ అని హోం శాఖ అధికారి ఒకరు చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement