‘మేము సైతం..’ ట్రాఫిక్‌పై హిజ్రాల అవగాహన
కొరుక్కుపేట: నిత్యం రోడ్లపై మరణమృదంగ ధ్వనులు వినిపిస్తున్నాయి. విపరీతమైన రద్దీ, నిబంధనలు పాటించని వాహనచోదకులు, ఎవరికి వారు తొందరగా వెళ్లాలనే తొందర ఇవన్నీ ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా ఆచరణలో అది కనిపించడం లేదు. రెండు, మూడు నెలలుగా ఎన్జీవోలు, విద్యార్థులు రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
వీరి బాటలోనే మేము సైతం అంటూ నగరానికి చెందిన కొందరు హిజ్రాలు గళం విప్పారు. అన్నానగర్ చర్చి వద్ద సోమవారం వారు జాగ్రత్తలు పాటించండి.. ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు.. తొందరపాటు పనికిరాదంటూ హితవు పలికారు. ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్లకార్డులు ప్రదర్శించారు. కరపత్రాలు పంచారు.