విభజన మంటలు
Published Fri, Feb 14 2014 4:01 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
ఏలూరు, న్యూస్‌లైన్:రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ గురువారం జిల్లాలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపును అందుకుని
పార్టీ నాయకులు, శ్రేణులు ఆందోళన కార్యక్రమాలను వేడెక్కించారు. విభజన నిర్ణయూన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ కదం తొక్కారు. మరోవైపు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిందన్న విష యం తెలిసి అన్నివర్గాల ప్రజలు ఆగ్రహంతో రగిలిపోయూరు. రోడ్లపైకి వచ్చి సోనియూగాంధీ, మన్మోహన్‌సింగ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పార్లమెం టులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెడుతు న్న సమయంలో.. రాష్ట్రం విడిపోతుం దన్న మనస్తాపంతో ఏలూరులో కేఏహెచ్‌ఎల్ డిగ్రీ కళాశాల డిగ్రీ విద్యార్థి మహ్మద్ ముజాహిద్దీన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. తోటి విద్యార్థులు, పోలీసులు అతడిని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.
సకలం బంద్
రాష్ట్ర విభజన నిర్ణయూన్ని వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన సమైక్య బంద్ సంపూర్ణైమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గురువారం వేకువజాము నే ఆర్టీసీ డిపోలకు చేరుకుని బస్సులను బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. అనంతరం ప్రభుత్వ కార్యాలయాలను, బ్యాంకులను మూయించేశారు. ఎన్జీవోలు, టీ డీపీ నాయకులు సమైక్య బంద్‌లో పాల్గొని వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఏలూరు నగరంలో చైతన్య కళాశాలను మూయిస్తున్న సమయంలో ఎన్జీవో నాయకులు, విద్యాసంస్థ యూజమాన్యం మధ్య వాగ్వివా దం చోటు చేసుకుంది. వైఎస్సార్ సీపీ ఏలూరు నగర శాఖ కన్వీనర్ గుడిదేశి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో ధ ర్నా చేశారు. టీడీపీ నాయకులు మోటార్ సైకిళ్లపై తిరుగుతూ దుకాణాలను మూయించివేశారు.
అనంతరం ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో ధర్నా చేశా రు. రైతాంగ సమాఖ్య ఆధ్వర్యంలో రైతు లు ప్రదర్శన నిర్వహించారు. సీఆర్ రెడ్డి అటానమస్ కళాశాల విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేశారు. అనంతరం రోడ్డుపై పడుకుని సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ఎన్జీవోల ఆధ్వర్యంలో సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్ దిష్టిబొమ్మలతో నగరంలో శవయూత్ర నిర్వహించి ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. విశాలాంధ్ర మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి ఢిల్లీ యూత్రకు వెళుతూ ఏలూరులో ఆగారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జేఏసీ నాయకులు డాక్టర్ ఏవీఆర్ మోహన్, న్యాయవాది కానాల రామకృష్ణ, ఎన్జీవోల తరఫున టి.యోగానందం, ఆర్‌ఎస్ హరనాధ్ కార్యక్రమాలను పర్యవేక్షించారు.
ఊరూవాడా ఆందోళనలు
భీమవరం పట్టణంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపోకు వెళ్లిన కార్యకర్తలు బస్సులను బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. మునిసిపల్ మాజీ చైర్మన్ గ్రంధి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రకాశం చౌక్‌లో రాస్తారోకో చేశారు. ఇక్కడే ఎన్జీవోలు, టీడీపీ నాయకులు రాస్తారోకో చేశారు. అనంతరం బీజేపీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తెలంగాణ బిల్లుకు మద్దతిస్తే కాంగ్రెస్‌తోపాటు బీజేపీకి నూకలు చెల్లుతాయని హెచ్చరిం చారు. వీరవాసరంలో బంద్ విజయవంతమైంది. ఉండిలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది.
ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో నరసాపురంలో బంద్ చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయూలను ఎన్జీవోలు మూయించివేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిం చారు. వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్‌లో రాస్తారోకో చేశారు. కొవ్వూరులో పార్టీ సమన్వయకర్త తానే టి వనిత ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించి దుకాణాలను మూయించేశారు. మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ పాల్గొన్నారు. ఎన్జీవోలు, టీడీపీ నాయకుల ఆధ్వర్యంలోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. నిడదవోలులో ఎన్జీవోలు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాం కులను మూయించేశారు. మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. కొయ్యల గూడెంలో బంద్ విజయవంతమైంది.
భీమడోలులో జాతీయ రహదారిపై వైసీపీ నాయకులు, రాష్ట్ర రహదారిపై టీడీపీ నాయకులు రాస్తారోకో చేశారు. చింతలపూడిలో ఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో మానవహారం చేశారు. తాడేపల్లిగూడెంలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త తోట గోపీ నాయకత్వంలో బంద్ చేపట్టారు. ఎన్జీవో అసోసియేషన్ పిలుపుమేరకు ఉద్యోగులు, నాన్‌పొలిటికల్ జేఏసీ నాయకులు బంద్‌లో పాల్గొన్నారు. తణుకులో వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య ఆధ్వర్యంలో బంద్, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. తేతలి వై జంక్షన్ వద్ద రాస్తారోకో చేయటంతో రెండు గంట లపాటు ట్రాఫిక్ స్తంభించింది. ఎన్జీవో అసోసియేషన్ నాయకులు పీవీ రమణ, వైవీ సత్యనారాయణమూర్తి, ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. పాలకొల్లులో ఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి.
Advertisement