సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా నగరానికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో) పాత్రపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు విచారణకు హాజరుకావాలని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి ఎం.విజయ్మాదిగకు సిట్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన విచారణాధికారి ముందు శనివారం హాజరయ్యా రు. కేసులోని నిందితులతో ఉన్న సంబంధాలపై అధికారులు ఆయనను ప్రశ్నించారు. కేసుతో తన కుగానీ, సంస్థకు గానీ ఎలాంటి సంబంధమూ లేదని దాటవేసినట్లు తెలిసింది. అధికారులు సాంకేతిక ఆధారాలు చూపించడంతో జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయినట్లు సమాచారం. విజయ్.. గతంలో నగరానికి చెందిన ఓ సామాజికవర్గ రిజర్వేషన్ల పోరాట సంస్థకు ఉపాధ్యక్షుడిగా పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు.
ప్రతాప్‌గౌడ్ బ్యాంకు లావాదేవీలపై ఆరా..
అంబర్‌పేటకు చెందిన న్యాయవాది పోగులకొండ ప్రతాప్‌గౌడ్ రెండో రోజూ విచారణకు హాజరయ్యారు. నిందితులు రామచంద్రభారతి, నందుకుమార్‌లతో జరిపిన పలు బ్యాంకు లావాదేవీలపై ప్రతాప్‌ను ప్రశ్నించగా.. ఆయన మౌనం వహించినట్లు తెలిసింది. దీంతో బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ఇతరత్రా సాంకేతిక ఆధారాలను ఆయన ముందు పెట్టగా.. వ్యక్తిగత అవసరాల కోసం ఆయా మొత్తాన్ని వారికి ఇచ్చానని సమాధానమిచి్చనట్లు తెలుస్తోంది. చాలా ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా కాలయాపన చేసినట్లు సమాచారం.
ఇదీ చదవండి: ఆ ‘35’పై టీఆర్‌ఎస్ స్పెషల్ ఫోకస్
Comments
Please login to add a commentAdd a comment