రోశమ్మకు పింఛన్ పునరుద్ధరణ
కలిగిరి: సారా వ్యతిరేక ఉద్యమ నాయకురాలు దూబగుంట రోశమ్మ(80)కు వృద్ధాప్య పింఛన్‌ను అధికారులు పునరుద్ధరించారు. ఈమె పింఛన్ రద్దుపై ‘సాక్షి’ ప్రధాన సంచికలో గురువారం కథనం ప్రచురితం కావడం తో అధికారులు వెంటనే స్పందించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ మండల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలిగిరి ఎంపీడీఓ వెంకటశేషయ్య రెవెన్యూ రికార్డులు పరిశీలించారు. రోశమ్మకు 4.35 ఎకరాల పొలం ఉన్నట్లు తేల డంతో వచ్చే నెల నుంచి ఆమెకు పింఛన్ అందుతుందని అధికారులు తెలిపారు.
ఈ క్రమంలోనే అనారోగ్యంతో బాధపడుతున్న రోశమ్మ డయాలసిస్ చేయించుకునేందుకు నెల్లూరుకు వెళుతూ తహశీల్దార్ కార్యాలయానికి వచ్చారు. మండల అధికారులు ఆమెను పరామర్శించి ఆరోగ్యంపై ఆరా తీశారు. శుక్రవారం జిల్లా పర్యటనకు వస్తు న్న సీఎం చంద్రబాబును కలవనున్నట్లు తెలిపా రు. తనకు పింఛన్ నిలిపేయడంపై స్పందించిన మీడియాకు ఆమె కృతజ్ఞతలు చెప్పారు.