Myntra.com
-
క్విక్ కామర్స్‌లోకి మింత్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్ మింత్రా క్విక్ కామర్స్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ’ఎం–నౌ’ పేరుతో 30 నిమిషాల్లోనే ఉత్పత్తులను డెలివరీ చేయనున్నట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. ప్రస్తుతం బెంగళూరులో ఈ సేవలను అందిస్తోంది. రాబోయే నెలల్లో దేశవ్యాప్తంగా మెట్రో, నాన్–మెట్రో నగరాల్లో విస్తరించడానికి సిద్ధంగా ఉన్నామని మింత్రా సీఈవో నందిత సిన్హా తెలిపారు. ఉత్పత్తుల కొనుగోలు కోసం సమయం వృ«థా కాకుండా ఎం–నౌ సౌకర్యవంతమైన పరిష్కారం అని చెప్పారు. అంతర్జాతీయ, దేశీయ బ్రాండెడ్ లైఫ్‌స్టైల్ ఉత్పత్తులను వినియోగదార్లు కేవలం 30 నిమిషాల్లోనే అందుకోవచ్చని కంపెనీ ప్రకటన తెలిపింది. ఫ్యాషన్, బ్యూటీ, యాక్సెసరీస్, గృహ విభాగంలో 10,000 కంటే ఎక్కువ ఉత్పత్తుల శ్రేణిని ప్రస్తుతం ఎం–నౌ లో అందిస్తోంది. 3–4 నెలల్లో ఈ సంఖ్యను లక్షకు పైచిలుకు చేర్చనున్నట్టు మింత్రా వెల్లడించింది. మార్పిడి, వెనక్కి ఇచ్చే సౌకర్యం.. నవంబర్‌లో బెంగళూరులో మింత్రా క్విక్ కామర్స్ పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించింది. పైలట్ ప్రాజెక్టులో కస్టమర్ల నుంచి సానుకూల స్పందన లభించిందని సిన్హా వ్యాఖ్యానించారు. ఇది ప్రారంభం మాత్రమేనని, మరింతగా విస్తరిస్తామని చెప్పారు. ఇతర క్విక్ కామర్స్ కంపెనీల మాదిరిగా కాకుండా ఉత్పత్తుల మార్పిడి, వెనక్కి ఇచ్చే సౌకర్యం కూడా ఉందని నందిత వెల్లడించారు. కాగా, మెట్రో నగరాల్లో మింత్రా ఎక్స్‌ప్రెస్ డెలివరీ సేవలకు 2022లో శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఆర్డర్ పెట్టిన 24–48 గంటల్లో ఉత్పత్తులను డెలివరీ చేస్తోంది. మరోవైపు క్విక్ కామర్స్ రంగంలో ఉన్న సంస్థలు బ్యూటీ, ఫ్యాషన్ విభాగాలను జోడిస్తున్న తరుణంలో.. క్విక్ కామర్స్ లోని ఎంట్రీ ఇస్తున్న తొలి ఫ్యా షన్ ప్లాట్‌ఫామ్ మింత్రా కావడం గమనార్హం. -
బార్బీరేఖ.. పిక్స్ వైరల్
అమెరికా బొమ్మల కంపెనీ ‘మ్యాటల్’ 1959లో ఫ్యాషన్ డాల్ ‘బార్బీ’ని లాంచ్ చేసింది. జర్మన్ అందాల బొమ్మ ‘బిల్డ్’ను స్ఫూర్తిగా తీసుకొని సృష్టించిన ‘బార్బీ’ తరాలకు అతీతంగా చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటూనే ఉంది. ఈ నెల 21న హాలీవుడ్ లైవ్–యాక్షన్ మూవీ ‘బార్బీ’ విడుదల కానుంది. దీనికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ ప్రచారంతో సంబంధం లేకపోయినా ‘మింత్ర’ సృష్టించిన చిత్రాలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. 68 సంవత్సరాల రేఖను ఏఐ వపర్‌తో అందాల బార్బీ బొమ్మగా మార్చి నెటిజనులను అబ్బుర పరిచింది ఇండియన్ ఫ్యాషన్ ఇ–కామర్స్ ప్లాట్‌ఫామ్ మింత్ర. pic.twitter.com/4oeHzPU0Lm — Myntra (@myntra) July 5, 2023 -
మింత్రా చేతికి మరో స్టార్టప్ కంపెనీ
సాక్షి, ముంబై: ఆన్లైన్లో ఫ్యాషన్ ఉత్పత్తుల విక్రయ సంస్థ మింత్రా.. బెంగళూరుకు చెందిన మరోస్టార్టప్ కంపెనీని సొంతం చేసుకుంది. ఈ మేరకు మింత్రా సోమవారం ఒక ప్రకటనను జారీ చేసింది. తద్వారా బలమైన సాంకేతిక బందాన్ని తయారుచేసుకోవడంతోపాటు, తన ఉత్పత్తి అభివృద్ధి సామర్ధ్యాలను పెంచుకోనున్నట్టు వెల్లడించింది. భారత ఈ-కామర్స్ వ్యాపారంలో తమ స్థానాన్ని పటిష్టానికి ఈ సముపార్జన సహాయం చేస్తుందని మింత్రా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జయేంద్రన్ వేణుగోపాల్ చెప్పారు. 300కోట్ల టర్నోవర్ తోవేగంగా విస్తరిస్తున్న ఈ పరిశ్రమలో ఆన్లైన్వ్యాపారం 60శాతంగా ఉందని తెలిపారు. స్మార్ట్‌షూస్, స్మార్ట్ వాచ్స్ లాంటి ఉత్పత్తులను కసమర్లకు అందించడానికి దోహదపడుతుందన్నారు. 2014 లో స్థాపించారు. విట్వర్క్స్ అనే కన్స్యూమర్ టెక్నాలజీస్ 2016లో వేరియబుల్ ఫ్లాగ్షిప్ డివైస్‌ను బ్లింక్వాచ్ను లాంచ్ చేసింది. -
‘మింత్ర’ ద్వారా హృతిక్ బ్రాండ్ ఉత్పత్తులు
న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ మింత్రడాట్కామ్తో ప్రముఖ హిందీ నటుడు హృతిక్ రోషన్ భాగస్వామ్యం కుదుర్చుకున్నాడు. హృతిక్‌కు చెందిన లైఫ్‌స్టైల్ అప్పారెల్ అండ్ క్యాజువల్ వేర్ బ్రాండ్ హెచ్ఆర్ఎక్స్ కోసం ఈ ఒప్పందం కుదిరింది. క్రిష్ స్టార్ హృతిక్ రోషన్ స్టైల్ స్ఫూర్తితో రూపొందిన హెచ్ఆర్ఎక్స్ కలెక్షన్‌ను నేటి(శనివారం) నుంచి మింత్రడాట్కామ్ ద్వారానే అమ్ముడవుతాయి. ప్రీమియం ఫ్యాబ్రిక్స్‌తో, ఆకర్షణీయమైన రంగుల్లో రూపొందిన క్యాజువల్స్, స్పోర్ట్స్ ఫుట్‌వేర్(పురుషులకు)ను తమ ఆన్లైన్ పోర్టల్ ద్వారా కొనుగోలు చేయవచ్చని మింత్రడాట్కామ్ తెలిపింది. మింత్రడాట్కామ్తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం మంచి అవకాశంగా భావిస్తున్నామని ఈ సందర్భంగా హృతిక్ రోషన్ చెప్పారు. హెచ్ఆర్ఎక్స్ ఉత్పత్తుల్లో బేసిక్ టీ-షర్ట్ ధర రూ.499, జీన్స్, ట్రౌజర్ల ధరలు రూ.2,499 వరకూ ఉన్నాయి.