నిరసన జ్వాల
Published Sun, Feb 9 2014 3:55 AM | Last Updated on Sat, Sep 2 2017 3:29 AM
ఏలూరు, న్యూస్‌లైన్:జిల్లాలో సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్య మం ఊపందుకుంది. సమ్మెకు దిగిన ఎన్జీవోలతో కలసి సమైక్యవాదులు, విద్యార్థులు కదం తొక్కారు. శనివారం జిల్లాలో పలుచోట్ల ర్యాలీలు, రాస్తారోకోలు జరిగాయి. పెరవలిలో ఎన్జీవోలు రాస్తారోకో చేశారు. పాలకొల్లు తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఎన్జీవోలు ధర్నా చేపట్టారు. ఎన్జీవో అసోసియేషన్ కన్వీనర్ గుడాల హరిబాబు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. వారికి సంఘీభావంగా ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ఎమ్మెల్యే బంగారు ఉషారాణి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భీమవరం మెంటేవారి తోటలో వండర్ కిడ్స్, శ్రీ విద్యానికేతన్ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. బుధవారం మార్కెట్ సెంటర్‌కు చేరుకుని రాస్తారోకో చేశారు. కొవ్వూరు విజయవిహార్ సెంటర్‌లో విద్యార్థులు, ఎన్జీవోలు రాస్తారోకో జరిపారు. కొయ్యలగూడెం సెంటర్‌లో ఎన్జీవోలు, కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
‘ప్రజలు కావాలా.. పదవులు కావాలా’
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : రాష్ట్రా న్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ కోట్లాది ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే ప్రజాప్రతినిధులు నాటకాలాడటం సబబు కాదని ఉపాధ్యాయ జేఏసీ జిల్లా కన్వీనర్ పి.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా పరి షత్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సమైక్య దీక్షా శిబిరం వద్ద ఉపాధ్యాయులు శనివారం సాయంత్రం మోకాళ్లపై నిలబడి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులు పదవులు కావాలో.. ప్రజలు కావోలో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం అర్పిం చేందుకు ప్రజలు సిద్ధంగా ఉంటే కేంద్ర మంత్రులు మాత్రం పదవుల కోసమే ప్రాకులాడుతున్నారన్నారు. ప్రజాప్రతినిధులంతా తక్షణమే పదవులకు రాజీనామా చేయూలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి.రాంబాబు, సుభాకర రత్నం, ఎన్‌కేడీ శ్రీనివాసరావు, విజ యకుమార్, హనుమంతరావు, తామాడ అప్పారావు, పూర్ణశ్రీ, భాస్కరలక్ష్మి, సత్యనారాయణ పాల్గొన్నారు.
Advertisement
Advertisement