ఒక వృద్ధుడికి తాను బతికే ఉన్నానని నిరూపించకోవాల్సిన దుస్థితి వచ్చింది. అందుకోసం ఏకంగా పెళ్లికొడుకులా రథంలో ఊరేగుతూ వచ్చి తాను బతికే ఉన్నానని చెప్పుకొంటున్నాడు. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే....హర్యానాలోని 102 ఏళ్ల వృద్ధుడు ప్రభ్తత్వ రికార్డులో చనిపోయినట్లు ఉంది. అతను రోహ్‌తక్ జిల్లాలోని గాంధ్రా గ్రామానికి చెందిన దులిచంద్ అనే వృద్ధుడు. ఆ వృద్ధుడు ప్లకార్డులు పట్టుకుని, మెడలో కరెన్సీ దండను ధరించి మానసరోవర్ నుంచి కెనాల్ రెస్ట్ హౌస్‌కి రథంపై ఊరేగుతూ....బతికే ఉన్నానని చెబుతున్నాడు. తాను మార్చిలో చివరిసారిగా వృద్ధాప్య ఫించన్‌ను తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ రికార్డుల్లో చనిపోయి ఉండటంతో తన ఫెన్షన్ ఆగిపోయిందని చెప్పుకొచ్చారు.
తన మనవడు ఈ విషయమై ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదులు చేసిన ప్రయోజనం కనిపించలేదని వాపోయాడు. ఆ వృద్ధుడు తాను బతికే ఉన్నానంటూ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లతో సహా ఇతర గుర్తింపు పత్రాలను చూపిస్తున్నాడు. అతను హర్యానా ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్) మాజీ అధ్యక్షుడు నవీన్ జైహింద్‌ని కలిని తన గోడును వినిపించారు.
ఆయన ఆ వృద్ధుడికి తిరిగి ఫెన్షన్ పొందేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇలా వృద్ధుల ఫించన్‌ని నిలిపి ఇబ్బందులకు గురి చేయడం దురదృష్టకరమని అన్నారు. తాను సీఎంకి ఈ విషయమై ఫిర్యాదు చేసినప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. అంతేకాదు నవీన్ జైహింద్ ఆ వృద్ధుడిని తీసుకుని బీజేపీ నాయకుడు మనీష గ్రోవర్‌ని కలిసి అతనికి రావాల్సిన ఫించన్‌ని ఇప్పించవలిసిందిగా కోరారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.
हरियाणवी फिल्म, थारा फूफा जिन्दा है
— Puspendra Singh Rajput हरियाणा अब तक (@psrajput75) September 8, 2022
अभिनेता -दुलीचंद ज़िंदा ( 102 वर्षीय )
निर्माता निर्देशक, नवीन जयहिंद
गीत संगीत, बेरोजगार बैंड पार्टी रोहतक
कहानी-हरियाणा सरकार के कुछ अधिकारी जिन्होंने ज़िंदा दुलीचंद को मृत बता काट दी बुढ़ापा पेंशन @NaveenJaihind @DeependerSHooda pic.twitter.com/EtZVA4qvMh
(చదవండి: వాసనను బట్టి వ్యాధిని చెప్పేస్తున్న వైద్యురాలు... ఆశ్చర్యపోతున్న వైద్యులు)
Comments
Please login to add a commentAdd a comment