ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫ్లిప్‌కార్ట్ తన ఉద్యోగులు దాదాపు 700 మిలియన్ డాలర్లు (రూ. 5780 కోట్లు) స్టాక్ ఆప్షన్స్‌ను ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ హెచ్‌ఆర్ ఫ్లిప్‌కార్ట్‌తోపాటు, ఫ్యాషన్ విభాగం మింత్రా అర్హులైన న ఉద్యోగులకు ఇమెయిల్స్ పంపింది.
వాల్‌మార్ట్ యాజమాన్యంలోని సంస్థ వేలాది ఉద్యోగుల స్టాక్ ఆప్షన్ బైబ్యాక్ అందింనుంది. కంపెనీ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి. నివేదికల ప్రకారం, ఈ (జూలై) నెలాఖరులోగా ఈ నగదును సదరు ఉద్యగులకు అందించనున్నారు. అర్హత ఉన్న ప్రస్తుత, మాజీ ఉద్యోగులు ఫ్లిప్‌కార్ట్‌లోని ప్రతి ESOP యూనిట్‌కు రూ. 3615 అందు కుంటారు. ఫ్లిప్‌కార్ట్‌లో 15వేల మంది ఉద్యోగులు ఉండగా ఇందులో మింత్రాలో దాదాపు 3500 మంది ఉద్యోగులున్నారని సమాచారం. (దేశంలో రిచెస్ట్ గాయని ఎవరో తెలుసా?ఏఆర్ రెహమాన్‌తో పోలిస్తే?)
వాల్‌మార్ట్ 2018లో కంపెనీలో మెజార్టీ వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 2017లో ఫ్లిప్‌కార్ట్ సీఈఓ అయిన కళ్యాణ్ కృష్ణమూర్తి ఫ్లిప్‌కార్ట్-వాల్‌మార్ట్ డీల్‌లో కృష్ణమూర్తి కీలక పాత్ర పోషించారట. అందుకే 16 బిలియన్ డాలర్ల ఫ్లిప్‌కార్ట్-వాల్‌మార్ట్ డీల్ తరువాత అతనికి 2 మిలియన్ డాలర్ల రిటెన్షన్ బోనస్ ఆఫర్ చేసినట్టు బిజినెస్ టుడే నివేదించింది. ఈ నేపథ్యంలోనే గతేడాది ఈస్ట్ బెంగళూరులో కృష్ణమూర్తి ఓ విల్లా కొన్నాడు. విల్లా 4921 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ విల్లా ఖరీదు రూ.8 కోట్లు. ఇందులో నాలుగు బెడ్‌రూమ్‌లు, ఐదు బాత్‌రూమ్‌లు, డ్యూయల్ కిచెన్‌లు, పూజ, లివింగ్, డైనింగ్, ఆఫీస్, మీడియా, యుటిలిటీ రూమ్‌లు వ్యక్తిగత గ్యారేజీ కూడా ఉంది. మరోవైపు కంపెనీ త్వరలోనే ఐపీఓకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. (ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పుడు వివరాలిచ్చారో : స్ట్రాంగ్ వార్నింగ్)
Comments
Please login to add a commentAdd a comment