చిచ్చర పిడుగు!..తొమ్మిదేళ్లకే ఏకంగా 75 కిలోలు..! | Viral Video: 9 Year Old Girl From Haryana Deadlifts 75kg | Sakshi
Sakshi News home page

చిచ్చర పిడుగు!..తొమ్మిది ఏళ్లకే ఏకంగా 75 కిలోలు..!

Apr 9 2024 6:51 PM | Updated on Apr 9 2024 9:44 PM

Viral Video: 9 Year Old Girl From Haryana Deadlifts 75kg - Sakshi

చిన్నారులు తమలో దాగున్న అసాధారణ ప్రతిభను బయటపెట్టి అందర్నీ మంత్ర ముగ్దుల్ని చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు ఎన్నో చూశాం. అవన్నీ ఏదో వాళ్ల పెద్దొళ్ల ట్రైనింగ్‌ లేదా వాళ్ల ఆసక్తి కొద్ది త్వరితగతిన నేర్చుకున్నవి. అయినా ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏదీ లేదన్న రీతిలో అంత పసిమొగలు కూడా అలవోకగా నేర్చుకోవడం జరుగుతుంది. అదే బరువుల ఎత్తడం లాంటి వాటి వద్దకు వస్తే..అంత ఈజీ కాదు. కానీ ఈ చిచ్చర పిడుగు రామయణంలో సీత శివధనుస్సు ఎత్తినట్లుగా ఈజీగా ఎన్ని కిలోలు ఎత్తిపడేసిందో తెలుసా..!

అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఆ వీడియోలో 9 ఏళ్ల చిన్నారి జిమ్‌లో ఏకంగా 75 ​కిలోల బరువుని అలవోకగా ఎత్తి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ చిన్నారి హర్యానాకు చెందిన అర్షియా గోస్వామి. ఈ వీడియోని చూసిన ఫిట్‌నెస్‌ ఔత్సాహికులు, నిపుణులు, నెటిజన్లు ఆమెను వావ్‌ నువ్వు గ్రేట్‌ రా అంటూ  ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. ఇక ఆర్షియా వెయిట్‌ లిఫ్టింగ్‌ అంటే ఆమెకు అత్యంత ఇష్టమట.

అంతేగాదు చిన్న వయసులోనే అధిక బరువుల లిఫ్ట్‌ చేసిన పిన్న వయస్కురాలిగా ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులోకెక్కింది. అంతేగాదు ఆరేళ్ల ప్రాయంలోనే ఏకంగా 45 కిలోల బరువు ఎత్తి అందర్నీ ఆశ్చర్యపరిచిందంటా. నిజంగా ఆ చిట్టి తల్లి గ్రేట్‌ కదూ. మిగతా రంగాలన్ని ఏదో ప్రాక్టీస్‌ చేసి సాధించేయొచ్చు కానీ ఇది తనకు మించిన బరువు ఎత్తడం అది కూడా అంత చిన్న వయసులో అంటే..మాములు విషయం కాదు కదా..!

(చదవండి: కళకు వయసుతో సంబంధం లేదంటే ఇదే! నలభైలలో ఆ మదర్స్‌..!)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement