
సాక్షి, విజయవాడ : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం సంతోషమని, ఆర్టీసీ ఉద్యోగుల కోసం ప్రత్యేక రవాణా విభాగాన్ని ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. ఆంధ్రబ్యాంక్ పేరును యధావిధిగా ఉంచాలని చేసిన కేబినెట్ తీర్మానానికి సంపూర్ణ మద్దతు ఇస్తునట్లు ప్రకటించారు. ఆశా కార్యకర్తల జీతాలు మూడు వేల నుంచి పది వేలకు పెంచడం అభినందనీయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment