‘మింత్ర’ ద్వారా హృతిక్ బ్రాండ్ ఉత్పత్తులు | Hrithik launches lifestyle brand HRX, teams up with Myntra.com | Sakshi
Sakshi News home page

‘మింత్ర’ ద్వారా హృతిక్ బ్రాండ్ ఉత్పత్తులు

Published Sat, Nov 23 2013 1:49 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

‘మింత్ర’ ద్వారా హృతిక్ బ్రాండ్ ఉత్పత్తులు - Sakshi

‘మింత్ర’ ద్వారా హృతిక్ బ్రాండ్ ఉత్పత్తులు

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ మింత్రడాట్‌కామ్‌తో ప్రముఖ హిందీ నటుడు హృతిక్ రోషన్ భాగస్వామ్యం కుదుర్చుకున్నాడు. హృతిక్‌కు చెందిన లైఫ్‌స్టైల్ అప్పారెల్ అండ్ క్యాజువల్ వేర్ బ్రాండ్ హెచ్‌ఆర్‌ఎక్స్ కోసం  ఈ ఒప్పందం కుదిరింది. క్రిష్ స్టార్ హృతిక్ రోషన్ స్టైల్ స్ఫూర్తితో రూపొందిన హెచ్‌ఆర్‌ఎక్స్ కలెక్షన్‌ను నేటి(శనివారం) నుంచి మింత్రడాట్‌కామ్ ద్వారానే అమ్ముడవుతాయి. ప్రీమియం ఫ్యాబ్రిక్స్‌తో, ఆకర్షణీయమైన రంగుల్లో  రూపొందిన క్యాజువల్స్, స్పోర్ట్స్ ఫుట్‌వేర్(పురుషులకు)ను తమ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా కొనుగోలు చేయవచ్చని మింత్రడాట్‌కామ్ తెలిపింది. మింత్రడాట్‌కామ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం మంచి అవకాశంగా భావిస్తున్నామని ఈ సందర్భంగా హృతిక్ రోషన్ చెప్పారు. హెచ్‌ఆర్‌ఎక్స్ ఉత్పత్తుల్లో బేసిక్ టీ-షర్ట్ ధర రూ.499, జీన్స్, ట్రౌజర్ల ధరలు రూ.2,499 వరకూ ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement