బకాయి జీతాలను చెల్లించాలంటూ ధర్నా
Published Mon, Nov 14 2016 4:54 PM | Last Updated on Mon, Sep 4 2017 8:05 PM
ఏలూరు(సెంట్రల్)ః
జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి బకాయి జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద సిబ్బంది ధర్నా చేపట్టారు. జిల్లా ప్రభుత్వాసుత్రి వద్ద నుండి ర్యాలీగా కలెక్టరేట్ వరకు అక్కడ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఎఐటీయుసీ నాయకుడు కె.కృష్ణమాచార్యులు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న వైద్య విధాన పరిషత్ హాస్పటల్స్‌లో ఈగల్ హంటర్ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని, సిబ్బందికి కనీస వేతనం చెల్లించకపోగా, నెలకు ఇచ్చే రూ.6000 వేతనం గత నాలుగు నెలల నుండి ఇవ్వడం లేదన్నారు. పీఎఫ్, ఇఎస్‌ఐ నెంబర్స్ ఇప్పటి వరకు మంజూరు చేయలేదని, ఒక జత యూనిఫాం ఇచ్చి ఒక్కొక్కరి దగ్గర నుండి రూ. 1800 వసూలు చేశారని ఆయన తెలిపారు. పీఎఫ్ నెంబర్లు, ఇయస్‌ఐ కార్డులు, యూనిఫాం ఇస్తామని చెప్పిన సదరు కాంట్రాక్టర్ చెప్పి ఇప్పటికి నెలలు గడుస్తున్నాయని వెంటనే జిల్లా కలెక్టర్ చోరవ తీసుకుని సిబ్బందికి వేతనాలు వచ్చే వి«ధంగా చర్యలు తీసుకోవాలని కృష్ణమాచార్యులు కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ కె.భాస్కర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు.
Advertisement
Advertisement