Video: జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిన యువకుడు | Video: Man Dies of heart attack while exercising in gym At Maharashtra | Sakshi
Sakshi News home page

Video: జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిన యువకుడు

Published Mon, Jul 22 2024 7:58 PM | Last Updated on Mon, Jul 22 2024 8:23 PM

Video: Man Dies of heart attack while exercising in gym At Maharashtra

గత కొన్నేళ్లుగా యువతలో గుండెపోటు కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వృద్ధాప్యంలో ఎదురయ్యే సమస్యలు నేడు యువకులను పీడిస్తున్నాయి.  ముఖ్యంగా డ్యాన్స్ చేసేటప్పుడు,  జిమ్‌లో గుండెపోటుకు గురవడం పెరుగుతోంది. ప్రస్తుత జీవన విధానంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరిగిపోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ఆకస్మిక గుండెపోటు ఒక రకమైన సైలెంట్ హార్ట్ ఎటాక్ అని వైద్యులు చెబుతున్నారు.

తాజాగా మహారాష్ట్రలో ఓ వ్యక్తి జిమ్‌ చేస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. జిమ్‌లోని సీసీటీవీ ఫుటేజీలో ఈ ఘటన రికార్డు అయింది. ఇందులో కన్వల్‌జిత్ సింగ్ బగ్గా అనే వ్యక్తి ఇతరులతో కలిసి కొన్ని వ్యాయామాలు చేస్తున్నాడు. అయితే అలా చేస్తూ కన్వల్‌ జిత్‌ కాస్త అసౌకర్యానికి గురయ్యాడు.మిగిలిన వాళ్లు వ్యాయామాన్ని కొనసాగిస్తూ ఉండగా.. అతడుగా నిదానంగా పక్కకు ఒరుగుతూ కనిపించాడు.

క్షణాల్లోనే బగ్గా ఓ పిల్లర్‌కు ఆనుకొని అక్కడే కుప్పకూలిపోయాడు. కిందపడిపోవడం చూసిన అక్కడున్నవారు అతడి వద్దకు పరిగెత్తుకుని వెళ్లారు. అతనికి ఏమైందో జరిగిందో తెలియక వాళ్లంతా అటూ ఇటు పరిగెత్తడం వీడియోలో రికార్డు అయింది. అయితే బాధితుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.  ఛత్రపతి సంభాజీనగర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement