ఫైల్ ఫోటో
సాక్షి, ముంబై : ఫ్యాషన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ మింత్రా 'ఎండ్ ఆఫ్ రీజన్ సేల్'(ఇఒఆర్‌ఎస్)కు శ్రీకారం చుట్టింది. నేటి (జూన్19) నుంచి ప్రారంభించిన 12వ ఎడిషన్ అమ్మకాలు జూన్ 22తో ముగియనున్నాయి. ఈ సందర్భంగా సప్లయ్ చెయిన్, కస్టమర్ కేర్ విభాగాల్లో 5 వేల మందిని నియమించుకున్నామని మింత్రా ప్రకటించింది. అంతేకాదు తొలిసారిగా తమ ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తున్నారని వెల్లడించింది.
ఇఒఆర్‌ఎస్ అమ్మకాల్లో దేశవ్యాప్తంగా 3 వేలకు పైగా బ్రాండ్ల నుండి 7 లక్షలకు పైగా వెరైటీలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. మహిళలు, పిల్లలు, క్రీడా, ఫ్యాషన్ దుస్తులు, బ్యూటీ, పర్సనల్ కేర్ విభాగాల్లో ఆకర్షణీయ ధరలు అందుబాటులో ఉన్నాయని మింత్రా ప్రకటించింది. పుంజుకున్న డిమాండ్ కనుగుణంగా నిమిషానికి 20 వేలకు పైగా ఆర్డర్లను తీసుకోవడానికి తమ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపింది. 30 లక్షల ప్రజలు తమ ప్లాట్‌ఫామ్‌లో షాపింగ్ చేస్తారని ఆశిస్తోంది.
'అన్‌లాక్ 1.0' దశలో సేల్ పుంజుకుందని తాజా సేల్ ద్వారా కూడా భారీ అమ్మకాలను సాధించనున్నామనే ధీమాను సీఈఓ అమర్ నాగారం వ్యక్తం చేశారు. గరిష్టంగా 7.5 లక్షలకు పైగా వినియోగదారులు ఈ సేల్ పాల్గొంటారని అంచనా వేశారు.300 నగరాల్లో 400 కి పైగా బ్రాండ్ల నుండి 3,500కు పైగా భారతీయ చేనేత ఉత్పత్తులను తమ ప్లాట్‌ఫామ్‌లో అందిస్తున్నామన్నారు. ప్రధానంగా ఎస్‌ఎంఇలకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు అమర్ చెప్పారు. అంతేకాకుండా ఈ అమ్మకాలు ముగిసిన తరువాత ఉద్యోగులకు రెండు రోజుల "రీఛార్జ్ లీవ్" ను కూడా అందిస్తోంది. కాగా మునుపటి సేల్‌లో, 2.85 మిలియన్ల కస్టమర్ల ద్వారా 4.2 మిలియన్ ఆర్డర్‌లతో 9.6 మిలియన్ వస్తువులను మింత్రా విక్రయించింది.
చదవండి : అది మా డీఎన్ఏలోనే ఉంది : అంబానీ
Comments
Please login to add a commentAdd a comment