విభజనకు వ్యతిరేకంగా గతంలో సమ్మెబాట పట్టి ప్రభుత్వాలను కుదిపేసిన ఉద్యోగులు మళ్లీ ఉద్యమ బాట పట్టారు. రాష్ట్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా
ఎన్జీవోల సమ్మె ప్రారంభం
Published Fri, Feb 7 2014 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: విభజనకు వ్యతిరేకంగా గతంలో సమ్మెబాట పట్టి ప్రభుత్వాలను కుదిపేసిన ఉద్యోగులు మళ్లీ ఉద్యమ బాట పట్టారు. రాష్ట్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా యూపీఏ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవడాన్ని నిరసిస్తూ సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం నుంచి ఎన్జీవోలు సమ్మెలోకి దిగారు. జిల్లాలోని తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాలతో పాటు కలెక్టర్ కార్యాలయంలో సేవలు నిలిచిపోయాయి. జిల్లా కేంద్రంలో పలు ప్రభుత్వ కార్యాలయాలు మూతబడ్డాయి. రెవెన్యూ సిబ్బంది సమ్మెలో ఉండడంతో అన్ని విభాగాల్లో ఖాళీ కుర్చీలు కనిపించాయి.
వివిధ శాఖల్లో విధులకు హాజరైన ఉద్యోగులను బయటకు వెళ్లాలని కోరారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఐసీడీఎస్ శాఖ వీడియో కాన్ఫరెన్స్ జరగనీయకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. కాన్ఫరెన్స్‌కు హాజరైన ఉద్యోగులను బయటకు పంపారు. సమైక్యాంధ్ర సాధ న ప్రతినిధులు ట్రెజరీ కార్యాలయం లో విధులకు హాజరైన సిబ్బందిని బయటకు పంపించారు. డీఆర్‌డీఏ కాంప్లెక్స్‌లోని జిల్లా గ్రామీణాభి వృద్ధి శాఖలో పని చేస్తున్న ఉద్యోగులను బయటకు పంపించారు. బీసీ, ఎస్సీ సంక్షేమ కార్పొరేషన్లు, ప్రణాళిక శాఖ ఉద్యోగులను కూడా బయటకు తీసుకువచ్చి ఉద్యమంలో భాగస్వాములను చేశారు. ముందుగా సమైక్యాంధ్ర సాధన సమితి ఆధ్వర్యంలో ఎన్జీవో హోం నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ప్రధాన ముఖద్వారం వద్ద ధర్నా నిర్వహించారు.
బిల్లును ఓడించాలి
అడ్డదారిలో రాజ్యసభలో బిల్లు పెట్టి ఆమోదించేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, బిల్లును ఓడించే విధంగా ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకురావాలని సమైక్యాంధ్ర జేఏసీ నాయకుడు హనుమంతు సాయిరాం అన్నారు. ఈనెల 17,18 తేదీల్లో ఢిల్లీ వెళ్లి, సీమాంధ్ర ఉద్యమాన్ని యూపీఏ ప్రభుత్వానికి తెలిసేలా చేసి కనువిప్పు కల్గిస్తామన్నారు. కార్యక్రమంలో దుప్పల వెంకట్రావు, జయరాం, జామి భీమశంకర్, నర్సునాయుడు, శ్రీకాంత్, సత్యన్నారాయణ, ఎం. కాళీప్రసాద్, ఎం. శ్రీకాంత్, గీతాశ్రీకాంత్, వెంకటేశ్వర్లు, హరికృష్ణ, వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.
పీఎన్ కాలనీ : రాష్ర్ట విభజనకు వ్యతిరేకంగా రిజిస్ట్రేషన్‌స అండ్ స్టాంప్స్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బంది నిరసన తెలిపారు. కార్యక్రమంలో సబ్ రిజిస్ట్రార్ ఎంవీ సురేష్, రాజేష్, అరుణమ్మ, ఎం.బాలన్న, జి.రాజులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement