stock options
-
భారీ వేతనం.. కొంత వద్దనుకున్న సత్య నాదెళ్ల!
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వేతనం 2024 ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగింది. తనకు అందించే స్టాక్ అవార్డులు ఏకంగా గతంలో కంటే 63 శాతం వృద్ధి చెందాయి. దాంతో తన వేతనం 79.1 మిలియన్ అమెరికన్ డాలర్లు(రూ.665 కోట్లు)కు చేరింది. అయితే సంస్థ ద్వారా తనకు బోనస్ రూపంలో అందే వేతనాన్ని మాత్రం తగ్గించాలని కోరడం గమనార్హం.యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కు ఇటీవల మైక్రోసాఫ్ట్ కంపెనీ దాఖలు చేసిన నివేదిక ప్రకారం..2024 ఆర్థిక సంవత్సరంలో సీఈఓ సత్య నాదెళ్ల మొత్తం పరిహారం సుమారు 79.1 మిలియన్లు (సుమారు రూ.665 కోట్లు)గా ఉంది. ఆయన వేతనం మైక్రోసాఫ్ట్ స్టాక్ పనితీరుతో ముడిపడి ఉంటుంది. తనకు స్టాక్ అవార్డుల రూపంలో కంపెనీ అధికంగా వేతనం చెల్లిస్తుంది. దాంతో కంపెనీ షేర్లు పెరిగితే తన సంపద సైతం అధికమవుతుంది. తనకు కంపెనీ ఇచ్చిన వేతనం వివరాలు కింది విధంగా ఉన్నాయి.స్టాక్ అవార్డులు: 71,236,392 డాలర్లు (సుమారు రూ.600 కోట్లు)నాన్-ఈక్విటీ ఇన్సెంటివ్ ప్లాన్: 52 లక్షల డాలర్లు (సుమారు రూ.44 కోట్లు)మూల వేతనం: 25 లక్షల డాలర్లు (రూ.21 కోట్లకు పైగా)ఇతర అవవెన్స్లతో కూడిన పరిహారం: 1,69,791 డాలర్లు (సుమారు రూ.15 లక్షలు)బోనస్ పెంపు వద్దనుకున్న సత్యజీతం పెరిగినప్పటికీ తనకు అందే కొంత వేతనాన్ని వద్దనుకున్నట్లు కంపెనీ తెలిపింది. అతను తనకు అందే బోనస్ 10.66 మిలియన్ల డాలర్లు (సుమారు రూ.89 కోట్లు) నుంచి 5.2 మిలియన్ల డాలర్లకు (సుమారు రూ.43 కోట్లు) తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారు. దాంతో కంపెనీపై తన నిబద్ధతను చాటుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.మైక్రోసాఫ్ట్ ఆర్థిక వృద్ధినాదెళ్ల సీఈఓగా నియమితులైనప్పటి నుంచి మైక్రోసాఫ్ట్ వేగంగా వృద్ధిని సాధించింది. కంపెనీ ఆదాయం దాదాపు మూడు రెట్లు పెరిగి 245.1 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.20.4 లక్షల కోట్లు) చేరుకుంది. అయితే నికర ఆదాయం దాదాపు నాలుగు రెట్లు పెరిగి 88.1 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.7.3 లక్షల కోట్లు) చేరుకుంది. కంపెనీ వృద్ధితో నాదెళ్ల పరిహారం కూడా అధికమైనట్లు తెలుస్తుంది.ఇదీ చదవండి: నీటిపై తేలాడే సోలార్ వెలుగులు.. దేశంలోని ప్రాజెక్ట్‌లు ఇవే..కొంతమంది భారతీయ సంతతి సీఈఓల వేతన వివరాలు..సుందర్ పిచాయ్(గూగుల్): దాదాపు రూ.1,846 కోట్లుసత్యనాదెళ్ల(మైక్రోసాఫ్ట్) రూ.665 కోట్లుశంతను నారాయణ్ (అడోబ్): రూ.300 కోట్లుసంజయ్ మెహ్రోత్రా (మైక్రాన్ టెక్నాలజీ): రూ.206 కోట్లుఅరవింద్ కృష్ణ (ఐబీఎం): రూ.165 కోట్లు -
రిటెన్షన్ బోనస్‌తో సీఈవో లగ్జరీ విల్లా: ఇపుడు ఉద్యోగులకు గుడ్ న్యూస్
ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫ్లిప్‌కార్ట్ తన ఉద్యోగులు దాదాపు 700 మిలియన్ డాలర్లు (రూ. 5780 కోట్లు) స్టాక్ ఆప్షన్స్‌ను ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ హెచ్ఆర్ ఫ్లిప్‌కార్ట్‌తోపాటు, ఫ్యాషన్ విభాగం మింత్రా అర్హులైన న ఉద్యోగులకు ఇమెయిల్స్ పంపింది. వాల్‌మార్ట్ యాజమాన్యంలోని సంస్థ వేలాది ఉద్యోగుల స్టాక్ ఆప్షన్ బైబ్యాక్ అందింనుంది. కంపెనీ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి. నివేదికల ప్రకారం, ఈ (జూలై) నెలాఖరులోగా ఈ నగదును సదరు ఉద్యగులకు అందించనున్నారు. అర్హత ఉన్న ప్రస్తుత, మాజీ ఉద్యోగులు ఫ్లిప్‌కార్ట్‌లోని ప్రతి ESOP యూనిట్‌కు రూ. 3615 అందు కుంటారు. ఫ్లిప్‌కార్ట్‌లో 15వేల మంది ఉద్యోగులు ఉండగా ఇందులో మింత్రాలో దాదాపు 3500 మంది ఉద్యోగులున్నారని సమాచారం. (దేశంలో రిచెస్ట్ గాయని ఎవరో తెలుసా?ఏఆర్ రెహమాన్‌తో పోలిస్తే?) వాల్‌మార్ట్ 2018లో కంపెనీలో మెజార్టీ వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 2017లో ఫ్లిప్‌కార్ట్ సీఈఓ అయిన కళ్యాణ్ కృష్ణమూర్తి ఫ్లిప్‌కార్ట్-వాల్‌మార్ట్ డీల్‌లో కృష్ణమూర్తి కీలక పాత్ర పోషించారట. అందుకే 16 బిలియన్ డాలర్ల ఫ్లిప్‌కార్ట్-వాల్‌మార్ట్ డీల్ తరువాత అతనికి 2 మిలియన్ డాలర్ల రిటెన్షన్ బోనస్ ఆఫర్ చేసినట్టు బిజినెస్ టుడే నివేదించింది. ఈ నేపథ్యంలోనే గతేడాది ఈస్ట్ బెంగళూరులో కృష్ణమూర్తి ఓ విల్లా కొన్నాడు. విల్లా 4921 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ విల్లా ఖరీదు రూ.8 కోట్లు. ఇందులో నాలుగు బెడ్రూమ్లు, ఐదు బాత్రూమ్లు, డ్యూయల్ కిచెన్లు, పూజ, లివింగ్, డైనింగ్, ఆఫీస్, మీడియా, యుటిలిటీ రూమ్‌లు వ్యక్తిగత గ్యారేజీ కూడా ఉంది. మరోవైపు కంపెనీ త్వరలోనే ఐపీఓకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. (ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పుడు వివరాలిచ్చారో : స్ట్రాంగ్ వార్నింగ్) -
మస్క్ కీలక నిర్ణయం: ఉద్యోగులకు బంపర్ ఆఫర్!
న్యూఢిల్లీ: గత ఏడాది అక్టోబర్‌లో 44 బిలియన్ డాలర్లతో మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌ను సొంతం చేసుకున్న టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తాజా నిర్ణయం సంచలనంగా మారింది. ట్విటర్ కొనుగోలు తరువాత ఖర్చుల తగ్గింపు, పనితీరు అంటూవేలాదిమంది ఉద్యోగులను తీసివేయడంతోపాటు, పలు అనూహ్య నిర్ణయాలతో వార్తల్లో నిలిచిన మస్క్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించడం ఆశ్చర్యంలో ముంచెత్తింది. వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం సుమారు 20 బిలియన్ డాలర్ల విలువచేసే స్టాక్స్‌ను ఉద్యోగులను ఇవ్వనున్నట్టు మస్క్ ప్రకటించారు. ట్విటర్ డీల్‌కు వెచ్చించిన దాంట్లో ఇది సగం కంటే కొంచెం తక్కువ. శుక్రవారం ఉద్యోగులకు పంపిన ప్రత్యేక ఇమెయిల్ ప్రకారం, కంపెనీ ఉద్యోగులకు అదనపు ఈక్విటీ గ్రాంట్లను అందజేస్తున్నట్లు తన సిబ్బందికి తెలిపింది. ఇప్పుడు ప్రదానం చేసిన షేర్ల విలువ భవిష్యత్తులో పది రెట్లకు పైగా పెరుగుతాయని మస్క్ వెల్లడించారు. అలాగే ఆరు నెలల తర్వాత వీటి ప్రయోజనాలుపొందవచ్చని, దాదాపు ఒక సంవత్సరంలో లిక్విడిటీ ఈవెంట్‌ను అందించాలని కంపెనీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈక్విటీలో కొంత భాగాన్ని క్యాష్ అవుట్ చేయగలరని పేర్కొంది. అయితే, ఈక్విటీ అవార్డులు పొందే ఉద్యోగుల సంఖ్యపై స్పష్టత లేదు. (మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లు: డెడ్‌లైన్ ముగియకముందే మేల్కొండి!) కాగా ఇటీవల బారీగా ఉద్యోగాల తీసివేత, పలువురు నిపుణుల నిష్క్రమణలు, నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు రెగ్యులేటరీ ఫైలింగ్‌ల ప్రకారం, ట్విటర్ 2021లో స్టాక్ ఆధారిత పరిహారం కోసం సుమారు 630 మిలియన డాలర్లన వెచ్చింది. -
సెబీ సెటిల్మెంట్ స్కీమ్ కింద10,980 కంపెనీలు
న్యూఢిల్లీ: ఇల్లిక్విడ్ స్టాక్ ఆప్షన్లలో అవకతవకలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలకు పెద్ద ఊరట లభించింది. సెటిల్మెంట్ స్కీమ్ 2022 పేరుతో వీటిని పరిష్కరించుకునే అవకాశం సెబీ కల్పించగా, దీన్ని పెద్ద సంఖ్యలో కంపెనీలు వినియోగించుకున్నాయి. 10,980 కంపెనీలు తమపై కేసులను సెబీ వద్ద పరిష్కరించుకున్నాయి. ఈ పథకం కింద దరఖాస్తుకు 2022 ఆగస్ట్ 22 నుంచి నవంబర్ 21 వరకు మూడు నెలల పాటు అవకాశం కల్పించారు. ఆ తర్వాత 2023 జనవరి 21 వరకు పొడిగించారు. ‘‘మొత్తం 10,980 కంపెనీలు ఈ పథకం కింద కేసులను పరిష్కరించుకున్నాయి. నిర్దేశిత మొత్తాన్ని చెల్లించాయి’’అని సెబీ తన ప్రకటనలో తెలిపింది. -
ఉద్యోగులకు బంఫర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్ ఇండియా.. దాదాపు 8 వేల మందికి
ముంబై/న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా తన ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్ ఆఫర్ ఇచ్చింది. శాశ్వత ఉద్యోగులకు ‘ఎంప్లాయీస్ షేర్ బెనిఫిట్ (ఈఎస్‌బీ) స్కీమ్, 2022’ కింద 98 కోట్ల షేర్లను కేటాయించనుంది. 2022 జనవరి 27న కేంద్ర ప్రభుత్వం నుంచి ఎయిర్ ఇండియా నియంత్రణ టాటా గ్రూపు చేతికి వెళ్లడం తెలిసిందే. ఈ స్టాక్ ఆప్షన్ పథకం కింద 8,000 మంది ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నట్టు ఎయిర్ ఇండియా ఉద్యోగి ఒకరు తెలిపారు. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా చేసుకున్న షేరు కొనుగోలు ఒప్పందం ప్రకారం.. ప్రైవేటీకరించే నాటికి సర్వీసులో ఉన్న ఉద్యోగులకు ఎంప్లాయీ షేర్ బెనిఫిట్ పథకాన్ని ఆఫర్ చేసినట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఇందులో ఉండే దీర్ఘకాల ప్రయోజనాల గురించి ఉద్యోగులకు తెలియజేస్తామని పేర్కొంది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో పనిచేసే శాశ్వత ఉద్యోగులు అందరికీ ఈ పథకం కింద అర్హత ఉంటుంది. కొనుగోలు చేసే నాటికి ఒక్కో షేరు పుస్తక విలువ 87–90 పైసలు ఉంటే, తాజా పథకంలో భాగంగా ఒక్కో స్టాక్ ఆప్షన్‌ను 27 పైసలకు ఆఫర్ చేసినట్టు తెలిసింది. చదవండి: Union Budget 2023: 6 నెలల నుంచి మొదలు, బాబోయ్ బడ్జెట్ తయారీ వెనుక ఇంత కథ నడుస్తుందా! -
ఇన్ఫోసిస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సలీల్ పరేఖ్‌కు భారీ గిఫ్ట్ ఇచ్చింది. వార్షిక పనితీరు ఆధారంగా ఉద్యోగులకు అందించే స్టాక్ ప్రోత్సాహకాల్లో 10 కోట్ల రూపాయల మార్కెట్ విలువున్న పరిమిత స్టాక్ యూనిట్లు(ఆర్ఎస్యూ)ను ఆయనకు కేటాయించింది. మరో కీలక ఎగ్జిక్యూటివ్ సీవోవో యూబీ ప్రవీణ్ రావుకు రూ. 4 కోట్ల విలువైన షేర్లను కేటాయించింది. అలాగే సుమారు రూ.5 కోట్ల విలువైన షేర్లను ఉద్యోగులకు కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు బోర్డు ఆమోదించిన ప్రతిపాదనలు వాటాదారుల ఆమోదం పొందాల్సి వుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఆర్ఎస్యూ కేటాయింపు ఉద్యోగుల పనితీరు ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. స్టాక్ ఓనర్షిప్ 2019 పథకం విస్తరణలో భాగంగా ఈ కేటాయింపులని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. భారత ఐటీ పరిశ్రమలో అనేక అంశాల్లో ఇన్ఫోసిస్ మార్గదర్శిగా ఉందని, ముఖ్యంగా ఆర్ఎస్యూ కేటాయింపులు కీలక మైలురాయి లాంటిదని ఇన్ఫీ సీఈవో వ్యాఖ్యానించారు. ఉద్యోగులే తమకు పెద్ద ఎసెట్ అని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా నిరంతర, స్థిరమైన పనితీరుతో విలువైన సేవలందించిన తమ సీనియర్ ఉద్యోగులను గుర్తించి, గౌరవించడం తమ లక్ష్యమని చెప్పారు. అలాగే కంపెనీ దీర్ఘకాల విజయానికి పాటుపడిన ఉద్యోగులను యజమానులను చేయడం ద్వారా వారి శ్రమకు, నిబద్ధతకు ప్రతిఫలం లభిస్తుందని పరేఖ్ చెప్పారు. -
అరుదైన ఆఫర్ ఇచ్చిన మోతీలాల్ ఓస్వాల్
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉద్యోగులతో పాటు ఆఫీస్ బోయ్‌లకు కూడా బంపర్ఆఫర్ ప్రకటించింది. ఎంప్లాయిస్ స్టాక్ ఓనర్షిప్ పథకాన్ని (ఈఎస్ఓపి) ఆఫీస్ బోయ్‌లకు కూడా వర్తింపచేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలో ఇది చాలా అరుదైన చర్యగా నిలిచింది. సాధారణంగా తక్కువ మంది ఉద్యోగులతో స్టార్ట్ ఆప్ కంపెనీలే ఇలాంటి ఆఫర్లు అందిస్తాయి. కానీ మోతీలాల్ లాంటి అతిపెద్ద ఫైనాన్షియల్ సేవల సంస్థ ఇలా ప్రకటించడం విశేషంగా నిలిచింది. ముంబయికి చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రస్తుతం 3,800 మంది ఉద్యోగులను కలిగి ఉంది. స్టాక్ కేటాయింపు ఆప్షన్ సంస్థలోని ఉద్యోగి పదవీకాలం, డిజిగ్నేషన్ ఆధారంగా నిర్ణయిస్తామని మోతీలాల్ హెచ్ ఆర్ డైరెక్టర్ సుధీర్ ధార్ వెల్లడించారు. సంస్థలోని దాదాపు 85 శాతం మంది ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారని తెలిపారు. మోతీలాల్ ఓస్వాల్ అద్భుతమైన విజయంలో భాగంగా ఉన్నందుకు కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేస్తూ ఆఫీస్ బోయ్ నుంచి డైరెక్టర్ స్థాయి ఉద్యోగి వరకు ఈ అదనపు ప్రయోజనాన్ని అందిస్తున్నట్టు ఆయన చెప్పారు. కాగా ఇది విభిన్న వ్యాపారాల అంతటా ఉన్న ఆర్థిక సేవల సంస్థ మోతీలాల్ ఓస్వాల్? మూలధన మార్కెట్ వ్యాపారాలు (రిటైల్ బ్రోకింగ్, సంస్థాగత బ్రోకింగ్ మరియు పెట్టుబడి బ్యాంకింగ్), ఆస్తి మరియు సంపద నిర్వహణ (ఆస్తి నిర్వహణ, ప్రైవేట్ ఈక్విటీ మరియు సంపద నిర్వహణ), హౌసింగ్ ఫైనాన్స్ మరియు ఈక్విటీ ఆధారిత ట్రెజరీ పెట్టుబడులు ఉన్నాయి. 2017 సంస్థ భారీ వృద్ధిని నమోదుచేసింది. 66శాతం జంప్ చేసి రూ. 1,818 కోట్ల ఆదాయిన్ని సాధించింది. లాభం రూ. 360 కోట్లుగా నమోదు చేసింది. ఈ లాభాల్లో సగానికి పైగా హౌసింగ్ ఫైనాన్స్, అసెట్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్ ద్వారా సాధించినట్టు కంపెనీ పేర్కొంది. సంస్థ మార్చి 2017 నాటికి హౌసింగ్ ఫైనాన్స్ లోన్‌బుక్ రూ.4,100కోట్లుగాఉంది. -
జియో ఉద్యోగులకు గుడ్‌న్యూస్!
ముంబై : ఉచిత సేవా ఆఫర్లతో వినియోగదారులను సంబురపెట్టిన ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో, సంస్థ కోసం కష్టపడుతున్న ఉద్యోగులకు తీపికబురు అందించాలనుకుటోంది. తన ఉద్యోగుల కోసం స్టాక్ ఆప్షన్స్‌ను ప్రారంభించాలని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్లాన్ చేస్తోంది. ప్రతిభాపాటవాలు కలిగిన వారికి, చందాదారులను యాడ్ చేస్తున్న ఉద్యోగులకు దశల వారీగా కంపెనీ స్టాక్ ఆప్షన్స్‌ను బహుమతులుగా ఇవ్వాలని కంపెనీ ప్లాన్ చేస్తుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. స్టాక్ ఆప్షన్ ప్రొగ్రామ్ ప్రస్తుతం ప్లానింగ్ స్టేజ్లోఉందని, ఈ ఏడాది చివరిలో దీన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నాయి. అయితే ఈ విషయంపై కంపెనీ మాత్రం స్పందించడం లేదు. గతేడాది సెప్టెంబర్‌లోనే కంపెనీ 4జీ సర్వీసులను లాంచ్ చేసింది. అప్పటినుంచి వినియోగదారులకు ఉచిత సేవలను జియో కస్టమర్లకు అందిస్తోంది. ప్రస్తుతం రిలయన్స్ జియోకు 30వేల మందికి పైగా శాశ్వత ఉద్యోగులున్నారు. మొదట సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు స్టాక్ ఆప్షన్లను అందించడం ప్రారంభించిన తర్వాత ఇతర ఉద్యోగులకు అందిస్తుందని ఈ విషయం తెలిసిన మరో అధికారి చెబుతున్నారు. ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్లను ఇవ్వడం టెలికాం సెక్టార్లో సర్వసాధారణం. ఉద్యోగి జీతం బట్టి 10 శాతం నుంచి 200 శాతం రేంజ్లో ఏడాదికి ఒక్కసారి ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్(ఈఎస్ఓపీ)ను దిగ్గజ టెలికాం కంపెనీలు భారతీ ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్, వొడాఫోన్ ఇండియాలు ఉద్యోగులకు అందిస్తున్నాయి. రిలయన్స్ జియో ఈ ప్రొగ్రామ్ ను ప్రారంభించినప్పుడు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు 10-15 శాతం ఈఎస్ఓపీలు పొందుతారని తెలుస్తోంది. -
విప్రో ఉద్యోగులకు రూ.కోటి షేర్లు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో.. అర్హులైన తమ ఉద్యోగులకు దాదాపు రూ.కోటికి పైగా విలువైన షేర్లను కేటాయించనున్నట్లు ప్రకటించింది. రెస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్ ప్లాన్-2005, 2007 కింద స్టాక్ ఆప్షన్స్ రూపంలో రూ.2 ముఖ విలువగల 18,819 షేర్లను ప్రస్తుత మార్కెట్ ధరకు జారీ చేయనుంది. తాజాగా జరిగిన డెరైక్టర్ల బోర్డు సమావేశంలో యాజమాన్య కమిటీ ఈ ప్రతిపాదనను ఆమోదించినట్లు బీఎస్ఈకి వెల్లడించిన సమాచారంలో కంపెనీ తెలిపింది.