కలెక్టర్‌గారు ‘కరుణ’ చూపరూ..
ములుగు : కూలీ పనులు చేసేందుకు సత్తువలేని తనకు వృద్ధాప్య పింఛన్ అందించి ఆదుకోవాలని మండల కేంద్రానికి చెందిన బత్తిని సంజీవులు కలెక్టర్‌ను కోరుతున్నారు. వివరాలిలా ఉన్నారుు. మం డల కేంద్రంలోని కోర్టు ఎదురుగా నివాసముం టున్న సంజీవులకు 65 ఏళ్ల వయస్సు ఉంటుంది. అరుుతే అతడికి ఇద్దరు కుమారులు ఉండగా.. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో వారు హైదరాబాద్ పట్టణానికి కొన్ని నెలల క్రితం వలస వెళ్లారు. కాగా, భార్య మూడేళ్ల క్రితం చనిపోరుుంది. అరుుతే ప్రస్తుతం కొడుకులు దగ్గర లేకపోవడంతో సంజీవులు కోర్టు ఎదురుగా ఉన్న తన ఇంట్లో ఒం టరిగా ఉంటున్నాడు. కాగా, నిరుపేద కుటుంబాని కి చెందిన సంజీవులకు ప్రభుత్వ నిభందనల ప్రకారం వృద్ధాప్య పింఛన్, రేషన్ సరుకులు అం దాల్సి ఉంది.
అరుుతే అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటివరకు ఆయనకు ఎలాంటి పథకాలు అందడంలేదు. పింఛన్, ఆహార భద్రత కార్డు కోసం ఇప్పటివరకు మూడుసార్లు దరఖాస్తు చేస్తుకున్న తిరస్కరణకు గురయ్యూయని సంజీవులు ‘సాక్షి’ ఎదుట వాపోయూరు. కాగా, ఆకలిమంటను తట్టుకోలేక, అయిన వాళ్లు అందుబాటులో లేక ఏంచేయాలో తోచని స్థితిలో పట్టణంలోని పలు ఇళ్లల్లో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నట్లు ఆయన కన్నీటి పర్యంతమయ్యూడు. కలెక్టర్ ప్రత్యేక చొరవచూపి తనకు పిం ఛన్, ఆహార భద్రత కార్డులు అందించేందుకు కృషి చేయూలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నాడు.