Old-age pension
-
అయ్యా! బతికే ఉన్నాను అని వేడుకుంటున్న వృద్ధుడు: వీడియో వైరల్
ఒక వృద్ధుడికి తాను బతికే ఉన్నానని నిరూపించకోవాల్సిన దుస్థితి వచ్చింది. అందుకోసం ఏకంగా పెళ్లికొడుకులా రథంలో ఊరేగుతూ వచ్చి తాను బతికే ఉన్నానని చెప్పుకొంటున్నాడు. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే....హర్యానాలోని 102 ఏళ్ల వృద్ధుడు ప్రభ్తత్వ రికార్డులో చనిపోయినట్లు ఉంది. అతను రోహ్తక్ జిల్లాలోని గాంధ్రా గ్రామానికి చెందిన దులిచంద్ అనే వృద్ధుడు. ఆ వృద్ధుడు ప్లకార్డులు పట్టుకుని, మెడలో కరెన్సీ దండను ధరించి మానసరోవర్ నుంచి కెనాల్ రెస్ట్ హౌస్‌కి రథంపై ఊరేగుతూ....బతికే ఉన్నానని చెబుతున్నాడు. తాను మార్చిలో చివరిసారిగా వృద్ధాప్య ఫించన్‌ను తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ రికార్డుల్లో చనిపోయి ఉండటంతో తన ఫెన్షన్ ఆగిపోయిందని చెప్పుకొచ్చారు. తన మనవడు ఈ విషయమై ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదులు చేసిన ప్రయోజనం కనిపించలేదని వాపోయాడు. ఆ వృద్ధుడు తాను బతికే ఉన్నానంటూ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్లతో సహా ఇతర గుర్తింపు పత్రాలను చూపిస్తున్నాడు. అతను హర్యానా ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) మాజీ అధ్యక్షుడు నవీన్ జైహింద్ని కలిని తన గోడును వినిపించారు. ఆయన ఆ వృద్ధుడికి తిరిగి ఫెన్షన్ పొందేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇలా వృద్ధుల ఫించన్‌ని నిలిపి ఇబ్బందులకు గురి చేయడం దురదృష్టకరమని అన్నారు. తాను సీఎంకి ఈ విషయమై ఫిర్యాదు చేసినప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. అంతేకాదు నవీన్ జైహింద్ ఆ వృద్ధుడిని తీసుకుని బీజేపీ నాయకుడు మనీష గ్రోవర్ని కలిసి అతనికి రావాల్సిన ఫించన్‌ని ఇప్పించవలిసిందిగా కోరారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. हरियाणवी फिल्म, थारा फूफा जिन्दा है अभिनेता -दुलीचंद ज़िंदा ( 102 वर्षीय ) निर्माता निर्देशक, नवीन जयहिंद गीत संगीत, बेरोजगार बैंड पार्टी रोहतक कहानी-हरियाणा सरकार के कुछ अधिकारी जिन्होंने ज़िंदा दुलीचंद को मृत बता काट दी बुढ़ापा पेंशन @NaveenJaihind @DeependerSHooda pic.twitter.com/EtZVA4qvMh — Puspendra Singh Rajput हरियाणा अब तक (@psrajput75) September 8, 2022 (చదవండి: వాసనను బట్టి వ్యాధిని చెప్పేస్తున్న వైద్యురాలు... ఆశ్చర్యపోతున్న వైద్యులు) -
పింఛన్ల పునరుద్ధరణకు హైకోర్టు ఆదేశం
ఎచ్చెర్ల : తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రరుుంచిన బాధితులకు న్యాయం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... తమ పింఛన్లను జన్మభూమి- మా ఊరు కమిటీలు అకారణంగా తొలగించాయని, అర్హత ఉన్నా రాజకీయ కక్ష నేపథ్యంలో తమ జీవనాధారాన్ని దెబ్బ తీశారని ఫరీదుపేట గ్రామానికి చెందిన ఆరుగురు హైకోర్టును ఆశ్రయించారు. తాము జనవరి 21న కోర్టును ఆశ్రరుుంచగా అనుకూలంగా కోర్టు ఉత్తర్వుల ప్రతి బుధవారం అందిందని వారు చెప్పారు. తమలో పైడి అప్పారావు, కొత్తకోట చెల్లన్నలకు వృద్ధాప్య పింఛన్, కొత్తకోట పద్మావతికి వికలాంగ పింఛన్ పునరుద్దరించాలని ఉత్వర్వుల్లో పేర్కొన్నట్టు తెలిపారు. కొత్తకోట అమ్మాయమ్మ, కొత్తకోట సూర్యనారాయణ(అర్జెంట్ నోటీస్)లకు ఎందుకు కొత్త పింఛన్లు అందజేయడం లేదో చెప్పాలని, సూర లక్ష్మీనర్సమ్మ అర్హతను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదో చెప్పాలని కోర్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు చెప్పారు. బాధితులు ఎంపీడీఓ, గ్రామ, మండల జన్మభూమి కమిటీలు, గ్రామ కార్యదర్శి, డీఆర్డీఏ పీడీ, కలెక్టర్, రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ కార్యనిర్వహణ అధికారులను పార్టీలుగా చేర్చారు. -
కలెక్టర్‌గారు ‘కరుణ’ చూపరూ..
ములుగు : కూలీ పనులు చేసేందుకు సత్తువలేని తనకు వృద్ధాప్య పింఛన్ అందించి ఆదుకోవాలని మండల కేంద్రానికి చెందిన బత్తిని సంజీవులు కలెక్టర్‌ను కోరుతున్నారు. వివరాలిలా ఉన్నారుు. మం డల కేంద్రంలోని కోర్టు ఎదురుగా నివాసముం టున్న సంజీవులకు 65 ఏళ్ల వయస్సు ఉంటుంది. అరుుతే అతడికి ఇద్దరు కుమారులు ఉండగా.. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో వారు హైదరాబాద్ పట్టణానికి కొన్ని నెలల క్రితం వలస వెళ్లారు. కాగా, భార్య మూడేళ్ల క్రితం చనిపోరుుంది. అరుుతే ప్రస్తుతం కొడుకులు దగ్గర లేకపోవడంతో సంజీవులు కోర్టు ఎదురుగా ఉన్న తన ఇంట్లో ఒం టరిగా ఉంటున్నాడు. కాగా, నిరుపేద కుటుంబాని కి చెందిన సంజీవులకు ప్రభుత్వ నిభందనల ప్రకారం వృద్ధాప్య పింఛన్, రేషన్ సరుకులు అం దాల్సి ఉంది. అరుుతే అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటివరకు ఆయనకు ఎలాంటి పథకాలు అందడంలేదు. పింఛన్, ఆహార భద్రత కార్డు కోసం ఇప్పటివరకు మూడుసార్లు దరఖాస్తు చేస్తుకున్న తిరస్కరణకు గురయ్యూయని సంజీవులు ‘సాక్షి’ ఎదుట వాపోయూరు. కాగా, ఆకలిమంటను తట్టుకోలేక, అయిన వాళ్లు అందుబాటులో లేక ఏంచేయాలో తోచని స్థితిలో పట్టణంలోని పలు ఇళ్లల్లో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నట్లు ఆయన కన్నీటి పర్యంతమయ్యూడు. కలెక్టర్ ప్రత్యేక చొరవచూపి తనకు పిం ఛన్, ఆహార భద్రత కార్డులు అందించేందుకు కృషి చేయూలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నాడు. -
బేషరతుగా వృద్ధాప్య ఫించను
తెలంగాణ రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్లు రద్దుకావడంతోనో, మం జూరు కాలేదనే బెంగతోనో వృద్ధులు పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారని వార్తలు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏమాత్రం జాగు చేయ కుండా, కనీసం 58 ఏళ్లు పైబడిన వృద్ధులందరకు బేషరతుగా వృద్ధాప్య పింఛన్లను మంజూరు చేయాలి. ఒక ఇంట్లో ఒకరికంటే ఎక్కువ పెన్షన్లు ఉండరాదనే షరతును తొలగించాలి. వృద్ధులు, వితంతువులు ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. వీరందరికీ బేషరతుగా పెన్షన్లు ఇవ్వాలి. అలాగే అప్పుల భారంతో మరణించిన రైతుల విషయంలో ఆయా ప్రాంతాల్లో అఖిలపక్ష నాయకుల ద్వారా సమాచారం సేకరించి వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం కనీసం రూ.3 లక్షలకు తగ్గకుండా సహాయం చేయాలి. ప్రభుత్వ హామీల ను, వాగ్దానాలను నెరవేర్చడానికి ప్రభుత్వ స్థలాలను, భూములను అమ్మాలనే తలంపును విరమించుకోవాలి. తాత్కాలిక అవసరాల కోసం స్థిరాస్తులను అమ్మడం అసమంజసం. రాబోయే కాలాల్లో భూసేకరణ అసాధ్యం కావచ్చు. నిధుల సేకరణ కోసం ఇతర మార్గాలను అన్వేషించాలి. ప్రజలను భారీగా పొదుపు చేసే విధానాలను చేపట్టి వారిని ప్రోత్సహించి భాగస్వాములను చేయాలి. ఆస్తులను తెగనమ్మి అభివృద్ధి చేయడాన్ని ప్రజలు హర్షించరు. - కొండవీటి దామోదర్ రెడ్డి, నల్లగొండ -
బతికుండగానే చంపేశారు !
సర్వే సిబ్బంది వింతలీలలు వీఆర్‌పురం: ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధుడి పేరు పుల్లెందుల పుల్లయ్య. వయస్సు 80 ఏళ్లు. వీఆర్‌పురం మండలం వడ్డిగూడెం గ్రామం. ఇతడికి కొన్ని సంవత్సరాలుగా నెలకు రూ.200 వృద్ధాప్య పింఛన్ వస్తోంది. ఈ పింఛన్‌ను నెలకు రూ.వెయ్యికి పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించగానే తనకు ఐదు రెట్లు అదనంగా డబ్బులొస్తాయని సంతోషించాడు. అయితే సర్వే అధికారుల నిర్వాకంతో అతడి ఆశలన్నీ అడియాశలయ్యాయి. నాలుగు రోజుల క్రితం గ్రామానికి వచ్చిన పింఛన్ సిబ్బందికి తన కార్డు చూపించి పెన్షన్ ఇవ్వమని కోరగా.. ‘నీవు చనిపోయినట్లు జాబితాలో ఉందని, అందుకే నీకు పింఛన్ మంజూరు కాలేద’ని సమాధానం ఇవ్వడంతో పుల్లయ్య కంగుతిన్నాడు. తాను పేదవాడినని, ఆదుకునేందుకు కూడా ఎవరూ లేరని, ఎలాగైనా తన పింఛన్ ఇప్పించాలని కోరుతున్నాడు. దీనిపై ఎంపీడీవో లక్ష్మీభాయిని వివరణ కోరగా, సర్వే జాబితాలో పుల్లయ్య చనిపోయినట్లుగా కోడ్ 11 వేసి ఉందని, ఆ జాబితా ఆధారంగానే లబ్ధిదారుల పేర్లు అప్లోడ్ చేస్తామని చెప్పారు. పుల్లయ్య బతికే ఉన్నట్లు ప్రస్తుత విచారణలో తేలిందని, అతడికి పింఛన్ మంజూరయ్యేలా ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. -
వేంపల్లిలో వృద్ధాప్య పింఛన్ డబ్బు మాయం
కడప: జిల్లాలోని వేంపల్లి మండలం వీఎన్‌పల్లిలో గురువారం వృద్ధాప్య పింఛన్ డబ్బు మాయమైంది. వీఎన్పల్లికి చెందిన సునీల్ కుమార్ రెడ్డి నుంచి డబ్బు మాయమైనట్టు తెలిసింది. వీఎన్‌పల్లి నుంచి వేంపల్లికి ఆర్టీసీ బస్సులో వస్తుండగా డబ్బుల బ్యాగ్ మిస్ అయింది. దాంతో ఆయన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన వేంపల్లి పోలీసులు సిబ్బందిపై అనుమానంతో వారిని విచారిస్తున్నట్టు సమాచారం. -
పండుటాకులకు ‘అసరా’
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పండుటాకులకు ‘ఆసరా’గా, వికలాంగులకు ఊతకర్రగా నిలిచేందుకు టీఆర్ఎస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక భద్రత పింఛన్ల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. వృద్ధులు, వితంతవులు, గీత, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులకు రూ.1000, వికలాంగులకు రూ. 1,500 చొప్పున శనివారం నుంచి ‘ఆసరా’ పథకం కింద పింఛన్లు అందించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. లబ్ధిదారుల జాబితా ఇప్పటికే తయారు చేసిన జిల్లా అధికారులు ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4.10 లక్షల పింఛన్ దరఖాస్తులు రాగా, వీటిని అధికారులు వడబోసి 2.85 లక్షల మంది అర్హులను తేల్చారు. రాత్రి పొద్దుపోయాక ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినా... తెల్లవారగానే పింఛన్ల పంపిణీ చేసేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంది. తాజాగా ప్రభుత్వం మరికొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే పింఛన్ల పంపిణీ వాయిదా పడవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెరగనున్న దరఖాస్తులు ఆహార భద్రత, పింఛన్ దరఖాస్తుల పునఃపరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. అర్హతలకు సంబంధించి గతంలో పేర్కొన్న నిబంధనలు కాకుండా పలు మార్పులు చేసింది. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ.1.5 లక్షలు, ఇక పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు పెంచింది. అదే విధంగా వ్యవసాయ భూమి విస్తీర్ణాన్ని గ్రామాల్లో 3.75 ఎకరాల్లోపు మాగాణి, ఏడు ఎకరాల్లోపు మెట్టభూమి ఉన్న వాళ్లందరినీ అర్హులుగా గుర్తించాలని వెల్లడించింది. అయితే 65 ఏళ్లుగా ఉన్న గరిష్ట వయోపరిమితిలో ఎలాంటి సడలింపు లేకపోవడం, రేషన్‌కార్డు నిబంధనల్లో కూడా స్వల్పంగా మాత్రమే మార్పులుండడంతో దరఖాస్తులు ఓ మోస్తారుగా పెరిగే అవకాశం ఉంది. కొత్త మార్గదర్శకాల నేపథ్యంలో అదనంగా మరో 50 వేల దరఖాస్తులు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత పరిశీలనలో అర్హత కోల్పోయిన వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకునేలా సర్కార్ తన తాజా ఆదేశాల్లో వెసులుబాటు కల్పించింది. ఆహార భద్రత, పింఛన్ల కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు తహశీల్దారును సంప్రదించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు వచ్చిన దరఖాస్తులను ప్రత్యేక అధికారులతో క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన తర్వాత అర్హులను తేలుస్తారు. పింఛన్ల పంపిణీకి తొలి ప్రాధాన్యత కొంతకాలంగా పింఛన్ దరఖాస్తుల విచారణ చేసిన అధికారులు అర్హత సాధించిన దరఖాస్తులను 4, 5 తేదీల్లో కంప్యూటరీక రించారు. 6,7 తేదీల్లో అర్హులైన వారికి కార్డులు ముద్రించారు. శనివారం నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభించేందుకుజాబితా సిద్ధం చేశారు. తహశీల్దారు, ఎంపీడీఓ, ఈఓఆర్డీ, ఏఈఓలకు ఒక్కొక్కరికి మూడు గ్రామాల చొప్పున బాధ్యతలు అప్పగించనున్నారు. మొదటి నెల పింఛన్లు నగదు రూపంలో చెల్లిస్తున్నందున ప్రత్యేక అధికారుల సమక్షంలో పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఆహార భద్రత కార్డులకు మరింత సమయం ఆహార భద్రత కార్డులు కోసం జిల్లా వ్యాప్తంగా 8 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిని ప్రస్తుతానికి రెవెన్యూ అధికారులు విచారిస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నాటికి విచారణ పూర్తి కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అందువల్లే ఆహార భద్రత కార్డుల జారీకి మరింత సమయం పట్టనుంది. కుటుంబంలోని సభ్యుల ఆధారంగా ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయాలని ఇప్పటికే సర్కార్ నిర్ణయించింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికిచ్చే కార్డులను అధికారులు గులాబి రంగులో ముద్రించనున్నారు. కొత్త కార్డులు డిసెంబర్లో చివరి వారంలో లేదా జనవరి మొదటి వారంలోగా జారీ కానున్నాయి. ప్రస్తుతానికి అధికార యంత్రాంగం పింఛన్ల పంపిణీ పైనే దృష్టి సారించింది. అందువల్లఈ దరఖాస్తుల పరిశీలనకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. నిబంధనలు సడలించిన నేపథ్యంలో అదనంగా 50 వేల వరకు కార్డుల దరఖాస్తుల పెరిగే అవకాశం ఉంది. కార్డులు గుర్తులు వృద్ధాప్య పింఛన్లు, గీత కార్మికులు, చేనేత కార్మికులకు గులాబి రంగు కార్డు వికలాంగులకు ఆకుపచ్చ రంగు కార్డు వితంతువులకు నీలిరంగు కార్డు గీతకార్మికులకు ఆహారభద్రత కార్డులు(బీపీఎల్ కుటుంబాలకు) గులాబి రంగు కార్డు -
రోశమ్మకు పింఛన్ పునరుద్ధరణ
కలిగిరి: సారా వ్యతిరేక ఉద్యమ నాయకురాలు దూబగుంట రోశమ్మ(80)కు వృద్ధాప్య పింఛన్‌ను అధికారులు పునరుద్ధరించారు. ఈమె పింఛన్ రద్దుపై ‘సాక్షి’ ప్రధాన సంచికలో గురువారం కథనం ప్రచురితం కావడం తో అధికారులు వెంటనే స్పందించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ మండల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలిగిరి ఎంపీడీఓ వెంకటశేషయ్య రెవెన్యూ రికార్డులు పరిశీలించారు. రోశమ్మకు 4.35 ఎకరాల పొలం ఉన్నట్లు తేల డంతో వచ్చే నెల నుంచి ఆమెకు పింఛన్ అందుతుందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే అనారోగ్యంతో బాధపడుతున్న రోశమ్మ డయాలసిస్ చేయించుకునేందుకు నెల్లూరుకు వెళుతూ తహశీల్దార్ కార్యాలయానికి వచ్చారు. మండల అధికారులు ఆమెను పరామర్శించి ఆరోగ్యంపై ఆరా తీశారు. శుక్రవారం జిల్లా పర్యటనకు వస్తు న్న సీఎం చంద్రబాబును కలవనున్నట్లు తెలిపా రు. తనకు పింఛన్ నిలిపేయడంపై స్పందించిన మీడియాకు ఆమె కృతజ్ఞతలు చెప్పారు.