ఫిబ్రవరి 19న ఎన్జీఓ రాష్ట్ర సంఘానికి ఎన్నికలు
Published Tue, Jan 24 2017 9:48 PM | Last Updated on Mon, Oct 1 2018 5:24 PM
తాడితోట (రాజమహేంద్రవరం) :
ఏపీ ఎన్జీఓ రాష్ట్ర సంఘానికి ఫిబ్రవరి 19న ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు బూరిగ అశీర్వాదం తెలిపారు. స్థానిక ఎన్జీఓ హోమ్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల అధికారి కె.దాలినాయుడు ఎన్నికల షెడ్యూల్డ్‌ను విడుదల చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనిమిది వందల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుని ఇరవై మంది రాష్ట్ర ఆఫీసు బేరర్లను ఎన్నుకుంటారని చెప్పారు. జిల్లా నుంచి 68 మంది స్టేట్ కౌన్సిలర్లు, జిల్లా కార్యనిర్వాహక సభ్యులు, 20 యూనిట్లు అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కౌన్సిలర్లు ఓటు వేస్తారన్నారు. విజయవాడ గాంధీనగర్‌లోని ఎన్జీఓ అసోసియేష¯ŒS భవ¯ŒSలో ఈ ఎన్నికలు నిర్వహిస్తారన్నారు. ప్రస్తుత సంఘ అధ్యక్షుడు పర్చూరి అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి ఎ¯ŒS.చంద్రశేఖర్‌రెడ్డి పానెల్‌కు మద్దతు ఇవ్వాలని జిల్లా కార్యవర్గ సమావేశంలో తీర్మానించినట్టు చెప్పారు. జిల్లా నుంచి పసుపులేటి శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నామినేష¯ŒS వేస్తారన్నారు. జిల్లా మాజీ అధ్యక్షుడు ఆచంట రామరాయుడు, ఉపాధ్యక్షులు పి. రాజబాబు, నేతలు పసుపులేటి శ్రీనివాస్, రాజమహేంద్రవరం యూనిట్ అధ్యక్షుడు జి.హరిబాబు, ధవళేశ్వరం యూనిట్ అధ్యక్షుడు బి.శ్రీనివాస్, పి.నాగేశ్వరరావు, వైవీ నారాయణ, జి.వంశీ కళ్యాణ్, క్రిష్టాఫర్, ప్రవీణ్ కుమార్, పీవై శేషుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement