Placards
-
వైఎస్ఆర్సీపీ ఎంపీ మాట్లాడుతుండగా సడన్‌గా వచ్చి ప్లకార్డు ప్రదర్శించిన రేవంత్ రెడ్డి
-
'అందమైన భార్య ఉన్నా ఇదే చెప్తావా?'
నాగ్‌పూర్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ చూడడానికి వచ్చిన ఒక అభిమాని తన చర్యతో అందరిని ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లి అంటే విపరీతమైన అభిమానం అనుకుంటా. కట్టుకున్న భార్య కంటే విరాట్ కోహ్లినే ఎక్కువ ఇష్టపడుతాను అంటూ ప్లకార్డు ప్రదర్శించడం ఆసక్తి కలిగించింది. అయితే దీనిపై కొందరు అభిమానులు ఫన్నీ సెటైర్లు వేశారు.. ''బాగానే ఉంది సంబరం.. ఒకవేళ నీకు అందమైన భార్య ఉంటే అప్పుడు కూడా ఇలాగే చెప్తావా''.. ''ఇంటికెళ్లిన తర్వాత నీకు బడితపూజ ఖాయం భయ్యా''.. కోహ్లి మీద అభిమానంతో కట్టుకున్న భార్యను అవమానిస్తావా'' అంటూ కామెంట్స్ చేశారు. మరికొందరు మాత్రం గతంలో కోహ్లి సెంచరీ సాధించేంతవరకు పెళ్లి చేసుకోనని భీష్మించి కూర్చొన్న ఒక అభిమాని ఫోటోను రీట్వీట్ చేశారు. ఎంతైనా అభిమానం వెర్రిగానే ఉంటుంది. ముఖ్యంగా మన టీమిండియా ఫ్యాన్స్ అభిమానించడంలో ముందు వరుసలో ఉంటారు. సదరు క్రికెటర్ బాగా ఆడితే చప్పట్లు.. ఆడకపోతే చివాట్లు పెట్టడం సహజం. ఇక తొలి టెస్టు రసవత్తరంగా సాగుతుంది. తొలిరోజు టీమిండియా బౌలర్లు ఆసీస్ బ్యాటర్ల పని పడితే.. రెండోరోజు ఆటలో ఆసీస్ బౌలర్లు ఆధిపత్యం చూపిస్తున్నారు. అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో మెరవడం కాస్త ఊరటనిచ్చే అంశం. తన ఫామ్మై వస్తున్న విమర్శలకు సెంచరీతో సమాధానమిచ్చాడు రోహిత్. జట్టులో అంతా విఫలమైనప్పుడు ఆడడం తన స్పెషాలిటీ అని రోహిత్ మరోసారి నిరూపించాడు. 212 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 120 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు రీఎంట్రీ టెస్టులో మొదట బౌలింగ్‌తో అదరగొట్టి ఐదు వికెట్లతో రాణించిన జడేజా.. బ్యాటింగ్‌లోనూ ఫిఫ్టీతో మెరిశాడు. ప్రస్తుతం టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. జడేజా 51, అక్షర్ పటేల్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో టాడ్ మర్ఫీ ఐదు వికెట్లతో చెలరేగాడు. And yes, that’s his wife next to him. #INDvAUS #BGT2023 pic.twitter.com/FHv8GlA1uS — Adam Collins (@collinsadam) February 10, 2023 చదవండి: లియోన్ అనుకుంటే డెబ్యూ బౌలర్ ఇరగదీశాడు -
ఒడిశాలో ఏం జరుగుతోంది? మరో రష్యా పౌరుడు మిస్సింగ్!
భువనేశ్వర్: పది నెలలుగా ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేస్తోన్న రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆ దేశ పౌరులు ఇటీవల ఒడిశాలోని రాయగడ హోటల్లో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పావెల్ అంటోవ్(65) అనే ఎంపీ, ఆయన స్నేహితుడు ఇరువురు రెండ్రోజుల వ్యవధిలో హోటల్లో రక్తపు మడుగులో పడి కనిపించటం కలకలం రేపింది. ప్రస్తుతం పుతిన్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన మరో రష్యా పౌరుడు కనిపించకుండా పోయాడనే వార్త కలకలం సృష్టిస్తోంది. ఒడిశాలో ఏం జరుగుతోంది? అక్కడి పోలీసులు ఏం చెబుతున్నారు. ఇదీ జరిగింది.. ఒడిశా రాజధాని భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో శుక్రవారం.. రష్యాకు చెందిన ఓ 60ఏళ్ల వ్యక్తి ప్లకార్డు పట్టుకుని నిరసన వ్యక్తం చేశాడు. తాను రష్య వసలదారుడినని, తాను యుద్ధానికి, పుతిన్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నట్లు పేర్కొన్నాడు. తాను నిరాశ్రయుడిగా మారానని, తనకు సాయం చేయాలని కోరాడు. మరోవైపు.. రైల్వే స్టేషన్లో ప్లకార్డు పట్టుకుని నిరసన వ్యక్తం చేసిన వ్యక్తి ఆచూకీ గల్లంతైనట్లు వార్తలు చక్కర్లు కొంటాయి. ఆయనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నాయి. ఒడిశా రాయగడలోని హోటల్లో ఇద్దరు రష్యన్ వ్యక్తులు మరణించిన క్రమంలో ఈ వార్తలు చక్కర్లు కొట్టడంతో ఆందోళనలు నెలకొన్నాయి. అయితే, ఆ వార్తలను కొట్టిపారేశారు ఒడిశా పోలీసులు. ఆయన క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి అదృశ్యం కేసు నమోదు కాలేదని రైల్వే పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ‘నవంబర్లోనూ ఆ వ్యక్తి ప్లకార్డు పట్టుకుని రైల్వే స్టేషన్లో కనిపించాడు. ఆయన పాస్‌పోర్టును తనిఖీ చేశాం. ప్రయాణికుల నుంచి డబ్బులు అడుక్కుంటున్నాడు. అతడి వివరాలు తనిఖీ చేసి పూరీకి పంపించాం. అప్పటి నుంచి తనవారితో అక్కడే ఉంటున్నాడు. రాయగడ హోటల్ ఘటనలకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదు’అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: రష్యా పౌరుడి అనుమానాస్పద మృతి.. వాళ్లిదరూ ఒకే గదిలో.. -
‘దొంగతనం పాపం’ రా బాబులు!
ఏర్పేడు: తమ పంటను దొంగల బారి నుంచి రక్షించుకునేందుకు ఓ రైతు ఆదివారం వినూత్న ప్రయోగాన్ని చేపట్టాడు. ‘దొంగతనం పాపం.. ఓం నమశ్శివాయ’ అంటూ ప్లకార్డులపై రాయించి వాటిని పొలంలో ఏర్పాటు చేశాడు. తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం కొండ్రాజుపల్లికి చెందిన రామ్మూర్తినాయుడు శ్రీకాళహస్తిలో ఉంటూ పదేళ్లుగా ఏర్పేడు మండలంలోని చిందేపల్లిలో కూరగాయలు పండిస్తున్నాడు. ప్రస్తుతం కాకర పంట వేశాడు. అప్పుడప్పుడు బైక్‌పై వెళ్లి కాకర పంటను చూసుకుంటున్నాడు. అయితే పలువురు తోటలోని కాకర కాయలను దొంగిలిస్తున్నారు. దీంతో రామ్మూర్తినాయుడు పైవిధంగా ప్లకార్డులు ఏర్పాటు చేశాడు. మరి ఇది ఎంతవరకు ఫలితాన్నిస్తుందో చూడాలి. -
అయ్యా! బతికే ఉన్నాను అని వేడుకుంటున్న వృద్ధుడు: వీడియో వైరల్
ఒక వృద్ధుడికి తాను బతికే ఉన్నానని నిరూపించకోవాల్సిన దుస్థితి వచ్చింది. అందుకోసం ఏకంగా పెళ్లికొడుకులా రథంలో ఊరేగుతూ వచ్చి తాను బతికే ఉన్నానని చెప్పుకొంటున్నాడు. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే....హర్యానాలోని 102 ఏళ్ల వృద్ధుడు ప్రభ్తత్వ రికార్డులో చనిపోయినట్లు ఉంది. అతను రోహ్తక్ జిల్లాలోని గాంధ్రా గ్రామానికి చెందిన దులిచంద్ అనే వృద్ధుడు. ఆ వృద్ధుడు ప్లకార్డులు పట్టుకుని, మెడలో కరెన్సీ దండను ధరించి మానసరోవర్ నుంచి కెనాల్ రెస్ట్ హౌస్‌కి రథంపై ఊరేగుతూ....బతికే ఉన్నానని చెబుతున్నాడు. తాను మార్చిలో చివరిసారిగా వృద్ధాప్య ఫించన్‌ను తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ రికార్డుల్లో చనిపోయి ఉండటంతో తన ఫెన్షన్ ఆగిపోయిందని చెప్పుకొచ్చారు. తన మనవడు ఈ విషయమై ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదులు చేసిన ప్రయోజనం కనిపించలేదని వాపోయాడు. ఆ వృద్ధుడు తాను బతికే ఉన్నానంటూ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్లతో సహా ఇతర గుర్తింపు పత్రాలను చూపిస్తున్నాడు. అతను హర్యానా ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) మాజీ అధ్యక్షుడు నవీన్ జైహింద్ని కలిని తన గోడును వినిపించారు. ఆయన ఆ వృద్ధుడికి తిరిగి ఫెన్షన్ పొందేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇలా వృద్ధుల ఫించన్‌ని నిలిపి ఇబ్బందులకు గురి చేయడం దురదృష్టకరమని అన్నారు. తాను సీఎంకి ఈ విషయమై ఫిర్యాదు చేసినప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. అంతేకాదు నవీన్ జైహింద్ ఆ వృద్ధుడిని తీసుకుని బీజేపీ నాయకుడు మనీష గ్రోవర్ని కలిసి అతనికి రావాల్సిన ఫించన్‌ని ఇప్పించవలిసిందిగా కోరారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. हरियाणवी फिल्म, थारा फूफा जिन्दा है अभिनेता -दुलीचंद ज़िंदा ( 102 वर्षीय ) निर्माता निर्देशक, नवीन जयहिंद गीत संगीत, बेरोजगार बैंड पार्टी रोहतक कहानी-हरियाणा सरकार के कुछ अधिकारी जिन्होंने ज़िंदा दुलीचंद को मृत बता काट दी बुढ़ापा पेंशन @NaveenJaihind @DeependerSHooda pic.twitter.com/EtZVA4qvMh — Puspendra Singh Rajput हरियाणा अब तक (@psrajput75) September 8, 2022 (చదవండి: వాసనను బట్టి వ్యాధిని చెప్పేస్తున్న వైద్యురాలు... ఆశ్చర్యపోతున్న వైద్యులు) -
‘మా నాన్న పోలీసు..ఆయనకు సహకరించండి’
సాక్షి, హైదరాబాద్ : ‘‘మా నాన్న పోలీసు.. కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు సహకరించండి’’అంటూ ఓ పసిపాప ప్లకార్డు పట్టుకున్న పోస్టు ఇపుడు వైరల్‌గా మారింది. కదిలించే లా ఉన్న ఈ తరహా ఫొటోలను చాలామంది డీజీపీ ట్విట్టర్ ఖాతాకు ట్యాగ్ చేస్తున్నారు. ఇక డీజీపీ సైతం రోడ్లపైకి ప్రజలు రాకుండా పోలీసులకు సహకరించాలని విజ ్ఞప్తి చేస్తున్నారు. వివరాలు.. కోవిడ్ మహమ్మారిపై కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పోలీసులకు ఒక్కసారిగా పని భారం పెరిగింది. ఆదివారం జనతా కర్ఫ్యూ దరిమిలా పోలీసులకు విరామం లేకుండా పోయింది. జనసంచారంపై సోమవారం మ ధ్యాహ్నం వరకు కాస్త చూసీచూడనట్లుగా ఉ న్నా.. తరువాత ఒక్కసారిగా పరిస్థితి మారింది. అప్పటి నుంచి పోలీసులు క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నారు. మంగళవారం ప్రధాని 21 రోజులపాటు లాక్డౌన్ ఉంటుం దని ప్రకటించడంతో పోలీసుల పనిభారం రెట్టింపయింది. అత్యవసర పరిస్థితి కావడం తో సెలవులన్నీ రద్దయ్యాయి. కోవిడ్‌పై జరుగుతున్న యుద్ధంలో పోలీసులది కీలక భూమిక. ముఖ్యంగా కోవిడ్ బాధితుల గుర్తించడం, ప్రజలను చైతన్యం చేయడం, గ్రామపంచాయతీ, రెవెన్యూ, ప్రజాప్రతినిధులతో కలిసి గత మూడురోజులుగా నిర్విరామంగా పనిచేస్తున్నారు. పలువురు కోవిడ్ అనుమానితులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఉన్నతాధికారులు ఏ అర్ధరాత్రో ఇంటికి వెళ్లి వస్తున్నారు కానీ.. కానిస్టేబుళ్లలో చాలామంది ఇంటికి వెళ్లి నాలుగురోజులయింది. చాలామంది స్నానం చేయకుండా, యూనిఫారం మార్చుకోకుండా రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశ్రాంతి లేకుండా పనిచేస్తోన్న పోలీసుల ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. జనసంచారం నియంత్రణలో పడి ఎక్కడ ముందు జాగ్రత్తల విషయంలో నిర్లక్ష్యం వహిస్తారో అన్న ఆవేదనలో మునిగిపోయారు. ప్రజలు సహకరించాలి : డీజీపీ పోలీసు అధికారులంతా నిర్విరామంగా, నిరంతరాయంగా 24 గంటలు సమాజం కోసం పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు పూర్తిగా వారికి సహకరించాలి. అపుడే ఈ కోవిడ్ మహమ్మారిని తరిమికొట్టగలం. అదే సమయంలో ఉన్నతాధికారుల నుంచి హోంగార్డు ఆఫీసర్ల వరకు అంతా మాస్కు లు ధరించాలి. శానిటైజర్లు ఉపయోగించాలి. ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూనే సమాజాన్ని కాపాడాలి. -
‘సీఎం గారూ.. న్యాయం చేయండి’
సాక్షి, అమరావతి బ్యూరో: రాజ్‌భవన్ వద్ద పద్మావతి అనే మహిళ ‘సీఎం గారూ.. న్యాయం చేయండి’ అని రాసిన ప్లకార్డును చేతబూని ఉండటాన్ని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. ఆమె నుంచి వివరాలు అడిగి తెలుసుకుని తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం జగన్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ అయ్యేందుకు సోమవారం వెళ్తున్న సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల కోసం మీడియా ప్రతినిధులు ఆమెను సంప్రదించగా.. తన సోదరి కుమారుడు మనోజ్‌కుమార్ సెప్టెంబర్ 21న హత్యకు గురయ్యాడని తెలిపింది. స్నేహితులే హత్య చేసినట్టు అనుమానం వ్యక్తం చేసినా పోలీసులు పట్టించుకోలేదని చెప్పింది. ఈ విషయమై విజయవాడ డీసీపీ విక్రాంత్ స్పందిస్తూ.. కేసు దర్యాప్తులో ఉందని, కుటుంబ సభ్యుల అనుమానాలపైనా విచారణ జరిపిస్తామన్నారు. ఎస్ఐ పాత్రపై కూడా విచారణ జరిపిస్తామని చెప్పారు. -
‘నోటా’ నొక్కండి.. మాకు తోడుండండి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల వేళ అన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారానికి దిగాయి. ఓటర్లను ఆకట్టుకొనేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ కీలకమైన సమయంలో నగరంలోని క్యాబ్ డ్రైవర్లు వినూత్న ప్రచారానికి తెరలేపారు. ఏ పార్టీకి ఓటు వేసినా లాభం లేదంటూ ‘నోటా’పాట అందుకున్నారు. ‘నోటా’పై నొక్కాలని ప్రజలను కోరుతున్నారు. వేలాది డ్రైవర్లు తమ వాహనాలపైన ఈ తరహా పోస్టర్లను అతికించుకొని తిరుగుతున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. ‘నోటా’ప్రచారం పలు చోట్ల ప్రధాన పార్టీల అభ్యర్ధులను హడలెత్తిస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు డ్రైవర్ల సంక్షేమాన్ని విస్మరించాయని, ఏ మేనిఫెస్టోలోనూ తమ సమస్యలను ప్రస్తావించలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ సంస్థల మోసాల బారి నుంచి కాపాడాలంటూ రాజకీయ పార్టీలకు, నేతలకు పలుమార్లు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోలేదని తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవర్, భాగస్వాముల మధ్య పోటీని తీవ్రతరం చేసిన క్యాబ్ సంస్థలు తమను తీవ్రంగా దోచుకుంటున్నాయని, ఈ దోపిడీకి వ్యతిరేకంగా ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వలేదన్నారు. తమకు సహకారాన్ని అందించని రాజకీయ పార్టీలపైన నమ్మకాన్ని కోల్పోయి ‘నోటా’ప్రచారానికి దిగినట్లు సలావుద్దీన్ తెలిపారు. తెలంగాణ క్యాబ్, ట్యాక్సీ, ఆటో, తదితర సంఘటిత, అసంఘటిత రంగాల్లో కొనసాగుతున్న లక్షలాది మంది డ్రైవర్ల కోసం ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలనేది డ్రైవర్ల ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. -
సీనియర్ నటుడు గిరీష్ కర్నాడ్‌పై ఫిర్యాదులు
బెంగళూరు: ప్రముఖ నటుడు, రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత గిరీష్ కర్నాడ్‌పై వరుస ఫిర్యాదులు నమోదయ్యాయి. గిరీష్ కర్నాడ్‌కు నిషేధిత మావోయిస్టు సంస్థతో సంబంధాలున్నాయని, ఆయనపై కేసు నమోదు చేయాలంటూ ఓ న్యాయవాది, శ్రీరామ సేన కార్యకర్తలు పోలీసులను ఆశ్రయించారు. హత్యకు గురైన సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ ప్రథమ వర్థంతి (సెప్టెంబర్ 5) సందర్భంగా ‘మీ టూ అర్బన్ నక్సల్’ అన్న ప్లకార్డు ధరించడాన్ని తప్పుపడుతూ ఈ కేసు నమోదు చేశారు. వీరిలో గౌరీ లంకేశ్ హత్య కేసులో నిందితుల తరఫున వాదిస్తున్న న్యాయవాది ఎన్పీ అమృతేశ్ ఒకరు కావడం గమనార్హం. హిందూ జన జాగృతి సమితి సభ్యులు కూడా కర్నాడ్‌పై నగర పోలీసు కమిషనర్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. నక్సలిజాన్ని సమర్ధిస్తున్న ఆయనపై చట్టపరమైన చర్య తీసుకోవాలని కోరారు. గిరీష్ కర్నాడ్‌పై హైకోర్టు న్యాయవాది ఎన్పీ అమృతేశ్ విధానసౌదా పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ నిషేధానికి గురైన సంస్థ బ్యానర్‌ను ఎవరైనా ఎలా ధరిస్తారు అని ఆయన ప్రశ్నించారు. గిరీష్ కర్నాడ్, అతని అనుచరులకు మావోయిస్టు సంబంధాలున్నారని ఆరోపించారు. ఈ ప్లకార్డును ధరించడం ద్వారా కర్నాడ్ నక్సలైట్ల హింసాత్మక కార్యకలాపాలను ప్రచారం చేశారని, అందుకు ఆయనను అరెస్ట్ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్బన్ నక్సల్స్ దేశంపై తిరుగుబాటు చేయాలని ప్రచారం చేస్తున్నారన్నారు. కర్నాడ్‌కు మద్దతుగా ప్రకాశ్ రాజ్, స్వామి అగ్నివేష్, జిగ్నేష్ మేవానీ, కన్హయ కుమార్ కూడా ఉన్నారనీ, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. నక్సల్స్‌తో సంబంధాలతోపాటు భీమా కోరెగావ్ కేసులో గిరీష్‌కు ప్రమేయం ఉందని, ఆయనను అరెస్ట్ చేసి విచారణ చేపట్టాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ ఫిర్యాదుపై గిరీష్ కర్నాడ్ స్పందించారు. ‘ప్రజాస్వామ్య దేశంలో నివసిస్తున్నాం. కేసు దాఖలు చేసే హక్కు అతనికి ఉంది. అలాగే తాననుకున్నది స్వేచ్ఛగా పాటించే హక్కు తనకూ వుంద’ని చెప్పారు. న్యాయాన్యాయాలను చట్టం చూసుకుంటుందని వ్యాఖ్యానించారు. -
మా నాన్నకు జీతం పెంచండి
విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు ‘కరెంటోళ్ల దీక్షలు’ పేరుతో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమం సోమవారం కూడా కొనసాగింది. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల పిల్లలు, కుటుంబసభ్యులు కూడా ఈ దీక్షల్లో పాల్గొన్నారు. ‘మా నాన్నకు జీతం పెంచండి’ అని రాసిన ప్లకార్డులతో చిన్నారులు ఆందోళనలో పాల్గొనటం గమనార్హం. ఎస్వీఎన్ కాలనీ(గుంటూరు) : న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారానికి 14వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెలో భాగంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు కలెక్టరేట్ రోడ్డులో రహదారిపై బైఠాయించి తమ నిరసనను తెలిపారు. ధర్నా శిబిరంలో భార్యా, పిల్లలతో కలిసి కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఆర్వీ నరసింహారావు మాట్లాడుతూ 14 రోజులుగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తున్నా యాజమాన్యాలుగాని, ప్రభుత్వంగాని స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఈ క్రమంలో ఈనెల 7వ తేదీన విజయవాడలోని విద్యుత్ సౌధ ముట్టడి చేపడతామని హెచ్చరించారు. స్పందన రాకుంటే 10న రహదారుల దిగ్బంధం, 12న అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్‌కు కార్యాచరణ సిద్ధం చేసినట్లు చెప్పారు. సీఐటీయూ నాయకులు పోపూరి సుబ్బారావు, హుస్సేన్‌వలి, కాంగ్రెస్ నేత వినయ్‌కుమార్, సీపీఎం జిల్లా నాయకులు పాశం రామారావు, ఓబీసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి, యూనియన్ నేతలు శివకుమారి, షకీలా పాల్గొన్నారు. -
''లీవ్ టీడీపీ, ఓన్లీ బీజేపీ''
-
టీడీపీని వదిలేద్దాం... బీజేపీని రక్షించుకుందాం
- అమిత్ షా ముందు నినదించిన పార్టీ బూత్ స్థాయి నేతలు - తమకు బీజేపీ ముఖ్యమంత్రి కావాలంటూ ప్లకార్డుల ప్రదర్శన సాక్షి, అమరావతి: టీడీపీని వదిలించుకుందాం... బీజేపీని రక్షించుకుందాం, మాకు బీజేపీ ముఖ్యమంత్రి కావాలి.. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నాయకత్వంలో పార్టీ బూత్ కమిటీ నేతల మహా సమ్మేళనంలో వినిపించిన నినాదాలు, కనిపించిన ప్లకార్డులివీ.. విజయవాడలో గురువారం కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటికేì కొందరు నేతలు టీడీపీతో పొత్తుపై నిరసన వ్యక్తం చేశారు. లీవ్ టీడీపీ(తెలుగుదేశం పార్టీని వదిలించుకుందాం).. సేవ్ బీజేపీ(భారతీయ జనతా పార్టీని రక్షించుకుందాం)... వుయ్ వాంట్ బీజేపీ సీఎం(మాకు బీజేపీ ముఖ్యమంత్రి కావాలి) అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. కొందరు నినాదాలు చేశారు. సాయంత్రం 5.20 గంటల ప్రాంతంలో వేదికపైకి అమిత్ షా చేరుకున్నాక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ప్రసంగించారు. అనంతరం రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రసంగం మొదలు కాగానే సభా వేదిక ముందు ఉన్న బూత్‌స్థాయి నేతలు ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో సభలో ఒక్కసారి కలకలం రేగడంతో సురేశ్ ప్రభు తన ప్రసంగాన్ని కుదించుకున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తున్న నేతలను భద్రతా సిబ్బంది బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. అమిత్ షా తన పక్కనే ఉన్న నేతలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తూ నేతలు ప్లకార్డులు ప్రదర్శించే సమయంలోనే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రసంగం ప్రారంభించారు. ప్లకార్డులు ప్రదర్శించే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూర్చోవాలని చెప్పారు. దీంతో పెద్ద సంఖ్యలో నేతలు లేచి నిలబడి చేతులు అడ్డంగా ఊపుతూ కేకలు వేస్తూ నిరసన వ్యక్తం చేశారు. -
''లీవ్ టీడీపీ, ఓన్లీ బీజేపీ''
-
అమిత్ షా సభలో గందరగోళం
-
పర్యావరణాన్ని సంరక్షించాలి
ఏయూక్యాంపస్: పర్యావరణ సంరక్షణ తక్షణ కర్తవ్యమని ఏయూ పర్యావరణ శాస్త్ర విభాగాధిపతి ఆచార్య టి.భైరాగి రెడ్డి అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ సంరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు. విభాగ విద్యార్థులు పర్యావరణ సంరక్షణ ఆవశ్యకతను తెలియజేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం ప్లకార్డులతో అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణకు అవలంభించాల్సిన చర్యలను పోస్ట్‌కార్డుల రూపంలో వర్సిటీ ఉపకులపతికి పంపారు. ప్లాస్టిక్ రహితంగా వర్సిటీని ఉంచాలని, కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని వీటిలో పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయడం అవసరమని ఆచార్య భైరాగి రెడ్డి అన్నారు. ప్రజలను చైతన్యవంతం చేయడం వలన పర్యావరణ స్పహ కలిగించాలన్నారు. ప్రతీ విద్యార్థి పర్యావరణ చైతన్యంతో మెలగాలన్నారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే ఎదురయ్యే దుష్పరిణామాలను వివరించారు. ప్రతీ వ్యక్తి పర్యావరణ హితంగా మెలగాలన్నారు. విద్యార్థులు ఆలోచింపజేసే విధంగా నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. కార్యక్రమంలో విభాగ పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పింఛన్ ఇయ్యుండ్రి బాంచన్
దండేపల్లి : అర్హులైనోల్లందరికీ పింఛన్ ఇయ్యుండ్రి బాంచన్.. అంటూ దరఖాస్తుదారులు వేడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన పింఛన్‌రాని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు దండేపల్లిలో భారీ ఎత్తున ఆందోళన చేశారు. స్థానిక పంచాయతీ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ మూడు గంటల పాటు రాస్తారోకో చేశారు. ముఖ్యమంత్రి తీరుపై మండిపడ్డారు. ఆందోళన విరమించాలని కోరేందుకు వచ్చిన అధికారుల కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డారు. పించన్ ఇప్పియ్యాలని వేడుకున్నారు. ఆందోళనలో పాల్గొన్న ఒకరిద్దరు వృద్ధులు సొమ్మసిల్లిపోయారు. ఉన్నతాధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని భీష్మించుకున్నారు. ఎంత చెప్పినా వినిపించుకోకుండా మొండికేశారు. దండేపల్లి, లక్సెట్టిపేట ఎస్సైలు మోహన్‌బాబు, ఆకుల అశోక్ వచ్చి తహశీల్దార్ ముబిన్ హైమద్, ఎంపీడీవో శ్రీనివాస్, ఈవోపీఆర్డీ శివకృష్ణతో కలిసి ఆందోళనకారులకు నచ్చజెప్పారు. ఈ నెల 30న అర్హులందరికీ ఫించన్లు వస్తాయని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్ అంతరాయాన్ని తొలగించారు. -
‘మేము సైతం..’ ట్రాఫిక్‌పై హిజ్రాల అవగాహన
కొరుక్కుపేట: నిత్యం రోడ్లపై మరణమృదంగ ధ్వనులు వినిపిస్తున్నాయి. విపరీతమైన రద్దీ, నిబంధనలు పాటించని వాహనచోదకులు, ఎవరికి వారు తొందరగా వెళ్లాలనే తొందర ఇవన్నీ ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా ఆచరణలో అది కనిపించడం లేదు. రెండు, మూడు నెలలుగా ఎన్జీవోలు, విద్యార్థులు రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వీరి బాటలోనే మేము సైతం అంటూ నగరానికి చెందిన కొందరు హిజ్రాలు గళం విప్పారు. అన్నానగర్ చర్చి వద్ద సోమవారం వారు జాగ్రత్తలు పాటించండి.. ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు.. తొందరపాటు పనికిరాదంటూ హితవు పలికారు. ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్లకార్డులు ప్రదర్శించారు. కరపత్రాలు పంచారు. -
అముదాలవలసలో బాలకృష్ణకు చుక్కెదురు