అరుదైన ఆఫర్‌ ఇచ్చిన మోతీలాల్‌ ఓస్వాల్‌ | Sakshi
Sakshi News home page

అరుదైన ఆఫర్‌ ఇచ్చిన మోతీలాల్‌ ఓస్వాల్‌

Published Sat, May 13 2017 4:42 PM

అరుదైన ఆఫర్‌ ఇచ్చిన  మోతీలాల్‌  ఓస్వాల్‌

మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉద్యోగులతో పాటు ఆఫీస్‌ బోయ్‌లకు కూడా  బంపర్‌ఆఫర్‌  ప్రకటించింది. ఎంప్లాయిస్‌ స్టాక్‌ ఓనర్‌షిప్‌ పథకాన్ని (ఈఎస్‌ఓపి) ఆఫీస్‌ బోయ్‌లకు కూడా వర్తింపచేస్తూ  సంచలన నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలో ఇది చాలా అరుదైన చర్యగా నిలిచింది. సాధారణంగా తక్కువ మంది ఉద్యోగులతో  స్టార్ట్‌ ఆప్‌ కంపెనీలే ఇలాంటి ఆఫర్లు  అందిస్తాయి. కానీ  మోతీలాల్‌ లాంటి అతిపెద్ద ఫైనాన్షియల్‌  సేవల సంస్థ ఇలా ప్రకటించడం విశేషంగా నిలిచింది. ముంబయికి చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్  మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రస్తుతం 3,800 మంది ఉద్యోగులను కలిగి ఉంది.

స్టాక్‌ కేటాయింపు ఆప‍్షన్‌ సంస్థలోని ఉద్యోగి పదవీకాలం,  డిజిగ్నేషన్‌  ఆధారంగా నిర్ణయిస్తామని   మోతీలాల్‌  హెచ్‌ ఆర్‌ డైరెక్టర్‌ సుధీర్‌ ధార్‌ వెల్లడించారు.  సంస్థలోని దాదాపు 85 శాతం మంది ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారని  తెలిపారు.  మోతీలాల్‌  ఓస్వాల్‌ అద్భుతమైన  విజయంలో భాగంగా ఉన్నందుకు కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేస్తూ  ఆఫీస్‌  బోయ్‌ నుంచి డైరెక్టర్‌ స్థాయి ఉద్యోగి వరకు ఈ అదనపు ప్రయోజనాన్ని అందిస్తున‍్నట్టు ఆయన చెప్పారు.
కాగా ఇది విభిన్న వ్యాపారాల అంతటా ఉన్న ఆర్థిక సేవల సంస్థ మోతీలాల్‌  ఓస్వాల్‌?  మూలధన మార్కెట్ వ్యాపారాలు (రిటైల్ బ్రోకింగ్, సంస్థాగత బ్రోకింగ్ మరియు పెట్టుబడి బ్యాంకింగ్), ఆస్తి మరియు సంపద నిర్వహణ (ఆస్తి నిర్వహణ, ప్రైవేట్ ఈక్విటీ మరియు సంపద నిర్వహణ), హౌసింగ్ ఫైనాన్స్ మరియు ఈక్విటీ ఆధారిత ట్రెజరీ పెట్టుబడులు ఉన్నాయి. 2017 సంస్థ భారీ వృద్ధిని నమోదుచేసింది.  66శాతం జంప్‌ చేసి రూ. 1,818 కోట్ల ఆదాయిన్ని  సాధించింది. లాభం రూ. 360 కోట్లుగా నమోదు చేసింది.  ఈ లాభాల్లో  సగానికి పైగా హౌసింగ్ ఫైనాన్స్, అసెట్ అండ్‌  వెల్త్ మేనేజ్మెంట్   బిజినెస్‌ ద్వారా సాధించినట్టు కంపెనీ పేర్కొంది. సంస్థ మార్చి 2017 నాటికి హౌసింగ్‌ ఫైనాన్స్‌ లోన్‌బుక్‌ రూ.4,100కోట్లుగాఉంది.
 

Advertisement
 
Advertisement
 
Advertisement