
సాక్షి, విజయవాడ : ఏపీ ఎన్జీవో స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్) వివాదాస్సందంగా మారింది. నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ల వ్యవహారంలో అశోక్ బాబుకు విచారణాధికారి క్లీన్ ఎక్విడిక్ట్ ఇవ్వడంపై ఎన్జీవో నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్లీన్ ఎక్విడిక్ట్‌ను అడ్డుపెట్టుకొని అశోక్‌బాబు వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు వీఆర్‌ఎస్ ఇవ్వడం నిబంధనలకు విరుద్దమని కమర్షియల్ టాక్స్ ఉద్యోగులు పేర్కొన్నారు. ఈ మేరకు కమర్షియల్ టాక్స కమిషనర్‌కు ఎన్జీవో నేతలు ఫిర్యాదు చేశారు. అశోక్ బాబుపై పలు కేసులు పెడింగ్‌లో ఉన్నాయని డీసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పెన్షన్ రూల్ 44 ప్రకారం అశోక్‌కు వీఆర్‌ఎస్ ఇవ్వకూడదని డిమాండ్ చేశారు.