ఫౌండేషన్‌ ద్వారా సచిన్‌ కార్యక్రమాలు | Sachin Tendulkar Supports Tribal Children | Sakshi
Sakshi News home page

ఫౌండేషన్‌ ద్వారా సచిన్‌ కార్యక్రమాలు

Sep 13 2020 9:44 PM | Updated on Sep 13 2020 9:46 PM

Sachin Tendulkar Supports Tribal Children - Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ సృష్టించిన రికార్డులు  మనందరికి తెలిసిందే. క్రికెట్‌ చరిత్రలో ఎన్నో మైలురాళ్లను సచిన్‌ సాధించాడు. కేవలం క్రికెట్‌లోనే కాక ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహించాడు. తాజాగా ప్రముఖ ఎన్‌జీఓ సంస్థ పరివార్‌తో కలిసి ఆర్థికంగా వెనుకబడిన 560 గిరిజన చిన్నారులకు చేయుత ఇవ్వనున్నాడు. ఇప్పటికే మధ్యప్రదేశ్‌లోని సేహోర్‌ జిల్లాల్లో (గ్రామీణ ప్రాంతాలు) సేవా కుటిర్స్‌ను పరివార్‌ సంస్థ నిర్మించింది.

మరోవైపు సేవానియా, బీల్‌పాటి, కాపా తదితర గ్రామాలలో మధ్యాహ్మ భోజనం, ఉచిత విద్యను టెండూల్కర్‌ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాలలో పోషకాహార లోపం, నిరక్షరాస్యత తదితర సమస్యలను పత్రికలో చూసి సచిన్‌ గిరిజన గ్రామాలలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement