నిరసిస్తూ.. నినదిస్తూ..
ఏలూరు, న్యూస్‌లైన్:తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ ఎన్జీవోలు నిరవధిక సమ్మెకు దిగటంతో జిల్లాలో గురువారం ప్రభుత్వ కార్యాలయూలు మూతపడ్డాయి. ఏలూరులో కలెక్టరేట్ , అటవీ, వయోజన విద్య, ఆర్‌డబ్ల్యుఎస్, ఎక్సైజ్, జిల్లా పంచాయతీ, సెరీకల్చర్, గ్రౌండ్ వాటర్, వైద్యారోగ్య, దేవాదాయ శాఖ తదితర కార్యాలయూలను ఎన్జీవోలు మూయించివేశారు. మహిళ, శిశు అభివృద్ధిపై కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫెరెన్స్‌ను, కేంద్రీయ విద్యాలయంలో శిక్షణ శిబిరాలను అడ్డుకున్నారు. అనంతరం కలెక్టరేట్‌కు తాళాలు వేసి నిరసన తెలిపారు. ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్‌వీ సాగర్, నాయకులు టి.యోగానందం, ఆర్‌ఎస్ హరనాథ్, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా శాఖ అధ్యక్షుడు పి.సోమశేఖర్, నగర ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, రమేష్‌కుమార్ పాల్గొన్నారు. నగరపాలక సంస్థ కార్యాల యం నుంచి కళాజాతాలతో ర్యాలీ నిర్వహించారు.
తాడేపల్లిగూడె తాలూకా ఆఫీస్ సెంటర్‌లో ఎన్జీవోలు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలను మూయించివేశారు. నిడదవోలులో రెవెన్యూ ఉద్యోగులు తహసిల్దార్ కార్యాలయూనికి తాళాలు వేసి విధులను బహిష్కరించారు. పట్టణంలో పాదయూత్ర జరిపారు. కొవ్వూరులో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ఎదుట బైఠారుుంచి ధర్నా చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను మూరుుంచివేశారు. పాల కొల్లులో ఎన్జీవోలు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి, పట్టణంలో ప్రదర్శన చేశారు. ఆచంటలో ఉద్యోగులు రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయూలను మూయించివేసి నిరసన తెలిపారు. తణుకు, భీమవరం పట్టణాల్లో ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఇదిలావుండగా ఆర్టీసీ, పంచాయతీరాజ్ ఉద్యోగులు సమ్మెకు దూరంగా ఉండిపోయూరు.
రేపు ఎంపీల ఇళ్లముట్టడి
శుక్రవారం రాజ్యసభ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎంపీలు, కేంద్ర మంత్రుల ముట్టడిని శనివారం నాటికి వారుుదా వేశారు.