సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందిని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. దేశంలో ఇటు వంటి వ్యవస్థ ఎక్కడ లేదని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా సచివాలయ వ్యవస్థను అభినందించారని ఆయన గుర్తుచేశారు. మంగళవారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లడుతూ.. త్వరలోనే ఉద్యోగులు అందరూ అమరావతి నుంచి వైజాగ్ వస్తున్నారని, వారంతా వైజాగ్‌ను పరిపాలన రాజధానిగా స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో నిలిపివేసిన జీతాలను ఈ నెల నుంచి ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారన్నారు. ('దొడ్డి దారిన పదవి పొందిన దద్దమ్మవి నువ్వు')
మూడు డీఏలు ఇవ్వడంపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎన్నికల కమిషన్ పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. కరోనా పేరు చెప్తేనే అందరూ భయపడే పరిస్థితి ఉన్న సందర్భంలో ఎన్నికలు కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టలేమని.. ఎన్నికల నిర్వహణలో ఉద్యోగుల ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన నిలదీశారు. కరోనా తగ్గిన తరువాత ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. (దేవినేని ఉమకు షాకిచ్చిన జక్కంపూడి గ్రామస్తులు)
Comments
Please login to add a commentAdd a comment