CM YS Jagan Mohan Reddy Accuses Chandrababu In AP NGOs Meeting - Sakshi
Sakshi News home page

'జన్మభూమిపేరుతో చంద్రబాబు అడ్డగోలుగా దోచుకున్నారు..'

Published Mon, Aug 21 2023 1:28 PM | Last Updated on Mon, Aug 21 2023 1:52 PM

CM Jagan Mohan Reddy Accuses Chandrababu AP NGO Meeting - Sakshi

అమరావతి: చంద్రబాబు తన హయాంలో ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఉద్యోగుల పట్ల చంద్రబాబుకు చులకన భావం ఉందని అన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులతో అడ్డగోలుగా వ్యవహరించిందని విమర్శించారు. విజయవాడలో జరుగుతున్న ఏపీ ఎన్జీవో 21 రాష్ట్ర మహాసభలకు ప్రత్యేక అతిధిగా సీఎం జగన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో సంఘం సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌.. ప్రభుత్వ ఉద్యోగులకు వరాల జల్లులు కురిపించారు.  

ఉద్యోగులకు వరాలు..

సోమవారం ఏపీ ఎన‍్జీవో బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్..  ఉద్యోగులపై వరాల జల్లులు కురిపించారు. పెండింగ్‌లో ఉన్న డీఏను దసరా కానుకగా ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. హెల్త్ సెక్టార్‌లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ఐదు రోజుల క్యాజువల్ లీవ్స్ మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. 2019 నుంచి 3 లక్షల 19 వేల ప్రభుత్వ ఉద్యోగులను నియమించామని స్పష్టం చేశారు. 53 వేల మంది హెల్త్ సెక్టార్‌లో నియమించామని అన్నారు. 

2,06,668 కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని సీఎం జగన్ తెలిపారు. వేతనాలపై రూ.3,300 కోట్లు ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. చంద్రబాబు రాసిన 'మనసులో మాట' పుస్తకాన్ని ఉటంకిస్తూ.. ఉద్యోగుల గురించి చంద్రబాబుకు దారుణమైన అభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు. బాబు దృష్టిలో కొందరే మంచోళ్లు అందరూ లంచగొండులేనని అన్నారు. ఉద్యోగులను నిందించే హక్కు ఆయనకు ఎవరిచ్చారని మండిపడ్డారు. అలాంటి బాబు ఉద్యోగులకు మంచి చేయగలడా? అలోచించాలని ఉద్యోగులను ప్రశ్నించారు. 

చంద్రబాబు ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారని సీఎం జగన్‌ అన్నారు. మొక్కుబడిగా కొన్ని మాత్రమే ఉద్యోగులకు మిగిల్చారని దుయ్యబట్టారు. బాబు హయాంలో దాదాపు 54 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేశారని చెప్పారు. బాబు కాలంలో ఆర్టీసీ పరిస్థితి ఏంటి?.. పాఠశాలల దుస్థితి ఎలాంటిది? అలాంటివారు ఉద్యోగులకు న్యాయం చేయగలరా? అని ప్రశ్నించారు. బాబు, ఆయన వర్గానికి తమ ప్రభుత్వంపై కడుపు మంట అని సీఎం జగన్‌ మండిపడ్డారు.

గ్యారెంటీ పెన్షన్ స్కీం..
ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ గ్యారెంటీ పెన్షన్ స్కీంను అమలులోకి తెచ్చిన్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. జీపీఎస్ స్కీంకు త్వరలో ఆర్డినెన్స్ వస్తుందని చెప్పారు. జీపీఎస్ దేశంలోనే విప్లవాత్మకమైన నిర్ణయమని అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తినని సీఎం జగన్ చెప్పారు. రిటైరయ్యాక ఉద్యోగులకు మంచి జరగాలనే ఈ స్కీం తీసుకొచ్చినట్లు వెల్లడించారు. దేశంలో ఈ స‍్కీం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. 

ఉద్యోగులే వారదులు..
అభివృద్ధి, సంక్షేమంలో తమది ప్రజా ప్రభుత్వం అని సీఎం జగన్‌ అన్నారు. ప్రజలకు పప్రభుత్వాలకు మధ్య ఉద్యోగులు వారదులని చెప్పారు. ఏ ప్రభుత్వంతో పోల్చినా మెరుగ్గానే ఉన్నామని అన్నారు. అన్ని సేవలను గ్రామస్థాయికి విజయవంతంగా చేర్చామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు ఎల్లప్పుడు సానుకూలంగానే ఉందని స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాల వ్యవస్థ గురించి అందిరికీ తెలుసని అన్నారు.

2019 నుంచి ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి చిత్తశుద్దిని చాటుకున్నట్లు వెల్లడించారు. పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 వరకు పెంచామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల నిజాయితీగా కమిట్‌మెంట్‌తో ఉన్నట్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల వలె కాకుండా ఎన్నికలతో సంబంధం లేకుండా జీతాలు పెంచామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశామని అన్నారు. 
గత ప్రభత్వాలు 6 న

కరోనా సమయంలోనూ..
కోవిడ్ టైంలో రెవెన్యూ తగ్గినా డిబీటీని అమలు చేసిన ప్రభుత్వం తమదని సీఎం జగన్ అన్నారు. దేశానికే ఆదర్శంగా పాలన చేస్తున్నామని చెప్పారు. ఎక్కడా వివక్ష, లంచాలకు తావివ్వలేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు వదిలేసిన కారుణ్య నియామకాల‍్లో పారదర్శకత పాటించామని తెలిపారు. పదివేలకు పైగా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే విషయంలోనూ ఎక్కడా వెనక్కి తగ్గలేదని చెప్పారు.

మినిమం టైం పేస్కేల్..
నష్టాల్లో ఉన్న ఆర్టీసీని రక్షించి  కార్మికులకు తోడుగా ఉన్నామని సీఎం జగన్ అన్నారు. ఉద్యోగుల ముఖంలో చిరునవ్వును చూడటమే ప్రభుత్వ ధ‍్యేయమని చెప్పారు. 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేశామని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైం పేస్కేల్ అచ్చామని వెల్లడించారు. నెల మొదటి వారంలోనే జీతాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి చోట దళారి వ్యవస్థను నిర్మూలించామని స్పష్టం చేశారు. 

ప్రభుత్వ బడులు భేష్..
ప్రస్తుతం గ్రామ స్థాయిలో గవర్నమెంట్ బడులు కార్పొరేట్ ప్రమాణాలతో నడుస్తున్నాయని సీఎం జగన్ తెలిపారు. గత ప్రభుత్వం వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేసిందని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రులను నాశనం చేసిందని అన్నారు. జిల్లాల విభజనతో పాలన ప్రజలకు మరింత దగ్గరైందని చెప్పారు. గత ప్రభుత్వాలు పక్కన పడేసిన అనేక సమస్యలకు పరిష్కారం చూపామని వెల్లడించారు. 

ప్రతీ మూడు సంవత్సరాలకు ఒకసారి ఏపీ ఎన్జీవో మహాసభలు జరుగుతుంటాయి. సంఘం ఆవిర్భావం జరిగిన నాటి నుంచి ఈ మహాసభలకు రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరవడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి జరుగుతున్న మహాసభలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తోపాటు పలువురు మంత్రుల, ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: పంచాయతీ ఉప ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ విజయకేతనం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement