బాలీవుడ్ హీరో కంపెనీ వాటా కొన్న మింత్ర | Myntra Buys Majority Stake In Hrithik Roshan's Brand HRX | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ హీరో కంపెనీ వాటా కొన్న మింత్ర

Published Fri, Aug 12 2016 7:17 PM | Last Updated on Wed, Apr 3 2019 8:42 PM

బాలీవుడ్ హీరో కంపెనీ వాటా కొన్న మింత్ర - Sakshi

బాలీవుడ్ హీరో కంపెనీ వాటా కొన్న మింత్ర

న్యూఢిల్లీ: ఆన్ లైన్ రీటైల్  వ్యాపార దిగ్గజం ఫ్లిప్ కార్ట్ సొంతమైన మింత్ర  వ్యాపార విస్తరణలో దూసుకుపోతోంది. ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ మింత్ర  ప్రముఖ బాలీవుడ్ హీరో  హృతిక్ రోషన్ కు చెందిన  లైఫ్‌స్టైల్ అప్పారెల్ అండ్ క్యాజువల్ వేర్ బ్రాండ్ 'హెచ్‌ఆర్‌ఎక్స్ ' లో మేజర్ షేర్ ను  సొంతం చేసుకుంది.   51 శాతం వాటాను కొనుగోలు చేసిన మింత్ర ఈ డీల్ వివరాలను వెల్లడిచేయలేదు. ఎక్సీడ్ ఎంటర్ టైన్మెంట్, , హృతిక్ కంపెనీల మెజారిటీ వాటాను కొనుగోలు చేసినట్టు ఒక ఇమెయిల్ ప్రకటనలో తెలిపింది.  ఈ రెండూ వాటాదార్లుగా కొనసాగుతారని తెలిపింది.
 
 బిలియన్  వినియోగదారులను సాధించాలన్న తమ లక్ష్య సాధనలో మింత్రా కొత్త భాగస్వామ్యాన్ని తోడ్పడుతుందని  బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ చెప్పారు. ఫ్యాషన్,  క్రియాత్మక క్రియాశీల దుస్తులు ఎంపిక లో పెరుగుతున్న  వినియోగదారుల ఆసక్తి అనుగుణంగా క్రియాశీల జీవనశైలి దుస్తులు విభాగంలో వ్యూహాత్మక కొనుగోలు  ఉపయోగపడనుందని  మింత్రా ఫ్యాషన్ బ్రాండ్స్ ఉపాధ్యక్షుడు,  బ్రాండ్ డైరెక్టర్ రాజేష్ నార్కర్   విశ్వసించారు.
కాగా 2012 లో  రంగంలోకి వచ్చిన హృతిక్ బ్రాండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ .200 కోట్ల ఆదాయంతో దూసుకెళుతోంది.  వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి  సిద్దమవుతోంది. 2013లో  హృతిక్  మింత్ర లమధ్య భాగస్వామ్యం ఒప్పంద కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement