సమైక్య తీర్మాన మే దిక్కు
Published Fri, Jan 10 2014 2:46 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగకుండా అడ్డుకునే ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద ధర్నాలు చేస్తామంటూ అశోక్‌బాబు చేసిన వ్యాఖ్యలపై ‘సాక్షి’ గురువారం సర్వే నిర్వహించింది. ఎన్‌జీవో నేత వ్యాఖ్యలు పూర్తిగా తప్పని, ఆయన ఓ రాజ కీయ నాయకుడిలా మాట్లాడుతున్నారని ఈ సర్వేలో పలువురు అభిప్రాయపడ్డారు. ప్రధానంగా న్యాయవాదులు, విద్యావేత్తలు, వైద్యులు, రైతుల అభిప్రాయాల ను సాక్షి తీసుకున్నది. జిల్లాలోని పది నియోజకవర్గా ల్లో 200 మంది అభిప్రాయాలు తీసుకోగా 172 మంది ఓటింగ్ జరగటం మంచిదని అభిప్రాయపడ్డారు. 28 మంది మాత్రం చర్చ జరిగితేనే మంచిదన్నారు.
అసెంబ్లీలో చర్చ జరిపినా, జరపకపోయినా రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని.. శాసనసభ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని బిల్లును రాష్ట్రానికి పంపిన పెద్దలు తేల్చి చెప్పినప్పుడు ఈ రచ్చ ఎందుకని పలువురు ప్రశ్నించారు.
సీమాంధ్రలోని ప్రజలను మోసం చేసేందుకు అసెంబ్లీలో చర్చ ప్రారంభించారని అభిప్రాయపడ్డారు. విలువలేని చర్చ ఎందుకన్నారు. శాసనసభ అభిప్రాయానికి పార్లమెంట్ విలువ ఇస్తుందని చెబితే చర్చించడం మంచిదేనని, లేనప్పుడు కాలాన్ని వృధా చేయడం తప్ప ఉపయోగం లేదని పేర్కొన్నారు. ఒక్కక్క వర్గం నుంచి 50 మంది అభిప్రాయాలను సాక్షి సేకరించింది. సమైక్య తీర్మానం చేయడం మంచిదని విద్యావేత్తల్లో 43 మంది ముక్తకంఠంతో పేర్కొనగా, చర్చ జరి గాక తీర్మానం చేస్తే మంచిదని ఏడుగురు చెప్పారు. విద్యావంతులైన 50 మంది రైతు ల అభిప్రాయాలు తీసుకోగా వారినుంచి ఒకే ఒక్క మాట వచ్చింది. ఓటింగ్ జరిగి తీర్మానం చేస్తేనే సమైక్య రాష్ట్రం అనే మాటకు అర్థం ఉంటుందని, చర్చ అనవసరమ ని స్పష్టం చేశారు. చర్చ అవసరం లేదని 47 మంది చెప్పగా ముగ్గురు మాత్రం చర్చ జరిగితేనే మంచిదన్నారు. 50 మంది వైద్యుల అభిప్రాయాలు తీసుకోగా వారిలో 41 మంది చర్చను తిరస్కరించారు. తొమ్మిది మంది మాత్రం జరగాలన్నారు.
Advertisement
Advertisement