కోదాడ: నెలల తరబడి తమకు వేతనాలు ఇవ్వక పోవడంతో పూటగవక ఇబ్బందులు పడుతున్నామన్నారు. వెంటనే తమకు వేతనాలు ఇవ్వాలని కోరుతూ మండంలంలోని వివిధ గ్రామపంచాయతీల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు శుక్రవారం కోదాడ ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సీఐటీయూ కార్మిక సంఘం నేతలు మాట్లాడుతూ ఇచ్చేదే అరకొర వేతనాలని, వాటిని కూడా సకాలంలో ఇవ్వక పోవడం వల్ల వారు పస్తులుండాల్సిన పరిస్ధితులు ఏర్పడ్డాయన్నారు. పాలకులు, అధికారులు వారిని పట్టించుకోక పోవడం అన్యాయమన్నారు. వేతనాలను వెంటనే చెల్లించాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామన్నారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డికి అందించారు. ఈ కార్యక్రమంలో కుక్కడపు ప్రసాద్, సోమపంగు రాధాకృష్ణ, ముత్యాలుతో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు.
వేతనాలకోసం గ్రామపంచాయతీ కార్మికుల ధర్నా
Published Fri, Sep 16 2016 8:02 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
Advertisement