వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్ నంబరు | new registration number in ap | Sakshi
Sakshi News home page

వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్ నంబరు

Published Fri, Jan 22 2016 1:20 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

new registration number in ap

 వాహనాలకు కొత్త
   రిజిస్ట్రేషన్ నంబరు
  సిద్ధమవుతున్న రవాణాశాఖ

 
 శ్రీకాకుళం టౌన్: రాష్ట్ర విభజన తర్వాత రవాణాశాఖ జిల్లాల రిజిస్ట్రేషన్ నంబర్ల కోడ్‌లను మార్చుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో రిజిస్టేషన్ కోడ్‌ను తెలంగాణా ప్రభుత్వం ఇప్పటికే ఏపీకి బదులు టీఎస్‌గా మార్చింది. మన రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలో పాతరిజిస్ట్రేషన్ కోడ్‌కు స్వస్తిపలికి కొత్తగా కోడ్ నంబర్లను కేటాయిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ప్రభుత్వం  అధికారిక  ఉత్తర్వులను జారీచేసినప్పటికి జిల్లాలకు ఇంకాచేరలేదు. శ్రీకాకుళం జిల్లా కోడ్‌ను ఇప్పటివరకు ఏపీ 30గా కొనసాగించేవారు.  ఇక నుంచి ఏపీ 10గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఎప్పటినుంచి అమలుచేయాలన్నదానిపై కచ్చితమైన ఆదేశాలు రావాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement